Latest Updates
-
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా..
కూల్ డ్రింక్ సీసాలను ఇలా ఓపెన్ చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా.. ఈ పొరపాట్లు ఇకపై వద్దు.!
గాజు కూల్ డ్రింక్స్‌తో పాటు పలు రకాల గాజు బాటిళ్లను ఓపెన్ చేయడానికి బాటిల్ ఓపెనర్లు ఉపయోగిస్తాం. కానీ కొందరు ఓపెనర్లు అందుబాటులో లేనప్పుడు పళ్లతో ఓపెన్ చేస్తుంటారు. ఇది చూడటానికి, చేయడానికి స్టైలిష్‌గా అనిపించినా దంతాల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గాజు బాటిళ్ల మూతలను ఓపెన్ చేసేటప్పుడు తరచుగా దంతాలను ఉపయోగిస్తున్నట్లయితే అది డెంటల్ సమస్యలను తీసుకువస్తుందని డెంటిస్ట్ నిపుణులు చెబుతున్నారు. దంతాలు అనేవి కేవలం ఆహారాన్ని నమలడానికే కానీ.. ఇలా ప్రయోగాలు చేయడానికి, గట్టి వస్తువులను నమలడానికి కాదని అంటున్నారు. సీసాల మూతలను పళ్లతో ఓపెన్ చేయడం ద్వారా దంతాలపై ఒత్తిడి కలిగి వివిధ సమస్యలకు దారితీస్తుంది.
ముఖ్యంగా బలహీనమైన పళ్లు ఉన్నవారు బాటిల్ మూతలను తీసే అలవాట్లను మానుకోవాలి. పళ్లతో మూతను తీయడం ఎంత హానికరమో తెలుసుకోవాలి. మీ పళ్లను కాపాడుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పళ్లతో మూత ఎందుకు తీయకూడదు..
శరీరంలో ఎముకల తర్వాత దృఢమైన భాగం దంతాలు. అయితే గట్టిగా ఉన్న వాటిని నములుతూ వీటిని పనిముట్లుగా ఉపయోగించకూడదు. సీసా మూతను పళ్లతో తెరవడం ద్వారా ఆకస్మిక ఒత్తిడి కలిగి పళ్ల బయటి పొర ఎనామిల్ దెబ్బ తింటుంది.
దంతాలు విరిగే ప్రమాదం
సీసా మూత తెరిచే క్రమంలో పళ్లపై ఒత్తిడి కొన్ని సందర్భాల్లో విపరీతంగా పడుతుంది. ఇందువల్ల దంతాల్లో చిన్న పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఆరంభంలో ఈ పగుళ్లు కనిపించపోయినా.. మున్ముందు నొప్పి, సున్నితత్వం పెరిగి పళ్లు బలహీనపడతాయి.

ఎనామిల్
పళ్లపైన పొర ఎనామిల్ అత్యంత బలంగా ఉంటుంది. దంతాలకు ఇదే రక్షణ కలిగిస్తుంది. పళ్లతో పదే పదే బాటిల్ మూతను తీసినట్లయితే ఎనామిల్ దెబ్బతింటుంది. దీని వల్ల వేడి, చల్లని పదార్థాలు తినేటప్పుడు సున్నితత్వం పెరిగి పళ్లు జివ్వున లాగే ప్రమాదం ఉంది.
చిగుళ్లకు హాని
పళ్లతో సీసా మూత తీసే క్రమంలో సరైన ఒత్తిడి పెట్టకపోతే పొరపాటుగా దంతాలు, చిగుళ్లకు తగిలి రెండూ ప్రభావితమవుతాయి. ఈ కారణంగా చిగుళ్లలో నొప్పి, గాయం, నొప్పి, వాపు ఏర్పడి పదే పదే ఇబ్బంది కలిగిస్తుంది. బ్రష్ చేసే సమయంలో, తినే సమయంలో అసౌకర్యంగా అనిపిస్తుంది.
దంతాలు బలహీనం
మీ దంతాలు బలహీనంగా ఉన్నప్పుడు పొరపాటున కూడా బాటిల్ మూతలను పళ్లతో తీయకండి. లేదంటే మూలాలపై ప్రభావం పడి ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. గట్టి వస్తువుల జోలికి వెళ్లకుండా మెత్తగా ఉన్న వాటిని మాత్రమే నమలడం ఉత్తమం.
ఈ జాగ్తత్తలు తప్పనిసరి..
కేవలం బాటిల్ ఓపెనర్‌తో మాత్రమే సీసా మూతను తీయండి. గట్టి వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దంతాలను ఉపయోగించకండి. రోజుకి రెండు సార్లు దంతాలను శుభ్రం చేసుకోవడం ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగి పళ్లు దృఢంగా మారతాయి. దంతాల బలం కోసం కాల్షియం, విటమిన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. చల్లని, వేడి వస్తువులను తింటున్నప్పుడు మీకు సున్నితత్వం అనిపిస్తే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించి వారి సిఫార్సు మేరకు మందులు, చికిత్స తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
