పురుషుల్లో ఊబకాయంను తగ్గించే లైఫ్ స్టైల్ టిప్స్

ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం కూడా ఒక్కటిగా చెప్పవచ్చు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల ఊబకాయం సమస్య మరింత పెరుగుతూ వస్తోంది. శరీరంలో అవసరమైనదానికి కన్నా ఎక్కువ మొత్తంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వల్ల ఊబకాయమనే సమస్య ఉత్పన్నమవుతుంది. ఊబకాయం వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది.

ఊబకాయం నేటి తరంలో పీడిస్తున్న అతి పెద్ద సమస్య. అమెరికా, చైనా దేశాలు ఊబకాయంలో మొదటి, రెండు స్థానాలలో ఉండగా మన దేశం మూడో స్థానంలో నిలిచింది. రాబోయే కాలంలో ఈ రెండు దేశాలను దాటుకొని ముందుకు పోయేంతగా మన దేశంలో ఈ సమస్య తీవ్రమవుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి. జీవనశైలిలో మార్పులు, ఆహరపు అలవాట్లు, వ్యాయామ లోపం ముఖ్యకారణాలు కాగా, కొందరిలో ఇది జన్యుపరమైన సమస్యగా భావించవచ్చు.

స్థూలకాయం(ఒబేసిటీ) తగ్గించే హోం రెమిడీస్

ఒక వ్యక్తి ఉండవలసిన బరువు కన్నా 20శాతం ఎక్కువగా ఉంటే ఆతను ఊబకాయం ఉందని చెప్పవచ్చు. మనం ఆహరంలో అతిగా కాలరీలు తీసుకొని, తక్కువ కాలరీలు ఖర్చుచేయటం వల్ల అది కొవ్వుగా మారి శరీరంలోని భాగాలలో పేరుకుపోవడం వల్ల ఊబకాయం సంభవించవచ్చు. శరీరంలో అతిగా కొవ్వు పేరుకుపోవడం వల్ల అధిక బరువు సంభవిస్తుంది. డీనినే ఊబకాయం అంటాం. అయితే ఈ ఊబకాయం అనే సమస్య పురుషుల్లో కంటే మహిళల్లోనే కాస్త ఎక్కువగా ఉంటోంది. పురుషుల్లో ఊబకాయం అనేది సాధారణ వైద్య లక్షణాలుగానే పరిగనిస్తారు.

అయితే పురుషుల్లో కనిపించే ఊబకాయ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . కాబట్టి, అలా ఊబకాయంతో జబ్బుల బారీన పడకుండా ఉండాలంటే జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవాలి. జీవితంలో ఈ మార్పులను చేసుకోవడం వల్ల శరీరంలో అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఎలాంటి హార్ట్ డిసీజ్ లు మరియు ఇతర అవయవాలు డ్యామేజ్ కాకుండా నిరోధించుకోవచ్చు.

బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు

ఇప్పటికే 35ఏళ్లు దాటిన వారు వర్కౌట్స్, వ్యాయామాలు, నడక, జాగింగ్ వంటివి చాలా అవసరం వీటిని చేయడం వల్ల ఈ వయస్సులో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు . ఒత్తిడి అనేది ఒక సైలెటంట్ కిల్లర్ ఇది అంతర్గతంగా అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. కాబట్టి, చిన్న వయస్సులో ఊబకాయంతో బాధపడే వారు ఈ క్రింది తెలిపిన లైఫ్ స్టైల్ రూల్స్ ను ఫాలో అవుతూ ఆరోగ్యంగా ఫిట్ గా ఉండటానికి ప్రయత్నించండి.

ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి:

ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి:

రోజులో అధికంగా ద్రవాలు తీసుకోవాలి. ద్రవాలో సిట్రస్ జ్యూసులు మరియు వాటర్ ఇవి పొట్టను ఫుల్ గా నింపడం మాత్రమే కాదు, ఇది మీరు ఎక్కువగా ఆహారం తీసుకోనివ్వకుండా మరియు బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.

 మిల్క్ షేక్స్:

మిల్క్ షేక్స్:

మిల్క్ షేక్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. వీటిలో ఉండే ప్రోటీన్స్, మరియు ఫైబర్స్ శరీరంలో అదనపు క్యాలరీలు మరియు కార్బోహైడ్రేట్స్ చేరకుండా చేసి, బరువును కంట్రోల్లో ఉంచుతాయి.

స్టెప్స్ ఎక్కాలి:

స్టెప్స్ ఎక్కాలి:

ఆఫిసుల్లో, ఇతర బయట ప్రదేశాల్లో లిప్ట్స్, ఎలివేటర్స్ ను ఉపయోగించకుండా స్టెప్స్ ఎక్కడం ఆరోగ్యకరం. స్టెప్స్ ఎక్కడం సులభం మరియు బరువు ను కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. దాంతో ఊబకాయంను తగ్గించుకోవచ్చు.

వీకెండ్స్ లో కూడా వర్కౌట్స్ చేయాలి:

వీకెండ్స్ లో కూడా వర్కౌట్స్ చేయాలి:

వారంలో 5రోజులు వర్కౌట్స్ చేస్తున్నా..వారాంతంలో కూడా వర్కౌట్ చేయడానికి నిరాకరించకండి. వీక్ డేస్ లో మాదిరే వీకెండ్స్ లో కూడా వర్కౌట్స్ కంటిన్యూ చేయడం వల్ల లైఫ్ స్టైల్ లో ఇలాంటి మార్పుల వల్ల కొన్ని అద్భుతాలు జరగవచ్చు . దాంతో ఊబకాయానికి దూరంగా ఉండవచ్చు.

ఆకలితో ఉండకూడదు:

ఆకలితో ఉండకూడదు:

పొట్ట ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల తర్వాత భోజనంలో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచెడు అలవాటు వల్ల మరింత లావుగా మరియు బరువుగా కనబడుతారు.

మీరు ఏం తింటున్నారో గమనించాలి:

మీరు ఏం తింటున్నారో గమనించాలి:

మహిళలు ఆరోగ్యం మీద, స్లిమ్ బాడీ మీద ఏకాగ్రతతో ఎలాంటి ఆహారం నియమాలు పాటిస్తారో, అదే విధంగా పురుషులు కూడా కొన్ని ఆహారా నియమాలు పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడంతో పాటు, ఊబకాయ సమస్యలుండవు.

ఒత్తిడి ఉండకూడదు:

ఒత్తిడి ఉండకూడదు:

స్ట్రెస్ ఒక సైలెంట్ కిల్లర్. ఈ ఒత్తిడిని తల వరకూ తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి . ఒత్తిడి వల్ల ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ఒత్తిడిలో మీరు తీసుకొనే ఆహారం కంటే మరింత ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి పొట్ట ప్రోత్సహిస్తుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకూ ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి.

డిన్నర్ రూల్స్ పాటించాలి:

డిన్నర్ రూల్స్ పాటించాలి:

డిన్నర్ రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. 7 గంటల తర్వాత డిన్నర్ చేయకూడదు. ఈ రూల్ పాటించండం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు ధరిచేరవు మరియు ఎక్కువ ఆహారం తీసుకోవాలనిపించదు. దాంతో ఊబకాయ సమస్యలు ఉండవు.

Story first published: Wednesday, January 13, 2016, 18:06 [IST]
Desktop Bottom Promotion