Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
పరకడుపున ఈ జ్యూస్ తాగారంటే.. ఖచ్చితంగా బరువు తగ్గుతారు..!
బరువు తగ్గడానికి చాలా విభిన్న పద్ధతులు ఉన్నాయి. వ్యాయామం, డైట్ వంటివి బరువు తగ్గడానికి సహాయపడతాయి. అయితే.. వీటిని ఫాలో అవడానికి చాలా మంది ఇష్టపడరు. ఎఫెక్టివ్ గా ఫాలో అవలేకపోతారు. అందుకే.. సింపుల్ సొల్యూషన్ కోసం ఎదురుచూస్తుంటారు.

వ్యాయామం, డైట్ ఫాలో అవడానికి లేజీగా ఫీలయ్యే వాళ్లు.. చాలా ఎఫెక్టివ్ రెమిడీ ఒకటి ఉంది. తేలికగా బరువు తగ్గడానికి, వ్యాయామానికి తీరిక లేకుండా.. కంప్యూటర్ల ముందు కూర్చుని వర్క్ చేసేవాళ్లకు బరువు తగ్గడానికి.. సహాయపడే డ్రింక్ ఉంది.

మొదట్లో దీన్ని తాగడానికి కాస్త ఇబ్బంది పడినా.. రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే.. ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తారు. ఈ డ్రింక్ తాగడం వల్ల మెటబాలిజం చాలా వేగంగా.. పెరిగి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కావాల్సిన పదార్థాలు
2టీస్పూన్ల తేనె
1 టీస్పూన్ చెక్క
1 కప్పు నీళ్లు.

తయారు చేసే విధానం
ముందుగా ఒక కప్పు నీటిని.. ఉడికించాలి. తర్వాత.. అందులో దాల్చిన చెక్క పొడి వేసి.. దానిపై ప్లేట్ పెట్టాలి. తాగడానికి వీలుగా ఉండే వేడి ఉన్నప్పుడు.. తేనె మిక్స్ చేయాలి. తేనె మిక్స్ చేసేటప్పుడు చాలా వేడిగా ఉండకూడదు. ఈ మిశ్రమంలో సగ భాగాన్ని రాత్రి నిద్రపోయే ముందు, మరో సగంను.. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత తీసుకోవాలి. అంతవరకు దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అయితే.. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల.. ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
