మీ భోజనంలో ఈ ఒక్క లోపంతో ఇన్ని సమస్యలా.. బలహీనమైన జుట్టు, గోళ్లకు ఇదే కారణం.!

జీవనశైలి కారణంగా చాలా మంది జుట్టు రాలడం, గోళ్లు బలహీనపడటం, పెరగకుండా ఉండటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన జుట్టు, దృఢమైన గోళ్లు అందమే కాదు ఆరోగ్యానికి కూడా సంకేతం. అయితే వీటి బలహీనతకి విటమిన్‌ బి7- బయోటిన్‌ లోపం ఒక కారణం కావచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

A deficiency of Vitamin B7 causes hair weakening and brittle nails You can prevent this problem by including it in your diet

బలమైన కురులు, గోళ్ల కోసం వాటిని సంరక్షించుకోవడం ఒక్కటే సరిపోదు. సరైన ఆహారం కూడా తీసుకోవాలని డా. చైతన్న అంటున్నారు. మన శరీరంలో కొన్ని పోషకాల లోపం కూడా జుట్టు రాలడం, గోళ్లు విరిగిపోవడానికి కారణాలు కావచ్చని చెబుతున్నారు. శరీరం బయట నుంచే కాకుండా లోపలి నుంచి కూడా సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి దోహదపడే ముఖ్యమైన పోషకాలలో బయోటిన్‌ ఒకటని.. దీనిని సమతుల్యంగా తీసుకోవాలని చెబుతున్నారు.

బయోటిన్‌(విటమిన్‌ బి7).. నీటిలో కరిగే విటమిన్‌. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో దోహదపడుతుంది. జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే జుట్టు, గోళ్ల పోషణకు తగినంత బయోటిన్‌ అవసరం. విటమిన్‌ బి7తో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని డా. చైతన్య సూచిస్తున్నారు. మరి బయోటిన్‌ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు ఏవో ఇక్కడ చూద్దాం..

గుడ్లు

బయోటిన్‌ సమృద్ధిగా లభించే పదార్థాల్లో గుడ్డు ఒకటి. ఉడకబెట్టిన గుడ్లను తీసుకోవడం ద్వారా ఇందులో ప్రొటీన్‌తో పాటు బయోటిన్‌ పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే గుడ్లు బాగా ఉడికిన తర్వాత మాత్రమే తీసుకోవాలని డాక్టర్‌ సూచిస్తున్నారు.

A deficiency of Vitamin B7 causes hair weakening and brittle nails You can prevent this problem by including it in your diet

బాదం

ప్రతిరోజూ రాత్రి బాదం పప్పులను నానబెట్టి ఉదయాన్నే తినాలి. తద్వారా బయోటిన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా సరైన మోతాదులో వీటిని తీసుకోవడం ద్వారా జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి దోహదపడుతుంది.

చిలగడదుంప

సహజమైన తీపితో తినేకొద్దీ తినాలనిపించే చిలగడ దుంపల్లో బయోటిన్‌, ఫైబర్‌, విటమిన్‌ ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని ఉడకబెట్టి తినొచ్చు. కాల్చుకుని లేదా చాట్‌గా చేసుకుని ఆరగించవచ్చు. వీటిని తినడం ద్వారా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. మీ డైలీ డైట్‌లో ఈ సీజనల్‌ పండ్లను భాగం చేసుకోవడం ద్వారా జుట్టు, గోళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి.

పొద్దుతిరుగుడు గింజలు

పొద్దుతిరుగుడు గింజల్లో బయోటిన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తాయి. సన్‌ఫ్లవర్‌ సీడ్స్‌ను సలాడ్‌లు, పెరుగు, ఓట్స్, స్మూతీల్లో కలుపుకొని తినడం ద్వారా ఫలితం ఉంటుంది. రెగ్యులర్‌గా తక్కువ మోతాదులో తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.

సాల్మన్

సాల్మన్‌ చేపల్లో బయోటిన్, ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్‌ లభిస్తాయి. అయితే శాకాహారులు పుట్టగొడుగులు, వేరుశెనగల ద్వారా ఈ పోషకాలను పొందవచ్చు. సమతుల్య ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే కురులు, గోళ్లు దృఢంగా ఉంటాయి.

శరీరంలో బయోటిన్‌ లోపం ఉంటే జుట్టు పలచబడటమే కాకుండా తరచుగా రాలిపోతుంది. ఇక గోళ్లు బలహీనంగా, పెళుసు బారిపోతాయి. ఇంకా చర్మం ఎర్రబడటం, పొడిబారడం కనిపిస్తుంది. అలసట, నీరసం, మానసిక స్థితిలో మార్పులు వంటి వాటితో పాటు చేతులు, పాదాల్లో తిమ్మిర్లు లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.

బయోటిన్ లోపం ఉన్న కొందరిలో జుట్టు పలచబడటం లేదా రాలిపోవడం, గోళ్లు పెళుసుగా మారడం, మరియు చర్మం ఎర్రబడటం లేదా పొడిబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో, అలసట, నీరసం, మానసిక స్థితిలో మార్పులు, మరియు చేతులు, పాదాలలో తిమ్మిర్లు వంటి లక్షణాలు కూడా గమనించవచ్చు. అయితే కేవలం బయోటిన్‌ లోపం వల్ల మాత్రమే ఈ లక్షణాలు ఏర్పడతాయని అనుకోవద్దని.. దీర్ఘకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Sunday, July 5, 2026, 8:21 [IST]
Desktop Bottom Promotion