Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
ఏడు ఆహారాలను రోజూ తీసుకుంటే బరువు తగ్గడం తేలికే..!!
హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయినప్పుడు మాత్రమే.. బరువు తగ్గడం సాధ్యమవుతుంది. వ్యాయామం, ఇతర శారీరక యాక్టివిటీస్ వల్ల శరీరం షేప్ లో ఉంటుంది, కానీ.. మీరు బరువు తగ్గాలి అనుకుంటే.. న్యాచురల్ పద్ధతులు పాటించండి. ఇప్పుడు చెప్పబోయే ఆహారాలపై నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.
ఈ ఏడు ఆహారాలను ప్రతి రోజూ కంపల్సరీ తీసుకోవడం వల్ల.. మీరు అనుకున్న బరువు తగ్గడాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి.. ఖచ్చితంగా వీటిని మీ డైలీ డైట్ లో చేర్చుకుని.. క్రమం తప్పకుండా తిని చూడండి. ఇవి హెల్తీ ఫుడ్స్ కావడం, ఫ్యాట్ కరించే సత్తా కలిగి ఉండటం, పోషకాలు అందించే ఆహారాలు కావడం వల్ల వీటిని మీకు సూచిస్తున్నాం.

ఓట్స్
ఓట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఇవి బ్లడ్ షుగర్ ని పెరగకుండా చేస్తాయి. అలాగే ఎక్కువ సమయం ఆకలి కాకుండా చూస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

దోసకాయ
దోసకాయల్లో ఎక్కువ శాతం నీళ్లు ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి పొట్టలో ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వీటిని ఖచ్చితంగా చేర్చుకోవాలి.

ఎగ్స్
ఎవరైతే.. ప్రతి రోజూ ఉదయం కోడిగుడ్డు తింటారో వాళ్లు.. రెండు రెట్లు వేగంగా, ఎక్కువగా బరువు తగ్గుతారు.

ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది పొట్టలో చేరుకున్న ఫ్యాట్ ని కరిగిస్తుంది. రోజుకి ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ చాలా ఆరోగ్యకరం, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అరటిపండు
అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ని కరిగిస్తుంది. పొటాషియం శరీరంలో సాల్ట్, వాటర్ లెవెల్ ని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా అరటిపండు తినండి.

సోంపు
సోంపులో ఫైబర్, మాంగనీస్, క్యాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతి రోజూ భోజనం తర్వాత ఒక స్పూన్ సోంపు గింజలు తీసుకుంటే.. అద్భుతంగా బరువు తగ్గేస్తారు. కావాలంటే.. ప్రయత్నించి చూడండి.

పెరుగు
పెరుగులో ఉండే క్యాల్షియం కొలెస్ట్రాల్ హార్మోన్ ని తగ్గిస్తుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా శరీరంలో గ్యాస్, బ్లోటింగ్ సమస్యను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications
