Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
బరువు తగ్గించడంలో సూపర్ పవర్ మొలకెత్తిన గింజలదే..!
బరువు తగ్గాలి. కానీ.. ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలి. బరువు తగ్గే ప్రాసెస్ లో పోషకాలను ఏ మాత్రం మిస్సవకూడదు. అప్పుడే హెల్తీగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. కాబట్టి బరువు తగ్గాలని తిండి తగ్గించినప్పటికీ.. తీసుకునే కొంచెం ఆహారంలోనే ఎక్కువ పోషకాలు పొందేలా జాగ్రత్త పడాలి. శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా డైట్ ఫాలో అవ్వాలి.
మొలకలు(స్ప్రాట్స్)లోని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారా ? కానీ ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలో అర్థం కావడం లేదా ? అయితే మొలకెత్తిన గింజలను మీ డైట్ లో చేర్చుకోండి మీరే వండర్ అవుతారు. మొలకెత్తిన పెసలు వెయిట్ లాస్ ప్లాన్ కి పర్ఫెక్ట్ డైట్. ఇందులో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి... క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనివల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది.

రాత్రిపూట భోజనానికి బదులు కొన్ని పండ్లు తిని.. తర్వాత ఒక కప్పు లేదా రెండు కప్పుల ఉడకబెట్టిన మొలకెత్తిన గింజలు తిని చూడండి.. బరువు తగ్గడానికి ఈ డైట్ ఎంత అమేజింగ్ గా వర్క్ అవుతుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఎక్కువ సమయం ఉడకబెట్టకుండా జాగ్రత్త పడాలి. లేదంటే.. పోషకాలు మిస్సవుతారు. అలాగే ఉడకబెట్టిన తర్వాత ఆ నీటిని పడేయకుండా.. కొద్దిగా ఉప్పు కలుపుకుని సూప్ లా తాగేయండి. ఇదో చక్కటి బరువు తగ్గే మార్గం.
తేలికగా బరువును తగ్గించే ఐదు రకాల హెల్తీ సలాడ్స్
శారీరకంగా, మానసికంగా ఎల్లప్పుడూ ఉత్సాహంగా చురుగ్గా ఉండాలంటే వారానికి ఒకసారైనా మొలకెత్తిన గింజలను డైట్ లో చేర్చుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా వారానికి ఒకసారి డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ర్టాల్ అదుపులో ఉంటుంది. మొలకెత్తిన గింజల వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అంతేకాదు మాంసాహారం ద్వారా పొందే అధిక ఫ్యాట్ శరీరంలో పేరుకోకుండా అరికట్టడంలో మొలకెత్తిన గింజలు చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. కాబట్టి మధ్యాహ్నం మాంసాహారం తీసుకున్నప్పుడు సాయంత్రం స్ర్పౌట్స్ ని స్నాక్స్ గా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నాయి స్టడీస్. ఈ సింపుల్ ట్రిక్ మీకు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
