Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
2 నెలల్లో బరువు తగ్గించే హోంమేడ్ డ్రింక్..!
బరువు పెరగడమనేది అతిపెద్ద సమస్య. ఇది కొంతమందిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని కూడా తగ్గించేస్తుంది. అలాగే అనేక అనారోగ్య సమస్యలకు అధిక బరువు కారణమవుతుంది. అలాగే స్లిమ్ గా ఉండటమనేది కూడా ఇప్పుడు ట్రెండ్.
అంతేకాకుండా.. అధిక బరువు ఉండటం వల్ల జాయింట్ పెయిన్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్, డయాబెటస్, కరోనరీ డిసీజ్ లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. మీ వయసుకి, ఎత్తుకి సరిపడా వెయిట్ ఉండటం చాలా అవసరం. కాబట్టి బాడీ వెయిట్ కరెక్ట్ ఉండటం కోసం రకరకాల జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క డ్రింక్ ఇంట్లో తయారు చేసుకుని తాగితే.. మీరు కోరిన స్లిమ్ ఫిట్ మీ సొంతమవుతుంది.
వ్యాయామం చేయకపోవడం, డైట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వారసత్వం వంటి రకరకాల కారణాల వల్ల బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏదైనా.. హెల్తీ వెయిట్ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. బరువు తగ్గడమనేది మరీ అంత కష్టమైన పనేంకాదు. లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు తీసుకు వస్తే ఎఫెక్టివ్ గా బరువు తగ్గవచ్చు.
మీకు తెలుసా.. టమోటా జ్యూస్ ని రెండు నెలలపాటు రెగ్యులర్ గా తాగడం వల్ల బరువు తగ్గుతారని ? ఆశ్చర్యంగా ఉందా.. టమోటా జ్యూస్ తో బరువు తగ్గడం ఏంటని. నిజమే.. టమోటా జ్యూస్ క్రమం తప్పకుండా 2 నెలలు తాగితే.. బరువు తగ్గడం తేలికే. ఇంకెందుకు ఆలస్యం ఈ టమోటా డ్రింక్ ప్రిపరేషన్ ఎలానో చూడండి.

కావాల్సిన పదార్థాలు
ఇంట్లోనే ఈ డ్రింక్ తయారు చేయడానికి తేనె, టమోటా, మిరియాలు తీసుకోవాలి.

టమోటా
టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే విటమిన్ సి, ఫైటో న్యూట్రియంట్స్ ఉండటం వల్ల ఫ్యాట్ సెల్స్ ని తేలికగా కరిగిస్తాయి. టమోటాల్లో ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. దీనివల్ల ఫ్యాట్ ని వేగంగా కరిగిస్తుంది.

నల్ల మిరియాలు
నల్లమిరియాల్లో ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల.. బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.

తేనె
తేనె ఫ్యాట్, టాక్సిన్స్ ని శరీరం నుంచి బయటకు పంపుతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

ఎలా తయారు చేయాలి ?
రెండు బాగా పండిన టమోటాలు తీసుకుని బ్లెండర్ లో మెత్తగా చేయాలి. మిరియాలను పౌడర్ చేయాలి. ఈ రెండింటినీ ఒక కప్పులో మిక్స్ చేయాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేసి.. బాగా కలపాలి. ఇప్పుడు డ్రింక్ రెడీ అయిపోయింది.

రెగ్యులర్ గా
ఈ డ్రింక్ ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. కనీసం 2 నెలలు క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు తగ్గుతారు.



Click it and Unblock the Notifications