Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
తలనొప్పికి: ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఇండియన్ హోం రెమెడీస్
తలనొప్పి అనేది ప్రస్తుత కాలంలో చాలా సాధారణ సమస్య అయిపోయింది. అయితే రోజు రోజుకూ ఈ సమస్యను అధిగమించడం కష్టం. ఇలా తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఏదో ఒక మాత్ర మింగి తక్షణం ఉపశమనం పొందాలనే ఆలోచన కలుగుతుంది. ఇలాంటి కష్టమైన పరిస్థితిలో దీనికి ప్రత్యామ్యాయంగా ఏదైనా చేయాల్సి ఉంటుంది. నిరంతరం మాత్రలకు అలవాటు పడటం కంటే నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే హోం రెమెడీస్ తో తలనొప్పిని తగ్గించుకోవచ్చు...
తలనొప్పిని తగ్గించడానికి కొన్ని నేచురల్ పద్ధతులున్నాయి. ముఖ్యంగా మన ఇండియన్ హోం రెమెడీస్ తలనొప్పిని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ హోం రెమెడీస్ మన వంటగదిలో కూడా చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల ఏలాంటి అవాంతరాలుండవు.
తలనొప్పి తగ్గించుకోవడానికి ఈ సింపుల్ హోం రెమెడీస్ ను మీరు కనుక ఫాలో అయ్యారంటే, ఒక్క వారలంలోనే మీ దీర్ఘకాలిక తలనొప్పి నుండి ఉపశమనం పొంది మార్పును గమనించవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం? తలనొప్పి తగ్గించుకోవడానికి కొన్ని బెస్ట్ ఇండియన్ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకోండి...

ఆపిల్ సైడర్ వెనిగర్:
తలనొప్పి తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ను ఒక కప్పు వేడినీటిలో మిక్స్ చేసి తాగించాలి. రెండింటిని మిక్స్ చేసి త్రాగాలి . ఈ వాటర్ త్రాగిన 15నిముషాల వరకూ ఏమి త్రాగకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా తలనొప్పి తగ్గిపోతుంది.

గ్రీన్ టీ :
గ్రీన్ టీ ఒక ఉత్తమ బెవరేజ్. నొప్పితగ్గించుకోవడానికి గ్రీన్ టీ ఒక బెస్ట్ ఆప్షన్. గ్రీన్ టీలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది నొప్పి నివారించడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో కొద్దిగా తేనె, దాల్చిన చెక్క మిక్స్ చేసి తీసుకోవచ్చు.

మసాలా ఛాయ్:
పురాతన కాలం నుండి తలనొప్పికి ఏదో ఒక హేర్బల్ టీ తీసుకొనేవారు. అలా పరిచయం అయినదే మసాలా ఛాయ్ . ఒక కప్పు బ్లాక్ టీలో చిటికెడ్ దాల్చిన చెక్క పౌడర్ మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. అలాగే దాల్చిన చెక్కకు బదులుగా అల్లం నమలవచ్చు.

గోరువెచ్చని నీరు:
వార్మ్ వాటర్ ఒక ఉత్తమమైన హోం రెమెడీ. తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి రోజంతా కొద్దికొద్దిగా గోరువెచ్చని నీరు త్రాగి తలనొప్పిని తగ్గించుకోవాలి. ఈ ఇండియన్ హోం రెమెడీస్ పొట్టనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పాదాలను నీటిలో నానబెట్టాలి:
పాదాలను హాట్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టడం వల్ల తలనొప్పిని నివారించుకోవచ్చు . అందుము మీరు చేయాల్సిందల్లా నీటిలో ఒక చెంచా ఆవాలపొడి మిక్స్ చేయాలి. అందులో కాళ్ళు ముంచి 15 నిముషాలు అలాగే ఉంచాలి . ఈ ఇండియన్ హోం రెమెడీ పాదాలకు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది . దాంతో క్రమంగా తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కెఫిన్ :
తలనొప్పితో బాధపడే వారు కాఫీకి ఎక్కువగా అలవాటు పడి ఉంటారు. అయినా ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ . అయితే మోతాదుకు మించి కెఫిన్ తీసుకోవడం వల్ల మరింత జబ్బుపడేలా చేస్తుంది. కాఫీ త్రాగడం వల్ల రక్తనాళాల వాపు తగ్గించి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఎసెన్షియల్ ఆయిల్ వాసన పీల్చడం:
మెంతాల్ ఆయిల్లో తలనొప్పిని నివారిస్తుంది . అందుకు మీరు చేయాల్సిందల్లా ఈ మెంతాల్లో ఆయిల్లో కొద్దిగా పెప్పర్మింట్ లేదా టీట్రీ ఆయిల్ ను చేర్చాలి. ఈ మిశ్రామన్ని టిష్యుపేపర్ మీద వేసి అప్పుడప్పు వాసన పీల్చాలి.



Click it and Unblock the Notifications