Latest Updates
-
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి!
నడుము నాజూగ్గా మార్చే 8 స్లిమ్మింగ్ ఫుడ్స్..
యవ్వనంలో ఉన్నప్పుడు అందమైన నాజూకైన శరీరాన్ని కలిగి ఉంటారు. అందమైన బాడీ షేప్ కు తగ్గట్టు డ్రెస్సింగ్ స్టైల్ ను ఎంపిక చేసుకోవడం, అందంగా అలంకరించుకోవడం అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం .
ఏజ్ పెరిగే కొద్ది, శరీరంలో కొవ్వు కణాలు పెరగడం జరుగుతుంది, ముఖ్యంగా నడుము చుట్టూ ఫ్యాట్ పేరుకోవడం వల్ల బాడీ షేప్ లో మార్పులు వస్తాయి, నడుము చుట్టుకొలత పెరగడంతో బెల్లీ ఫ్యాట్ గా కనబడుతుంది. పొట్ట ఉదరంలో ఫ్యాట్ చేరడం వల్ల చిరుబొజ్జ కనబడుతుంటే ఇష్టైన డ్రెస్సులను వేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. మార్కెట్, షాపుల్లో వివిధ రకాల మోడ్రన్ డ్రెస్సులను చూడటంతో మనస్సులో ఆందోళన కాస్త పెరిగి, స్ట్రెస్ గా ఫీలవుతుంటారు .
అలా ఫీలవ్వకుండా తిరిగి మీ కాలేజ్ డేస్ ఫిగర్ ను మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అదే బాడీ షేప్ పొందాలంటే ఫిజికల్ యాక్టివిటీస్ తో పాటు కొన్ని స్లిమ్మింగ్ ఫుడ్స్ ను మీ ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే..గుర్తొచ్చినప్పుడు తింటే స్లిమ్ గా తయారవ్వొచ్చు.
మనం రెగ్యులర్ గా తినే ఆహారాలే అయినా, కొన్ని కామన్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా చేర్చుకుంటే టమ్మీ మరియు విస్ట్ లైన్ ను స్లిమ్ గా మార్చుకోవచ్చు . ఈ ఆహారాలతో హెల్తీ మరియు ఫ్యాబులస్ లుక్ ను మీసొంతం చేసుకోవచ్చు .
నడుము నాజూగ్గా మార్చే కొన్ని విస్ట్ స్లిమింగ్ ఫుడ్స్ ఎంటో తెలుసుకోవాలని మీకు ఆత్రుతగా ఉందా? మరి అయితే వాటర్ మెలోన్ బెర్రీస్ వంటివి ఫ్రిజ్ లో దాచేసుకొని స్లిమ్ గా తయారైపోండి . ఫ్రింజ్ లో స్లిమింగ్ ఫుడ్స్ తో పాటు హెల్తీ ఫుడ్స్ ను కూడా రెగ్యులర్ గా తింటుంటే బెల్లీ వద్ద మెండిగా మారిన ఫ్యాట్ ను కరిగించి స్లిమ్ గా మారవచ్చు.
ఈ స్లిమ్మింగ్ ఫుడ్స్ తో పాటు రెగ్యులర్ వ్యాయామం మరియు ఎక్కువగా నీరు తాగడం వంటివి తప్పనిసరిగా చేయాలి. ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి . స్లిమ్ గా తయారవ్వాలంటే బ్రేక్ ఫాస్ట్ ను మిస్ చేయకూడదు. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల శరీరంలో అదనంగా మరికొంత కొవ్వు చేరుతుంది.
విస్ట్ స్లిమ్మింగ్ ఫుడ్స్ ను కొన్నింటిని లిస్ట్ అవుట్ చేసి ఈ క్రింది స్లైడ్ లో ఇవ్వడం జరిగింది. వీటిని మీ ఫ్రిజ్ లో నిల్వచేసుకొని, రెగ్యులర్ వ్యాయామాలతో పాటు వీటిని తినడం వల్ల నడుము నాజూగ్గా మార్చుకోవడం సులభం అవుతుంది.
నడుము నాజూగ్గా మార్చే ఆహారాలేంటో చూద్దాం...ః

1. బెర్రీస్:
స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల శరీర బరువు మాత్రమే కాదు, నడుము చుట్టుకొలత పెరుగుతుంది? కాబట్టి, స్వీట్స్ తినకుండా బెర్రీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి . ఫ్రెష్ గా మరియు బాగా పండిన బెర్రీస్ ను ఫ్రిజ్ లో స్టోర్ చేసి, రోజులో అప్పుడప్పుడు తీసుకుంటుండాలి. బెర్రీస్ తినడం వల్ల స్వీట్స్ తినాలనే కోరిక తగ్గడంతో పాటు, స్వీట్ టేస్ట్ ను రుచి చూడవచ్చు,

2. బాదం:
మరో బెస్ట్ స్లిమ్మింగ్ ఫుడ్ బాదం. బాదంలో ఫాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉండటం వల్ల, ఆకలి కలగకుండా నివారిస్తుంది . రోస్ట్ చేసి బాదం ఈవెనింగ్ స్నాక్స్ గా తీసుకోవడానికి ఒక బెస్ట్ చాయిస్.వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంది. మెగ్నీషియం మజిల్ బిల్డ్ చేయడానికి, బెల్లీఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుంది.

3. చియాసీడ్స్:
శరీరంలో చేరిన ఫ్యాట్ ఎంతకీ కరగకపోతే అది ప్రమాధకరంగా మారుతుంది. ఇలా మెండిగా మారిన కొవ్వు కణాలను కరిగించడంలో చియీసీడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . బెల్లీ ఫ్యాట్ ను కరిగించడాని ఇవి ఇక పవర్ ఫుల్ వెపన్ గా మారుతుంది. . చీయాసీడ్స్ లోఉండే ప్రోటీన్ ఎక్కువ సమయం ఆకలి కాకుండా పొట్ట ఫుల్ గా ఉండే ఫీలింగ్ ను కలిగిస్తుంది. దాంతో వేరే ఇతర ఆహారాలు తినకుండా కంట్రోల్ చేస్తుంది.

4. బీన్స్:
విస్ట్ స్లిమ్మింగ్ ఫుడ్ లో బీన్స్ ఒకటి . బీన్స్ ఆరోగ్యానికి మంచిది. సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బీన్స్ లో ఉండే గుణాలు ఫ్యాట్ ను అటాక్ చేస్తుంది మరియు ఫ్యాట్ ను కరిగిస్తుంది. . మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

5. హాట్ పెప్పర్స్:
బోజనానికి ముందు ఏదైనా స్పైసీగా తినాలనుకొన్నప్పుడు, హాట్ పెప్పర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల 25శాతం మెటబాలిజం రేటు పంెచుతుంది ఇది శరీరంలో క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది . తక్కువ ఆకలిని కలిగిస్తుంది.

6. సెలరీ:
ఫ్యాట్ టమ్మీ కరిగించి , నడుము నాజూగ్గా మార్చే ఆహారాల్లో ఒకటి సెలరీ. దీన్ని తప్పనిసరిగా ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవల్సిందే . ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో క్యాలరీలు తక్కువ . ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది . ఇది మిమ్మల్ని స్లిమ్ గా మార్చడంతో పాటు ఫిట్ గా చేస్తుంది. ఇది ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

7. కేలా:
నిపుణుల అభిప్రాయం ప్రకారం కేలాలో విటమిన్ కె పుష్కలంగా ఉంది. ఇది శరీరంలో ఎలాంటి ఇన్ఫ్లమేషన్ అయినా తగ్గిస్తుంది . మరియు ఇది కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. కాబట్టి, సూప్స్ మరియు సలాడ్స్ రూపంలో వీటిని తీసుకోవాలి.

8. పెరుగు:
మీరు విస్ట్ స్లిమ్మింగ్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవల్సిన వాటిలో మరో హెల్తీ ఫుడ్ పెరుగు ?దీన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని, రెగ్యులర్ గా తినాలి . ఫ్లేవర్డ్ యోగర్ట్ ను నివారించి, నేచురల్ గా ఇంట్లో స్వయంగా తయారుచేసుకొన్న పెరుగును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల విస్ట్ లైన్ తగ్గుతుంది.



Click it and Unblock the Notifications











