Latest Updates
-
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ!
బబ్లీ బ్యూటీ సమంత డైట్ ప్లాన్ మరియు ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా..
బబ్లీ బ్యూటీ సమంత డైట్ ప్లాన్ మరియు ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా..
సమంతా అనగానే ఆమె అభిమానులకి గౌతం మీనం సినిమా "ఏం మాయ చేసావే" లో ఆమె పోషించిన జెస్సీ పాత్ర గుర్తొస్తుంది.ఆమె వల్లే ఆ సినిమా ని మళ్ళీ మళ్ళీ చూసినవాళ్ళున్నారు అంటే అతిసయోక్తి కాదు.ఆమె తన ఆకర్షణీయ రూపంతో ప్రేక్షకులని కట్టిపడేసింది ఆ సినిమాలో. అప్పుడే కాదు ఐదేళ్ళ తరువాత కూడా ఆమె ని దేవత లాగ కొలుస్తారు ఆమె అభిమానులు.ఇప్పటివరకూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె అగ్ర తార.
నాజూకైన శరీరం,క్యూట్ గా ఉండే చిరునవ్వు,ఇంకా యవ్వనం లో ఉన్నట్లుండే ఆమె ఎందరో కాలేజీ అమ్మాయిలకి ఆదర్శం.ఎవ్వరికుండదు చెప్పండి ఆమెలాగ కట్టిపడేసే అందంతో ఉండాలని??నాకు ఆమె ఫిట్ నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్,అందం కోసం తీసుకునే జాగ్రత్తలు తెలిస్తే నేనూ వాటిని తప్పక పాటిస్తాను.

ఆమె ఏమి వ్యాయామాలు చేస్తుంది, ఏమి తింటుందో తెలపమని ఐబీటీ కి అనేకమంది వీక్షకులనుండీ అభ్యర్ధనలొస్తున్నాయి.మీ కోరిక ఇప్పటికి తీరబోతోంది. ఆమె చేసే వర్కవుట్స్ , పాటించే డైట్ నియమాలు, ఆమె ఫిట్ నెస్ సీక్రెట్లు ఇస్తున్నాము, చూడండి మరి.

సమంతా వర్కవుట్స్
ఆమె ఎంత బిజీ గా ఉన్నా సరే జిమ్ము కి తరచుగా వెళ్తుంది.వర్కవుట్లకి ఎక్కువ సమయం కోసం పొద్దున్నే లేస్తుంది.తన నాజూకు శరీరాన్ని అలాగే ఉంచుకోవడానికి తరచూ వర్కవుట్లు చేస్తుంది.గ్లామరస్ గా పైకి కనిపించడం ఎంత ముఖ్యమో ,మనసు కూడా అంతే అందంగా ఉండాలని నమ్ముతారామె.దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఫిట్ గా ఉండేవాళ్ళలో ఆమె కూడా ఒకరు.తాను ఫిట్ గా ఉండటానికి కారణం తన ట్రైనర్ రాజేష్ అనీ, అతనికి ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ కూడా చేసింది.

ఫిట్ గా ఉండటానికి తను ఎంతో నిబద్ధతతో ఉంటుందని సమంతా ట్రైనర్ రాజేష్ అంటారు. చెన్నై వచ్చినప్పుడు సమంతా వర్కవుట్లకోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తుందనీ ఆమె నిబద్ధత చూసి ఆశ్చర్యపోతుంటానని అంటారాయన.మొదటినుండీ ఆమె ప్రాధాన్యత వర్కవుట్ల ద్వారా శక్తి పొందడమే.ఎప్పుడూ తన ట్రైనింగ్ సెషన్ కి 15 నిమిషాలు ముందుగా వస్తుందామె.ఒకవేళ పొద్దున్నే కనుక షూటింగుంటే పొద్దున్నే అంటే ఐదింటికల్లా జిమ్ము కి వస్తుంది.సమంతా చాలా ఫిట్ గా ఉండే సెలిబ్రిటీల్లో ఒకరు అంటారు రాజేష్.

బాగా చెమటపట్టి తద్వారా శరీరంలో నుండి వ్యర్ధాలని బయటకి పంపేట్లుగా వర్కవుట్లు చేస్తుంది సమంత. తద్వారా ఆమె తన శరీరాన్ని నాజూకుగా ఉంచుకోగలుగుతుంది.బాగా చెమట పట్టడం వల్ల ఆమె చర్మం కూడా ఆరోగ్యం గా ఉంటుంది.ఒక క్రమబద్ధమైన జీవన విధానం వల్ల ఫిట్ గా ఉండటంతో పాటు అందాన్ని కూడా కాపాడుకుంటుంది సమంత.శరీరానికి బాగా శ్రమ కలిగించేవ్యామాలు, తేలికపాటి వ్యాయామాలూ మార్చి మార్చి సమంతతోచేయిస్తారు ఆమె ట్రైనర్ రాజేష్.

ఒకవేళ ఈ వర్కవుట్లకి సమంత కి సమయం చిక్కకపోయినా లేదా చెన్నై లో కాకుండా ఇంకెక్కడ ఉన్నా తన వర్కవుట్లకి ప్రత్యామ్నాయం గా జాగింగ్ చేస్తుంది సమంత.
సమతా ప్రభూ డైట్ ప్లాన్:
ఉపవాసాలు, డైటింగులంటే పెద్దగా ఆసక్తి చూపదు సమంత.అన్ని రకాలా ఆహార పదార్ధాలూ మితం గా తీసుకుంటారామె.తన శరీరం లో క్యాలరీలు చేరతాయన్న భయం లేకుండా తనకి నచ్చింది తింటుంది సమంత.తన వ్యాయామాలకి తగినట్లుగా ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారాన్ని ఇష్టం గా తింటుందామె.

మిగతా సెలిబ్రిటీల లాగె తన డయట్ లో నట్స్,బెర్రీస్,కూరగాయలతో చేసిన సలాడ్లు,పండ్లు,లీన్ మీట్ ఉంటుందంటారు ఆమె ట్రైనర్.కానీ ఈ అందాల సుందరికి సాంబారన్నం ఎంతో ఇష్టం.తమిళ వంటకాలైన దోశ, వడ,ఇడ్లీ,పొంగల్ అంటే ఈమెకి ప్రాణం.వీటిని తినకుండా తనని తాను కట్టడి చేసుకోలేనంటారామె.అంటే భారతీయ ఆహారం విషయంలో తను మామూలు తమిళ అమ్మాయన్నమాట.
ఇంకా సమంత కి చికెన్, చేపలు,కారం గా ఉండే పచ్చళ్ళు, స్వీట్ పొంగల్, ఫిల్టర్ వేసిన బ్లాక్ కాఫీ ఇష్టం.మంచి నీళ్ళు, కొబ్బరి నీరు, జ్యూసులు తరచుగా తీసుకుంటూ తన శరీరానికి కావాల్సిననత హైడ్రేషన్ అందిస్తుంది.

ఎప్పుడూ లైం లైట్ లో ఉండాలంటే నిత్యం మనల్ని మనం గ్రూం చేసుకోవాలి అంటారామె."ఎప్పటికప్పుడు నేను నా స్టైల్ ని మార్చుకుంటూ ఒక ప్రత్యేకమైన స్టాండర్డ్ సృష్టించాలని చూస్తాను.నాకు వదులుగా ఉండే బట్టలు నచ్చవు.క్లాసీ గా ఉండి స్త్రీ తత్వాన్ని ప్రతిబించించే దుస్తులంటే ఇష్టం నాకు" అంటుంది ఈ అందాల తార.
ఎప్పుడూ తన హ్యాండ్ బ్యాగ్ లో సన్ స్క్రీన్ ఉంటుందని చెప్తుందామె. వివిధ రకాలా ప్రదేశాలకి ప్రయాణాలు చెయ్యాల్సిరావడం , ఎండలో పని చెయ్యాల్సి రావడం వల్ల సన్ స్క్రీన్ ని ఎప్పుడూ మర్చిపోనంటుంది సమంత.

ఆఖరుగా సమంత చెప్పేదేమిటంటే "మీరు శ్రద్ధా గా చేస్తే ఏదైనా సాధించగలరు". ఆమె సెలిబ్రిటీ కుటుంబం నుండి రాలేదు. కలలు కని శ్రద్ధగా కష్టపడితే మీరు కూడా సాధిచలేనిదేమీ లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్న బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా సులభం. మీ రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చుకోవడానికి.. ఆరోగ్యకరమైన మార్గాలలో ఇదొకటి. ముందుగా మీకు నచ్చిన పండ్లను, కూరగాయలు మరియు ఇతర గింజలను తీసుకోండి. వాటిని ఒకదానితో కలపండి. దానిపైన కొన్ని కరకరలాడే గింజలు వేయండి. వాటినిన్నంటిని ఒక బౌల్ లో వేసేయండి. అంతే మీరు కోరుకున్న అల్పహారం అత్యంత తక్కువ సమయంలో సిద్ధమైనట్టే. సమంత కూడా ఈ ఉదయం తన ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ బౌల్ ను మనతో షేర్ చేసుకుంది. వీటిలో చియా విత్తనాలు మరియు కొబ్బరి తరుముతో పాటు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications