Latest Updates
-
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు
‘తక్షణ మెరుపు’ అపోహ.. చర్మ సంరక్షణలో అతివలు చేస్తున్న అతిపెద్ద తప్పులు ఇవే.!
చర్మ సంరక్షణ అనేది బాహ్య శరీరానికి చాలా ముఖ్యం. అయితే దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. స్కిన్ కేర్ కూడా అంతే. అతిగా చర్మ సంరక్షణ చేస్తే అది శరీరానికి హాని కలిగించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం సురక్షితంగా ఉంచుకునే క్రమంలో తప్పులు చేయవద్దని సూచిస్తున్నారు.

నేటి కాలంలో జీవనశైలిలో భాగంగా మహిళలు తమ చర్మ సంరక్షణపై ఎక్కువగా అవగాహన కలిగి ఉంటున్నారు. స్కిన్‌కి సంబంధించిన అవసరాలను పట్టించుకుంటున్నారు. మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, లోషన్స్ ఇలా ఎన్నో రకాల ఆధునిక పద్దతులను ఆశ్రయిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో స్కిన్ కేర్ పేరుతో ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని.. ఇది ఓవర్ స్కిన్ కేర్ అని నిపుణులు అంటున్నారు. ఇది చర్మానికి హాని కలుగజేస్తుందని చెబుతున్నారు.
ఈ సిండ్రోమ్
మహిళలు తమ చర్మం పట్ల మితిమీరిన శ్రద్ధ వహించడాన్ని ఈ సిండ్రోమ్ అంటారు. తమ స్కిన్ టైప్ అర్థం చేసుకోకుండా ట్రెండింగ్ ఉత్పత్తులను వాడటం, పదే పదే స్క్రబ్ చేయడం, ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మంపై ఉన్న సహజ పొర బలహీనపడి చిరాకు, ఎరుపెక్కడం, దురద, దద్దుర్లతో పాటు ముఖంపై మొటిమలు రావడానికి కారణమవుతాయి.
సోషల్ మీడియా ఎఫెక్ట్
డిజిటల్ యుగంలో స్కిన్ కేర్‌కి సంబంధించి యువతులు ఎక్కువగా సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, రీల్స్‌ను గుడ్డిగా ఆశ్రయిస్తున్నారు. తక్షణ మెరుపు కోసం కొత్త సీరమ్‌లు, క్రీమ్‌లు అంటూ పరిచయం చేయడంతో వాటిని ప్రయత్నిస్తున్నారు. దీనికి అట్రాక్ట్ అయి చర్మపు రక్షణ పొర దెబ్బతినేలా చేస్తుంది.
తప్పుడు పద్ధతులు
చర్మ సంరక్షణ కోసం ట్రెటినోయిన్, విటమిన్ సి, గ్లైకోలిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన పదార్థాలు ప్రయోజకంగా ఉంటాయి. కానీ వాటిని అతిగా, పదేపదే వాడటం ద్వారా చర్మానికి హాని కలిగిస్తుంది. రోజులో ఎక్కువసార్లు ముఖం కడగడం, గట్టిగా రుద్దడం, ఫేషియల్, మాస్క్‌లను మితిమీరి వాడటం ద్వారా చర్మంపై సహజ నూనెలు తొలగిపోయి కాంతిహీనంగా మారుతుంది. సున్నితత్వం పెరిగి ఇబ్బందులను కలిగిస్తుంది.

చర్మ రకం
పొడి చర్మం, ఆయిలీ స్కిన్ ఇలా ఒక్కొక్కరి చర్మం ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే మీ చర్మ రకానికి అనుగుణంగా ఉత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. మీ స్కిన్ టైప్ పైన అవగాహన లేకుండా తప్పుడు ఉత్పత్తులు వాడటం ప్రతికూలతకు దారితీస్తుంది. చర్మంపై చికాకు, మొటిమలు, పొడిబారడం జరుగుతుంది. సరైన ఫలితాల కోసం చర్మ రకాన్ని గుర్తించి ఉత్పత్తులను వాడాల్సి ఉంటుంది. అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
శాండ్ విచ్ పద్ధతి
మీ చర్మంపై వీలైనంత వరకూ తక్కువగా, సహజమైన ఉత్పత్తులు ఎంచుకోవడం చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శాండ్‌విచ్ పద్ధతి అంటే మాయిశ్చరైజర్-రెటినాయిడ్-మాయిశ్చరైజర్ విధానం పాటించడం ద్వారా చర్మంపై ఒత్తిడి పడకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. మాయిశ్చరైజర్ చర్మంపై ఒక రక్షక పొరను ఏర్పరిచి కాపాడుతుంది. రెటినాయిడ్ చిరాకును తగ్గిస్తుంది.
అయితే మీ చర్మ సంరక్షణ కోసం ఏదైనా కొత్త ఉత్పత్తిని ప్రయత్నించే ముందు తప్పకుండా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలని డెర్మటాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, కాంతివంతమైన చర్మానికి సమతుల్య సంరక్షణ ముఖ్యం. అధిక గాఢత కలిగిన ఉత్పత్తులు కాకుండా సహజ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications