Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
Sleep Inducing Foods : పడుకునే ముందు ఇవి తాగితే.. నిద్రమత్తులోకి వెళ్లాల్సిందే..!
మారుతున్న పరిస్థితుల కారణంగా ఇప్పుడు నిద్రపోవడానికి కూడా చాలా ఖర్చు చేస్తున్నాం. నిద్రలేమి సమస్యలతో కోట్ల మంది బాధపడుతున్నారు. కంటి నిండా నిద్రపోవడానికి జేబు ఖాలీలు చేస్తున్నారు. చేయాల్సిన ప్రయత్నాలన్నీచేసి మళ్లీ నిద్రించలేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి ఓ మంచి చిట్కా ఉంది. వీటిని ఫాలో అయితే తప్పకుండా నిద్రపోతారు. రోజంగా పనిచేసిన తరువాత హాయిగా నిద్రపోతే అందులో ఉండే మజా మాటల్లో చెప్పలేము.
చామంతి చాయ్
చామంతి చాయ్ తాగడం వల్ల కేవలం నిద్ర రావడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. గ్రీన్ టీ, అల్లం టీ గురించే అెక్కువగా విని వుంటాం కానీ చామంతి టీ గురించి చాలా తక్కువ మంది చెబుతుంటారు. నిద్రలేమిని తగ్గించడంలో చామంతి టీ సహాయపడుతుంది. అటు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియును కూడా మెరుగుపరుస్తుంది. పడుకునే సమయానికి సరిగ్గా 20 నిమిషాల ముందు చామంతి చాయ్ తాగితే హాయిగా నిద్రపోతారు.

పూదీన చాయ్
పూదీన చాయ్ తాగడం వల్ల బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది. దీంతో ఏదైనా ఆందోళనలు ఉంటే తగ్గుతుంది. దీంతో నిద్రలోకి సులభంగా జారుకుంటారు. అయితే నిద్రించడానికి ఇంకా గంట ఉన్నదని అనుకున్నప్పుడు మాత్రమే ఈ పూదీన చాయ్‌ను తాగాలి. జీర్ణక్రియలో కూడా ఈ పూదీన చాయ్ బాగా సహాయపడుతుంది.
అశ్వగంధ టీ
మానసిక ప్రశాంతతకు అశ్వగంధ టీను తాగాల్సిందే. ఈ టీ తాగగానే వత్తిడికి గురి చేసే కార్టిసాల్ స్థాయి తగ్గిపోతుంది. దీంతో స్ట్రెస్ తగ్గి రలాక్స్ అవుతాము. అలా నిద్ర త్వరగా వచ్చేందుకు దోహదపడుతుంది. పడుకునే గంట ముందు అశ్వగంధ టీని తీసుకోవచ్చు.
అల్లం టీ
అల్లం టీ తాగడం వల్ల కడుపులో ఏదైనా ఉబ్బరంగా, గ్యాస్ ఉన్నట్టు అనిపిస్తే దాన్ని అల్లం తొలగించి వేస్తుంది. జీర్ణప్రక్రియను కూడా సులువుగా జరగడానికి సహాయపడుతంది. కడుపుపై ఎలాంటి వత్తిడి లేకపోవడంతో సులభంగా నిద్రకు ఉపక్రిమించవచ్చు.
పసుపు పాలు
పాలల్లో పసుపు వేసుకొని తాగడం వల్ల కూడా త్వరగా నిద్రపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్‌కు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా వుంటాయ్. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. శరీరం మొత్తాన్ని రిలాక్స్ చేయడంతో హాయిగా నిద్రించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.
చెర్రీ జ్యూస్
చీకటి పడితే శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. చెర్రీ జ్యూస్ ఈ మెలటోనిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది. నిద్రించడానికి ఈ మెలటోనిన్ ప్రముఖ పాత్రను పోషిస్తుంది.
లావెండర్ టీ
లావెండర్ టీ వత్తిడిని తగ్గిస్తుంది. దీంతో నిద్రలో సులభంగా జారుకుంటారు. నిద్రించే ఒక గంట ముందు లావెండర్ టీ తాగిలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా వుంటి. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షింస్తుంది.
సమయానికి కావలసినంత నీరు కూడా తాగితే కడుపు శుభ్రంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరగడానికి ఆస్కారం వుంది. మెదడుకు కూడా కావలసినంత ఆక్సిజన్, నీరు అందుతాయ్. నిద్రించేందుకు నీళ్లు కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాయ్. ఒక సాధారణ మానవుడు ప్రతీ రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడే శరీరంలోని కణాలు తమపనులను పూర్తిచేసుకోగలుగుతాయ్. లేదంటే డయాబెటిస్‌కు కూడా దారి తీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications