Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
బ్రెయిన్ క్యాన్సర్ గురించి మీరు తెలుసుకోవల్సిన కొన్ని వాస్తవాలు
క్యాన్సర్ పేరు వింటేనే భయపడుతుంటాం.అందులో మెదడుకు క్యాన్సర్ వచ్చిందంటే ఇక ఆందోళన చెప్పనలవి కాదు.డాక్టర్లు కూడా బ్రెయిన్ క్యాన్సర్‌కి సర్జరీ చేయడమే మొట్టమొదటి మార్గంగా ఎంచుకుంటారు. ఆరోగ్యకరమైన కణజాలం ప్రభావితం అయ్యే అవకాశాలుండడమే ఇందుకు కారణం.
మెదడులో మాలిగ్నెంట్ ట్యూమర్ ఏర్పడటాన్ని బ్రెయిన్ క్యాన్సర్ అంటారు. మెదడులో ప్రారంభమై లేదా శరీర వివిధా భాగాలలో ప్రారంభమై, మెదడుకు వ్యాపిస్తుంది. అన్ని రకాల క్యాన్సర్'లు మాలిగ్నెంట్'కి చెందినవి కాదు, క్యాన్సర్'లలో చాలా రకాలు ఉన్నాయి. మన శరీరంలో నిరంతరం పాత కణాలు చనిపోతూ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవసరం లేకపోయినా కొత్త కణాలు పుడుతుంటాయి. అదేవిధంగా చనిపోవాల్సిన కణాలు అలాగే ఉండిపోతాయి. దీనివల్ల కావలసినదాని కన్నా అదనంగా కణాలు పెరుగుతాయి. ఇదే ట్యూమర్ లేదా కణితి ఏర్పడడానికి దారితీస్తుంది. ఈ ట్యూమర్లు బినైన్, మాలిగ్నెంట్ అని రెండు రకాలు. బినైన్ ట్యూమర్లలో క్యాన్సర్ కణాలు ఉండవు. కాబట్టి మెదడులో ఏర్పడే బినైన్ ట్యూమర్లు వాపును, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కానీ క్యాన్సర్ కణాలతో కూడిన ఈ మాలిగ్నెంట్ ట్యూమర్లు మాత్రం ప్రమాదకరమైనవి. ఆరోగ్యంగా ఉన్న మెదడు కణాలపై దాడిచేసి ప్రాణాపాయం కలిగిస్తాయి.
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!
క్యాన్సర్ సోకిన కణాలు వాటి చుట్టూ ఉండే కణాలకి సోకి, వాటిని కూడా క్యాన్సర్ వ్యాధికి భారినపడేలా చేస్తాయి. కానీ బ్రెయిన్ క్యాన్సర్'ని కలుగచేసే కారకాలు ఇంతవరకు కనుగొనబడలేదు, మీ జీవన శైలిలో మార్పులు మరియు కొన్ని రకాల ప్రమాదకర కారకాలకి దూరంగా ఉండటం వలన బ్రెయిన్ క్యాన్సర్'కి దూరంగా ఉండవచ్చు. వీటకంటే ముందు బ్రెయిన్ క్యాన్సర్ గురించి కొన్ని వాస్తవాలను తెలుకోవడం మంచిది. బ్రెయిన్ క్యాన్సర్ కు సంబంధించిన వాస్తవాలను, లక్షణాలను మరియు ట్యూమర్ మరియు మరికొన్ని బ్రెయిన్ క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది.
చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...
సాధారణంగా బ్రెయిన్ క్యాన్సర్ టిష్యులు బ్రెయిన్ లో ఏర్పడటం వల్ల వస్తుంది. దీన్ని బ్రెయిన్ ట్యూమర్స్ గా పిలుస్తాము . ఈ ట్యూమర్స్ మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుంది . వీటితో పాటు కొన్ని వాస్తవాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా:

బ్రెయిన్ క్యాన్సర్:
మొదట బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు తెలుసుకోవాలి. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడే వారిలో తలనొప్పులు, వికారంగా ఉండటం, చూపు మందగించడం, మాటలు తడబడటం, జ్ఞాపకశక్తి సమస్యలు, స్థాయీభావాల్లో తేడాలు రావడం, కాళ్లూచేతుల్లో తిమ్మిర్లు రావడం లాంటి లక్షణాలు కనబడుతాయి.

సెకండరీ బ్రెయిన్ క్యాన్సర్:
ఇది అంత్యంత సాధారణమైన బ్రెయిన్ క్యాన్సర్. దీన్నే సెంకడరీ బ్రెయిన్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు.

ప్రైమరీ బ్రెయిన్ క్యాన్సర్:
రెండవ అంత్యంత సాధారణ బ్రెయిన్ క్యాన్సర్ గ్లియోబ్లాస్టోమా. ఇది చాలా సహజమైనట ప్రైమరీ బ్రెయిన్ క్యాన్సర్ . ఇది అత్యంత ప్రమాధకరమైనది మరియు దీనికి వెంటనే చికిత్స అవసరం అవుతుంది.

ఆర్గాన్ డొనేషన్:
అవయవాలు దానం చేసే వారిలో బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నట్లైతే అది రెండవ వ్యక్తి(అవయవగ్రహీత)లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సెకండరీ బ్రెయిన్ క్యాన్సర్ గా చెబుతారు.

తరచూ తలనొప్పి:
బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడే వారిలో తరచూ తలనొప్పి వేధిస్తుంటుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వెంటనే డాక్టర్ ను సంప్రధించాలి. ముఖ్యంగా ఉదయంపూట వచ్చే తలనొప్పి అత్యంత ప్రమాధకరమైనదిగా గుర్తించాలి.

రేడియేషన్ ఎక్స్ పోజర్:
రేడియేషన్ వల్ల కూడా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సెల్ ఫోన్ రేడియేషన్.

ఫ్యామిలీ హిస్టరీ:
బ్రెయిన్ క్యాన్సర్ కుంటుంబంలో ఎవరికైనా ఉన్నట్లైతే, కుంటుంబ సభ్యులకు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications