Latest Updates
-
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి!
నిద్రలో చొంగ కారుతుందా? ఇది ఏ తీవ్ర అనారోగ్యానికి సంకేతమో తెలుసా!
నిద్ర సమయంలో చాలామందికి గురక వస్తుంటది. ఇదే సమయంలో చాలామందికి నోట్లో నుంచి లాలాజలం కారుతుంది. నైట్ పడకున్నాక తెల్లారి లేచిననప్పుడు దిండు లాలాజలంతో తడిపోవడం చాలామందికి జరుగుతుంది. దీన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ ప్రతిసారీ ఇది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాకపోవచ్చు. తరచుగా ఇలా జరుగుతూ ఇతర లక్షణాలు కూడా కనిపిస్తుంటే అది మీ శరీరం లోపల ఏదో అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
సాధారణ కారణాలు ఏమిటి?
చాలా సందర్భాల్లో నిద్రలో చొంగ కారడానికి కొన్ని సాధారణ కారణాలు ఉంటాయి.
పడుకునే భంగిమ: మీరు పక్కకు తిరిగి లేదా బోర్లా పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ వల్ల నోరు కొద్దిగా తెరుచుకుని లాలాజలం బయటకు కారడం సహజం.

నోటితో శ్వాస తీసుకోవడం: జలుబు, సైనస్ ఇన్ఫెక్షన్లు లేదా ముక్కు దిబ్బడ వంటి సమస్యలు ఉన్నప్పుడు ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటాం. ఆ సమయంలో నోరు తెరిచి ఉండటం వల్ల లాలాజలం బయటకు వస్తుంది.
అధిక లాలాజలం ఉత్పత్తి: కొంతమందిలో శరీర తత్వం రీత్యా లేదా దంత సమస్యలు, చిగుళ్ల వాపు, కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ (GERD) వంటి కారణాల వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనిని హైపర్ సాలివేషన్ అంటారు. ఈ కారణాల వల్ల చొంగ కారడం తాత్కాలికమే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
తీవ్రమైన అనారోగ్య సంకేతాలు
ఈ సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతుంటే అది కొన్ని తీవ్రమైన వ్యాధులకు సూచన కావచ్చు.
స్లీప్ అప్నియా: ఇది నిద్రలో శ్వాస అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలిగించే ఒక ప్రమాదకరమైన సమస్య. ఈ సమస్య ఉన్నవారు తరచుగా నోటితో గాలి పీల్చుకుంటారు, ఫలితంగా లాలాజలం బయటకు కారుతుంది. దీనితో పాటు గట్టిగా గురక పెట్టడం, పగటిపూట అతిగా నిద్ర రావడం వంటి లక్షణాలు ఉంటాయి.
నాడీ సంబంధిత వ్యాధులు: పార్కిన్సన్స్ వ్యాధి, సెరిబ్రల్ పాల్సీ లేదా పక్షవాతం వంటి నాడీ సంబంధిత రుగ్మతలు ముఖ కండరాల నియంత్రణను దెబ్బతీస్తాయి. దీనివల్ల లాలాజలాన్ని మింగడం లేదా నోటిలో నియంత్రించుకోవడం కష్టమై, అది బయటకు కారుతుంది.
ఇన్ఫెక్షన్లు: టాన్సిల్స్ వాపు, గొంతు ఇన్ఫెక్షన్ లేదా నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు లాలాజలం ఉత్పత్తి పెరిగి, నిద్రలో బయటకు వస్తుంది.
మందుల దుష్ప్రభావాలు: కొన్ని రకాల మందులు, ముఖ్యంగా యాంటిడిప్రెసెంట్స్ లేదా నాడీ సంబంధిత వ్యాధులకు వాడే మందులు లాలాజల ఉత్పత్తిని పెంచుతాయి.

ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి
చొంగ కారడంతో పాటు మాట్లాడటంలో లేదా ఆహారం మింగడంలో ఇబ్బంది ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
ముఖంలో ఒకవైపు బలహీనంగా మారినా, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వచ్చినా (ఇవి పక్షవాతానికి సంకేతాలు) డాక్టర్ ని సంప్రదించాలి.
గట్టి గురక, నిద్రలో ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
లాలాజలంలో రక్తం కనిపించినా, దుర్వాసన వచ్చినా లేదా నోటిలో నొప్పి ఉన్నా (ఇన్ఫెక్షన్ లేదా నోటి క్యాన్సర్‌కు సూచన) వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. వెంటనే ఒక ENT నిపుణుడిని లేదా న్యూరాలజిస్ట్ ను సంప్రదించి సరైన కారణం తెలుసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications