For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడుగు కాళ్ల సుందరి, బాలీవుడ్ భామ దీపికా పదుకొనే మళ్లీ జిమ్ బాట పట్టింది.. ఎందుకో తెలుసా..?

|

సినిమా హిరోలు, హీరోయిన్లు తమ ఫిట్ నెస్ ఫిగర్ ను మెయింటెన్ చేయడానికి ఎంతలా కష్టపడతారో చాలా మందికి తెలీదు. ప్రతి సినిమాలో కొత్తగా, మరింత అందంగా, హాట్ హాట్ గా కనిపించేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. తాజాగా బాలీవుడ్ అందాల భామ, పొడుగు కాళ్ల సుందరి, రణవీర్ సింగ్ భార్య అయిన దీపికా పదుకొనే తాను ఫిట్ నెస్ కోసం ఎంతలా కష్టపడుతుందో పిలేట్స్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఏముందో.. దీపికా ఎందుకోసం మళ్లీ సడన్ గా జిమ్ బాట పట్టిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రస్తుతం బాలీవుడ్ లో పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే మరోసారి హైలెట్ అయ్యింది. ఎందుకంటే తాను కూడా హీరోల మాదిరిగా తన బాడీని మరింత్ హాట్ గా తయారు చేసుకునేందుకు, కొన్ని షేప్స్ కోసం ఎక్కువగా కసరత్తులు చేస్తోంది.

కొంతమంది హీరోల్లాగా గంటల కొద్దీ జిమ్ లో గడుపుతోంది. ఫిట్ నెస్ విషయానికొస్తే అది కేవలం ఫిజికల్ గా మంచి లుక్ తెచ్చేందుకు ఒక్కటే కాదు.. ఇది మానసిక స్థితిని, అలాగే ఆధ్యాత్మికత భావనను ప్రభావితం చేస్తుందని చాలా మంది చెబుతుంటారు.

ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన దీపికా పదుకొనే..

ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన దీపికా పదుకొనే..

దీపికా పదుకొనేకు రణవీర్ సింగ్ తో వివాహం అయినప్పటి నుండి తన ఫిట్ నెస్ పై పెద్దగా శ్రద్ధ చూపలేదు. తన అందం, ఆరోగ్యంపైనే అనేక జాగ్రత్తలు తీసుకోవడానికి ఆసక్తి చూపింది. కానీ తన భర్త రణవీర్ సింగ్ తో నటించనున్న కొత్త సినిమా కోసం తాను మరింత కొత్తగా కనబడాలనుకుంది. అందుకే అందం, ఆరోగ్యంతో పాటు ఫిట్ నెస్ పై దృష్టి మరల్చింది. అనుకున్నదే తడవుగా జిమ్ లో అడుగు పెట్టింది. అక్కడా పిలేట్స్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా శిక్షణలో సాధన చేసింది.

దీపికా వ్యాయామం విన్యాసాలు..

దీపికా వ్యాయామం విన్యాసాలు..

దీపికా తన బాడీ ఫిగర్ మెయింటెన్ చేసేందుకు ఎంతలా కష్టపడుతుందో ప్రపంచానికి తెలియజేసేందుకు ఆ పిలేట్స్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో దీపికా బ్లాక్ డ్రస్ వేసుకుని పైలెట్స్ మిషన్ ద్వారా వ్యాయామం చేశారు. 33 ఏళ్ల వయసులోనూ దీపికా పదుకొనే తన వర్కౌట్ సెషన్ కోసం పెలైట్స్ బెంచ్ లో ఆధునాతన మల్టీ యాంగిల్స్ లో చేయడం మీరు వీడియోలో చూడవచ్చు.

వీడియోలో మంచి ఉద్దేశ్యం..

వీడియోలో మంచి ఉద్దేశ్యం..

దీపికా తాజాగా జిమ్ లో చేసిన వర్కవుట్స్ కు సంబంధించిన వీడియోలో మంచి ఉద్దేశ్యం కూడా ఉంది. అదేంటంటే ఎవరైనా కానీ మొదట వారి శరీరంపై ఆసక్తి పెంచుకోవాలి. ఆ తర్వాత మీ శరీరాన్ని ప్రేమించాలి. అలాగే గౌరవించాలి. అవొక్కటే చేస్తే సరిపోదు. ఎంతో జాగ్రత్తగా మన శరీరాన్ని కాపాడుకోవాలి. మన శరీరాన్ని మనం ప్రేమించకుంటే మనకు ఏదైనా జబ్బు వచ్చే అవకాశమూ ఉంది. అందుకే మన శరీరం పట్ల మనం ఎల్లప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

దీపికా లాగా వర్కవుట్స్ చేయాలని ప్రయత్నించకండి..

దీపికా లాగా వర్కవుట్స్ చేయాలని ప్రయత్నించకండి..

చివరగా ఇంకో విషయం ఏమిటంటే దీపికా ఫిజికల్ ఫిట్ నెస్ వీడియో చాలా మందిని ప్రభావితం చేస్తుందని మేము భావిస్తున్నాం. అయితే మీరు కూడా దీపికా లాగా వర్కవుట్స్ చేయాలని మాత్రం ప్రయత్నించకండి. మీ ఫిట్ నెస్ లెవెల్ బట్టి ప్రాక్టీస్ చేయండి. లేదా జిమ్ ట్రైనర్, పిలేట్స్ ట్రైనర్ ఆధ్వర్యంలోనే ఇలాంటి ప్రయత్నించండి. ప్రస్తుతం మీరు అంత ఫిట్ గా ఉండకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే పోయేదేమీ లేదని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.

English summary

How does Deepika Padukone maintain that figure?

Deepika Padukone is once again highlighted in Bollywood. This is because she, like the heroes, drills for a few shapes to make her body more hot. Like some heroes spend hours in the gym. When it comes to fitness, it is not just about having a good look physically.
Story first published: Wednesday, September 11, 2019, 11:49 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more