Latest Updates
-
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
Summer Energy Drinks: వేసవి అలసట దూరం చేసే సూపర్ ఎనర్జీ డ్రింక్స్
వేసవి కాలంలో కాసేపు అలా ఎండలోకి వెళ్లొస్తే ఎనర్జీ మొత్తం పోతుంది. అలసట, నీరసం ఆవహించేస్తాయి. డీహైడ్రేషన్ వల్ల కూడా అలసట, నీరసం, తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తుతాయి.
మీరు కూడా ఈ వేసవికాలంలో నీరసంగా మారిపోతే, శక్తి మొత్తం కోల్పోతే ఇంట్లోనే ఈ ఎనర్జీ డ్రింకులు తయారు చేసుకుని తాగండి. ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఈ వేసవికాలంలో ఫుల్ ఎనర్జీతో ఉంటారు.

ఎండాకాలంలో ఆవహించే నీరసాన్ని తరిమికొట్టి, ఎనర్జీగా ఉంచే పానీయాలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, వాటితో లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుచ్చకాయ, తులసి రసం
పుచ్చకాయ నుండి గింజలు తొలగించి ఒక గిన్నెలో తీసుోవాలి. అందులో తులసీ ఆకులు, పుదీనా ఆకులు, కొద్దిగా నిమ్మరసం వేసి ఆకులన్నీ మెత్తగా మారి పుచ్చకాయ రసంలో కలిసిపోయే వరకు గ్రైండ్ చేసుకుంటే పుచ్చకాయ, తులసి రసం సిద్ధమైనట్లే.
ఈ పానీయం తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరానికి అందుతాయి. తక్షణ ఎనర్జీ అందిస్తాయి. పుచ్చకాయ, తులసి, పుదీనాలోని పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. తులసి ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది.
2. బాదం తాండై
కొన్ని పాలను గిన్నెలో తీసుకుని మరిగించాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 5 నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వేయించిన సన్ ఫ్లవర్ సీడ్ పౌడర్, కొన్ని ఖర్జూరాలు, కొద్దిగా కుంకుమ పువ్వు వేిస పాలు చిక్కబడే వరకు మరిగించుకోవాలి. తర్వాత వడపోసుకుని పిస్తా, బాదంతో గార్నిష్ చేసుకుని తాగొచ్చు.
ఈ పానీయం తాగడం ద్వారా శరీరానికి మెగ్నీషియం సహా ఇతర పోషకాలు అందుతాయి. దీని వల్ల తక్షణ శక్తి వస్తుంది.
3. క్యారెట్, బీట్‌రూట్
క్యారెట్, బీట్ రూట్ లను సన్నగా, పొడవాటి ముక్కలుగా కట్ చేసిన తర్వాత సిరామిక్ జార్ లో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మస్లిన్ క్లాత్ లేదా మూతతో కప్పి 3-4 రోజుల పాటు ఎండలో ఉంచాలి. కంజి పుల్లగా మారే వరకు చెక్క చెంచాతో రోజూ కదిలిస్తూ ఉండాలి. ఇది పుల్లగా మారిన తర్వాత తాగడానికి సిద్ధమైనట్లు.
దీని వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. కంజిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పానీయం బరువు తగ్గడానికి, చర్మ సంరక్షణకు కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
4. తేనె, ఉసిరి పానీయం
ముందుగా ఉసిరి కాయలను దంచి గుడ్డలో కట్టి రసాన్ని తీయాలి. ఆ మిశ్రమంలో 3 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎండాకాలంలో తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. తేనె ఇష్టంలేని వాళ్లు, ఉసిరికాయల రసాన్ని నీటిలో కలుపుకొని తాగొచ్చు.
తేనె, ఉసిరిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి వాడకం శరీరానికే కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఉసిరి, తేనెతో చేసిన ఈ ఎనర్జీ డ్రింక్ రోగనిరోధక శక్తికి మాత్రమే కాకుండా, దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications