Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
చాలామంది తమలపాకును శుభకార్యాల్లో ఉపయోగించే ఆకుగానో లేదా పాన్ గా తినడానికి ఉపయోగపడేదిగా మాత్రమే చూస్తుంటారు. కానీ తమలపాకు అసలైన ప్రయోజనాలు తెలిస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. చాలా వ్యాధుల ట్రీట్మెంట్ లో తమలపాకులు ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో కూడా దీనిని ఎక్కువ ఉపయోగిస్తాయి.
నీటి శాతం ఎక్కువగా ఉండే తమలపాకులో క్యాల్షియం, కెరోటిన్, నియాసిన్, విటమిన్ సి వంటి విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ప్రజల జీవనశైలిలో మార్పులు చోటుచేసుకుంటున్న కారణంగా అనేక రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మళ్లీ పాత పద్ధతుల వైపు ఆకర్షితులవుతున్నారు.

మన పూర్వీకులు పాటించిన వంటింటి చిట్కాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి పొద్దున్నే నిద్ర లేవగానే తమలపాకు నీటిని తాగడం. రాత్రి పూట ఒక గ్లాసు నీళ్లలో తమలపాకులను నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే ఎలాంటి ప్రయోజనాలు మన శరీరానికి లభిస్తాయో ఇక్కడ చూడండి.
దగ్గు,జలుబు నుండి రక్షణ
తమలపాకులలో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పొద్దున్నే పరగడుపున తమలపాకు నానబెట్టిన నీటిని తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఛాతి పట్టేయడం, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల
మన శరీరంలో దాదాపు అన్ని రోగాలకు మూలకారణం కడుపే. పొద్దున్నే పరగడుపున తమలపాకు నీటిని తాగడం వల్ల జీర్ణ రసాల ఉత్పత్పి ప్రేరేపించబడి, జీర్ణ వ్యవస్థ చాలా సమర్థవంతంగా,సజావుగా పనిచేస్తుంది. దీంతో అజఅర్తి, గ్యాస్, మలబద్దకం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది.
శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది
తమలపాకు నీరు తాడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన విషపదార్థాలను బయటకు పంపబడతాయి. ఇది లివర్, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. అదే విధంగా చర్మానికి సహజమైన కాంతిని, మెరుపును అందిస్తుంది.
జీవక్రియ, బరువు నియంత్రణ
తమలపాకు నానబెట్టిన నీరు శరీర జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది. ఇది కేలరీల దహనాన్ని వేగవంతం చేస్తుంది, తద్వారా బరువు నిర్వహణకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
శక్తిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది
తమలపాకు నీరు తక్షణ శక్తిని అందించి, అలసట, నీరసాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రోజంతా ఎనర్జీ లెవల్స్ నిలబెట్టుకోవడానికి, మానసిక అలసటను తగ్గించడానికి, శరీరాన్ని శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
