Latest Updates
-
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
అమ్మో! రకుల్ జిమ్ వర్కవుట్ చూస్తే షాకవ్వాల్సిందే.. ఈ భామ డెడ్ లిఫ్టునే ఎందుకు ఎంచుకుందో తెలుసా..
తనకు సినిమాలతో పాటు జిమ్ అంటే కూడా చాలా ఇష్టమట. అందుకే తాను ఎక్కువసార్లు జిమ్ కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుందట.
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు గంటల కొద్దీ జిమ్ లో గడిపే హీరోయిన్ ఎవరని అడిగితే చాలా మంది రకుల్ ప్రీత్ సింగ్ అని టక్కున చెప్పేస్తారు. ఈ మధ్యనే కోలీవుడ్ లోనూ పాపులర్ అవుతున్న ఈ భామ ఫిట్ నెస్ విషయంలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అంతేకాదు తన అభిమానుల కోసం తాను ఎక్సర్ సైజ్ చేసే ఫొటోలను, వీడియోలను తరచూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది. కేవలం ఫిట్ నెస్ కోసమే ఇలాంటివి షేర్ చేసుకుంటుందా లేదా మరిన్ని సినిమా అవకాశాల కోసమా అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ హెల్త్ పట్ల కేర్ ఫుల్ గా ఉండాలని, అందు కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ చెబుతూ ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో వర్కవుట్ కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది.
అందులో తన డెడ్ లిఫ్ట్ 170 పౌండ్ల నుండి 140 పౌండ్లకు పడిపోయిందని తెలిపింది. అది ఎలా ఉన్నా మన ఫిగర్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి అంది.

తనకు సినిమాలతో పాటు జిమ్ అంటే కూడా చాలా ఇష్టమట. అందుకే తాను ఎక్కువసార్లు జిమ్ కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుందట.
తన లక్ష్యం చేరుకోవడానికి ఇంకా మూడు నెలల సమయం ఉందని చెప్పింది. కునాల్ గిర్ సమక్షంలో తాను జిమ్ వర్కవుట్స్ చేసింది. కానీ రకుల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ మారింది. ఫిట్ గా, హాట్ గా ఉండే హీరోలందరితో కలిసి నటించే ఛాన్సు కొట్టేసింది.
ఇక ఆమె సినిమా విషయాలకు వస్తే ఇటీవల టాలీవుడ్ కింగ్ నాగార్జునతో మన్మథుడు-2లో కాస్త బోల్డ్ గా కనిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా కోసం చాలా కొవ్వునే కరిగించిందట ఈ ముద్దుగుమ్మ.
తన తరువాయి చిత్రం అగ్రనటుడు, ఆల్ రౌండర్ కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు-2లో రకుల్ నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు. ఇంకోవైపు వెంకటేష్ హీరోగా నటించనున్న 'దే దే ప్యార్ దే' తెలుగు రీమేక్ చిత్రంలో, దాని తర్వాత యేలేటి డైరెక్షన్ లో నితిన్ హీరోగా చేస్తున్న 'లాయర్' సినిమాల్లో నటించనున్నట్లు తెలిసింది.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, క్రేజ్ ఉన్న సమయంలో నాలుగు రాళ్లు వెనుక వేసుకోవాలి అనే విషయం రకుల్ ప్రీత్ సింగ్ కు బాగా తెలిసినట్టుంది. అందుకే తాను హీరోయిన్ గా పాపులర్ అయిన సమయంలోనే ఒక కొత్త జిమ్ ను తానే స్టార్ట్ చేసింది. అది కూడా హైటెక్ సిటీ హైదరాబాద్ లోనే స్టార్ట్ చేసింది. దాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications

