Anti Cancer Foods: జన్మలో క్యాన్సర్ రాకూడదనుకుంటే..ఈ 5 తినండి చాలు!

క్యాన్సర్..ఈ పేరు వింటేనే చాలామంది భయంతో వణికిపోతుంటారు. క్యాన్సర్ వస్తే ఇక వారి బాధ మాటల్లో వర్ణించలేనిది. రకరకాల క్యాన్సర్లు ఇప్పుడు మనపై దండయాత్ర చేస్తున్నాయి. అయితే ప్రారంభ శలోనే వీటిని గుర్తిస్తే దానిని నివారించడం ఈజీ అవుతుంది..ఆలస్యం చేస్తే మరణం కొని తెచ్చుకున్నట్లే. అయితే ఒకప్పుడు క్యాన్సర్ అనే పదం వింటేనే అది కేవలం పాశ్చాత్య దేశాలకో లేదా అత్యంత ధనవంతులకో వచ్చే వింత వ్యాధిగా భావించేవారు. మన జీవనశైలి,ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉండేవని మనకు అలాంటి జబ్బులు రావని ఒక ధీమా ఉండేది. కానీ కాలం మారింది. నేడు పరిస్థితి తలకిందులైంది. నగరాల నుండి పల్లెల వరకు ప్రతి ఊర్లో ఎవరో ఒకరు క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నారన్న వార్త మనల్ని కలచివేస్తోంది.

భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. ఈ భయంకరమైన వ్యాధి మన దరిచేరకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్యాన్సర్ కు అతడ్వాన్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాధి వచ్చాక చికిత్స కన్నా రాకుండా నివారించడమే ఉత్తమం. ఈ నివారణ మార్గంలో మన ఆహారపు పళ్లెం ఒక శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తుంది. మనం రోజూ తినే ఆహారమే మన ఆరోగ్యానికి రక్షణా కవచంలా నిలబడగలదు. క్యాన్సర్‌ ను పూర్తిగా మాయం చేసే సంజీవని లాంటి ఆహారం ఏదీ లేనప్పటికీ కొన్ని రకాల ఆహారాలు మన శరీరంలో క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే శక్తిని పెంపొందించి ఆ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలవని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు చెబుతున్నాయి.

Eat These 5 Foods Daily to Significantly Reduce Your Cancer Risk

క్యాన్సర్ వ్యతిరేక ఆహారాలివే

వాల్‌ నట్స్
చూడటానికి మన మెదడు ఆకారంలో ఉండే ఈ వాల్‌ నట్ కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటి సూపర్‌ఫుడ్. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పాలీఫెనాల్స్, విటమిన్ ఈ వంటి శక్తివంతమైన పోషకాల సమాహారం దాగి ఉంది. ముఖ్యంగా ఇందులో ఉండే పెడంక్యులాగిన్ అనే పాలీఫెనాల్‌ ను మన శరీరం యూరోలిథిన్స్ అనే సమ్మేళనాలుగా మారుస్తుంది. ఈ యూరోలిథిన్స్‌ కు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే అద్భుతమైన శక్తి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి క్యాన్సర్ కణాలు తమ ఉనికిని చాటుకోవడానికి ఉపయోగించే హార్మోన్ రిసెప్టార్లతో బంధం ఏర్పరచుకొని, వాటి వ్యాప్తిని నిరోధిస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతిరోజూ ఉదయం 2 సాయంత్రం 2 నానబెట్టిన వాల్‌నట్స్ తినడం ఒక అలవాటుగా మార్చుకుంటే అది మీ జ్ఞాపకశక్తిని పెంపొందించడమే కాకుండా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్,పెద్దప్రేగు క్యాన్సర్ల వంటి ప్రమాదకర వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.

తులసి టీ
భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం పూజలకే పరిమితమైన మొక్క కాదు ఒక అద్భుత ఔషధ గని. ఉదయాన్నే ఒక కప్పు వేడి టీ తాగనిదే చాలామందికి రోజు గడవదు. మీ ఈ అలవాటుకు ఆరోగ్యాన్ని జోడించాలంటే, ఆ టీలో నాలుగైదు తాజా తులసి ఆకులను వేయండి. తులసిలో ఉండే యూజినాల్, రోస్మరినిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ దాడి నుండి కాపాడతాయి. ఇది మన రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. తులసిలోని కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల రక్త సరఫరాను అడ్డుకొని వాటి పెరుగుదలను మందగింపజేస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి మీ ఉదయపు టీని తులసి టీతో ఆరోగ్యకరంగా మార్చుకోండి.

అల్లం
అల్లం లేని భారతీయ వంటగదిని ఉండదంటే ఆశ్చర్యం అక్కర్లేదు. దాని ఘాటైన రుచి, సువాసన వంటకాలకు రుచిని అందిస్తాయి. అయితే అల్లం గొప్పతనం రుచిలోనే కాదు దానిలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల్లో ఉంది. అల్లంలో జింజెరాల్, షోగోల్ అనే శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. వీటికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీర్ఘకాలిక వాపు క్యాన్సర్‌కు దారితీసే ప్రధాన కారణాలలో ఒకటి. అల్లం ఈ వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జింజెరాల్ క్యాన్సర్ కణాలు వాటంతట అవే నాశనమయ్యే ప్రక్రియను ప్రేరేపిస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. మీ రోజువారీ టీ, కూరలు, సూప్‌ ల్లో చిన్న అల్లం ముక్కను చేర్చడం ద్వారా ఈ ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.

Eat These 5 Foods Daily to Significantly Reduce Your Cancer Risk

వంటింటి బంగారం
పసుపు మన వంటింటి బంగారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పసుపులోని అసలైన శక్తి దానిలో ఉండే కర్కుమిన్ అనే రసాయన సమ్మేళనంలో ఉంది. కర్కుమిన్ ఒక అత్యంత శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదల, వ్యాప్తి, దాడి వంటి బహుళ దశలలో జోక్యం చేసుకోగలదు. అయితే కర్కుమిన్‌ను శరీరం నేరుగా గ్రహించడం కొంచెం కష్టం. నల్ల మిరియాలలో ఉండే పైపరిన్ అనే పదార్థంతో కలిపి తీసుకున్నప్పుడు, కర్కుమిన్ శోషణ 2000శాతం వరకు పెరుగుతుంది. అందుకే రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి కలుపుకుని తాగడం అత్యంత శ్రేయస్కరం. ఈ చిన్న అలవాటు మీ శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరిచి బలోపేతం చేస్తుంది.

Take a Poll

బాదం
బాదం పప్పులు పోషకాల గని. వీటిని రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి. బాదంలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. మన శరీర కణాల పొరలను ఫ్రీ రాడికల్స్ నష్టం నుండి రక్షిస్తుంది తద్వారా క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా బాదంలో ఆరోగ్యకరమైన మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో,హై బీపీని తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రోజూ రాత్రి 4-5 బాదం పప్పులను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తొక్క తీసి తినడం వల్ల వాటిలోని పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, June 26, 2025, 21:00 [IST]
Desktop Bottom Promotion