Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.!
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరిలో సంతానలేమి సమస్యలు అధికమవుతున్నాయి. ఒత్తిడి, జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా ఎన్ని మందులు వాడినా ఫలితం దక్కడం లేదు. ఐయూఐ, ఐవీఎఫ్ లాంటి ఖరీదైన చికిత్సలనూ ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దంపతులు ఒత్తిడిని జయించడం ముఖ్యం. ఇందుకోసం యోగాను తమ డైలీ రొటీన్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..

భార్యాభర్తల్లో పునరుత్పత్తి వ్యవస్థకు ప్రొజెస్టిరాన్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ల పాత్ర కీలకం. అయితే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అదుపు తప్పడం, వృత్తి బాధ్యతల్లో ఒత్తిడి కారణంగా పెళ్లయి ఏళ్లు దాటినా తల్లిదండ్రులయ్యే భాగ్యానికి నోచుకోవడం లేదు. ఈ క్రమంలో గైనకాలజిస్టుల, న్యూట్రిషనస్టుల సలహా మేరకు డైట్‌లో వివిధ రకాల మార్పులు చేసుకుంటున్నారు.
సీడ్స్, ప్రొటీన్ రిచ్ ఫుడ్, సమతుల్య ఆహారం క్రమ పద్ధతిలో తీసుకుంటూ శారీరకంగా మార్పులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మానసికంగానూ మెదడుకి రిలాక్సేషన్ అవసరం. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా మెదడు పనిచేసినప్పుడే శరీరంలో జీవక్రియకు అవసరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్లు మెదడు పనితీరుపైనే ప్రభావం చూపుతాయి.
అందుకే మన దేశంలో యోగాకి ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోయింది. ఉదయాన్నే లేదా రాత్రి పడుకునే సమయంలో యోగాసనాలు వేస్తూ శారీరకంగా, మానసికంగా సానుకూల మార్పులను పొందుతున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తలు సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కేవలం డైట్ పైనే ఆధారపడకుండా తమ డైలీ రొటీన్‌లో భాగం చేసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా దంపతులిద్దరూ కలిసి చిన్న చిన్న యోగాసనాలు వేయడం ద్వారా ఎన్నో లాభాలున్నాయని యోగా ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
రక్త ప్రసరణ కీలకం
భార్యాభర్తల్లో పునరుత్పత్తి వ్యవస్థకి సంబంధించిన భాగాలకు రక్త ప్రసరణ అనేది చాలా ముఖ్యం. పురుషుల్లో వీర్య కణాలు యాక్టివ్‌గా ఉండాలన్నా, మహిళల గర్భంలో అండం చురుగ్గా కదలడానికి అయినా వాటికి రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలి. అప్పుడు పిండం ఇంప్లాంటేషన్ విజయవంతం అవుతుంది. ఇందుకోసం దంపతులు వెల్లకిలా పడుకుని పాదాలను ఒకదానికొకటి ఆనించి చేతులను నేలపై ఉంచి మోకాళ్లను ఆడిస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. వెల్లకిలా పడుకుని రెండు కాళ్ల బొటన వేళ్లను రెండు చేతులతో పట్టుకుని రెండు వైపులా, పైకి కిందకి ఆడించడం వల్ల కూడా పునరుత్పత్తి భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది.
వెల్లకిలా పడుకుని చేతులు నేలపై ఆనించి మోకాళ్లను పైకి చూపాలి. తర్వాత పాదాలు నేలపై ఆనించాలి. ఇప్పుడు నడుమును మాత్రమే పైకి లేపుతూ 10 పుష్ అప్‌లకు ఒకసారి గ్యాప్ ఇస్తూ చేయడం ద్వారా గర్భాశయంలో వీర్యకణాలు చురుగ్గా కదులుతాయి. అలాగే వీపు, నడుమును మాత్రమే బెడ్‌పై ఆనించి నడుము కింది భాగం నుంచి పాదాల వరకు పైకి కిందకు ఎక్సర్‌సైజ్ లాగా చేయడం ద్వారా కూడా హార్మోన్ల అసమతుల్యత సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా ఒక్కో ఆసనం 30 కౌంట్ లెక్కపెడుతూ చేస్తూ ఉండాలి.
చివరిగా బెడ్‌పైన కాళ్ల వైపు తల పెట్టుకుని మంచం తలభాగం చివరికి నడుమును ఆనించి కాళ్లను పైకి ఎత్తి గోడకు ఆనించాలి. ఇలా కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఇలా చేయడం ద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోవడమే కాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తొలగి రక్త ప్రసరణ మెరుగువతుంది. అండం, శుక్ర కణాలు నాణ్యతతో విడుదలవుతాయి. ఫలితంగా వీటి కలయికతో పునరుత్పత్తి వ్యవస్థకు దోహదపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
