Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
ఈ ఆహారపదార్థాలను ఎక్కువ మంట మీద వండితే క్యాన్సర్ రావడం పక్క
చాలా మందికి ఎక్కువగా ఫ్రై అయిన ఆహారపు పదార్థాలను తినాలని ఉంటుంది. అందుకోసం ఎక్కువ మంట మీద ఆహారపదార్థాలను వండుతుంటాము. కానీ కొన్ని ఆహారపదార్థాలను ఎక్కువ మంట మీద వండకూడదు. అలా ఎక్కువ మంట మీద వండితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆ ఆహారపదార్థాలను చాలా తక్కువ వేడి మీద వండాలి. ఈ స్టోరీలో ఎక్కువగా మంట మీద వండకూడని ఆహారపదార్థాలు ఏంటి? ఆ వస్తువులు ఏవి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బంగాళదుంపలు
దుంపలలో బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన కూరగాయ. ఎదో ఒక మార్గంలో ప్రతి రోజూ బంగాళాదుంపలను తీసుకుంటూ ఉంటారు. అటువంటి బంగాళదుంపలను ఎక్కువసేపు వేడి చేసినట్లయితే.. అవి క్యాన్సర్‌కు కారణమయ్యే యాక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. అలాంటప్పుడు వాటిని తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బంగాళదుంపలను ఎప్పుడూ తక్కువ మంట మీద ఉడికించాలి.

గొడ్డు మాంసం
గొడ్డు మాంసం చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ దీనిని తినాలనుకునే వారు చాలా ఎక్కువ మంట మీద ఎక్కువ సమయం వేడి చేస్తుంటారు. అయితే గొడ్డు మాంసాన్ని ఎక్కువ మంట మీద వండినప్పడు అవి క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను విడుదల చేస్తుంది. అలా ఉడికించిన మాంసాన్ని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
బ్రెడ్
ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మందికి బ్రెడ్ ఒక బ్రేక్‌ఫాస్ట్. బ్రెడ్ ఎలాంటిదైనా సరే, దాన్ని అతిగా టోస్ట్ చేసినప్పుడు, అది క్యాన్సర్‌కు కారణమయ్యే యాక్రిలమైడ్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి బ్రెడ్‌ను టోస్ట్ చేసేటప్పుడు తక్కువ
మంట మీద ఉంచి లైట్ గా టోస్ట్ చేయండి.
చికెన్
చికెన్ చాలా మందికి ఇష్టమైన వంటకం. రోస్ట్ చేసిన చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. అందులో ఒకటి చికెన్ 65. ఈ చికెన్ 65 చేస్తున్నప్పుడు ఎక్కువ సేపు నూనెలో వేసి ఎక్కువసేపు వేయించినట్లయితే, అది క్యాన్సర్ కారకాలను సృష్టించి, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చికెన్ ఎప్పుడూ తక్కువ వేడి మీద ఉడికించాలి.
చేప
గ్రేవీలో తినడానికి ఇష్టపడే వారి కంటే చేపలను వేయించి తినడానికి ఇష్టపడే వారు ఎక్కువ. చేపలను ఇలా ఉడకబెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చేపలను అధిక వేడి మీద ఎక్కువసేపు ఉడికించడం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే హానికరమైన క్యాన్సర్ కారకాలు విడుదలవుతాయి. కాబట్టి వీలైనంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద చేపలను ఉడికించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
