Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
వేగంగా బరువు తగ్గడానికి సహాయపడే బెస్ట్ లో షుగర్ ఫ్రూట్స్
బరువు తగ్గాలంటే.. తక్కువ తినాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతిలో.. సరైన ఆహారం తీసుకుంటే చాలు. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఆహారాలు.. మార్కెట్ లో చాలా ఉన్నాయి. కానీ.. ఫ్యాట్ కరిగించే, బరువు పెరగకుండా ఉంచే ఆహారాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం.
పండ్లు..! ఉదాహరణకి.. బరువు తగ్గాలనుకునే వాళ్లు రోజు వారీ డైట్ లో చేర్చుకోవడానికి ఇవి చక్కటి ఆప్షన్. ఫ్రూట్స్ లలో ముఖ్యమైన పోషకాలు, ఫైబర్, చక్కెర ఉంటాయి. ఇవన్నీ శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారు.
పండ్లలో న్యాచురల్ షుగర్ ఉండటం వల్ల.. బరువు తగ్గాలనుకునేవాళ్లు వీటిని తీసుకోవడం మంచిదని డాక్టర్స్ సూచిస్తున్నారు. కాబట్టి లో షుగర్ ఫ్రూట్స్ ని డైట్ లో చేర్చుకుంటే.. బరువు తగ్గడం తేలికవుతుంది. 7 నుంచి 23 గ్రాముల షుగర్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తితో పాటు క్యాలరీలను కరిగిస్తాయి. మరి బరువు తగ్గడానికి సహాయపడే.. లో షుగర్ ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందామా..

నిమ్మ
బరువు తగ్గడానికి నిమ్మకాయ చాలా మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. నిమ్మరసం తాగడం వల్ల క్యాలరీలు కరిగించి.. మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.

బొప్పాయి
తక్కువ షుగర్ ఉన్న పండ్లలో బొప్పాయి ఒకటి. దీంట్లో 10 గ్రాముల షుగర్ ఉంటుంది కాబట్టి.. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం తేలికవుతుంది. అలాగే ఇందులో విటమిన్ సి, ఏ, ఫోలేట్, పొటాషియం ఉంటాయి.

యాపిల్
యాపిల్స్ లో 17 గ్రాముల షుగర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఎక్కువ సమయం పొట్టనిండిన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లకు యాపిల్ మంచి పరిష్కారం.

వాటర్ మిలాన్
వెయిట్ లాస్ కి వాటర్ మిలాన్ తీసుకోవాలని నిపుణులు ఎక్కువగా సూచిస్తారు. ఎందుకంటే.. ఈ ఫ్రూట్ లో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే 10 శాతం న్యాచురల్ షుగర్ ఉంటుంది. ఇది మెటబాలిజం సజావుగా ఉండటానికి సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీస్ లో 7 గ్రాముల షుగర్, ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బ్లూ బెర్రీ
బ్లూ బెర్రీస్ లో 18 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇతర ఫ్రూట్స్ తో పోల్చితే ఇందులో తక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి.. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు బర్న్ అవుతాయి.

పీచ్
పీచ్ ఫ్రూట్స్ లో విటమిన్ సి, విటమిన్ ఏ, బీటా కెరోటిన్ లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు.. ఈ ఫ్రూట్ ని సమ్మర్ లో తినడం వల్ల న్యాచురల్ గా క్యాలరీలు కరుగుతాయి.



Click it and Unblock the Notifications
