Latest Updates
-
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే!
ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ తీయడానికి ఏ పద్ధతి బెస్ట్?
వ్యక్తిగత శుభ్రత అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇందులో భాగంగా ప్రైవేట్ పార్ట్స్ లో (మర్మావయవాల వద్ద) పెరిగే జుట్టును తొలగించడం అనేది ఆడ, మగ ఇద్దరికీ అవసరమే. అయితే అక్కడ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఏ పద్ధతి పడితే ఆ పద్ధతి వాడితే ఇన్ఫెక్షన్లు, గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ హెయిర్ రిమూవల్ పద్ధతుల్లో ఏది సురక్షితమో, ఏది కాదో ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ణ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియోలో వివరించారు.

హెయిర్ రిమూవల్ క్రీమ్స్ (Hair Removal Creams-వద్దే వద్దు)
చాలామంది సమయం ఆదా అవుతుందని క్రీమ్స్ వాడుతుంటారు. ఇది రాసిన కేవలం ఐదు నిమిషాల్లోనే హెయిర్ రిమూవ్ అవుతుంది. కానీ ఇందులో ఘాటైన కెమకల్స్ ఉంటాయి. వీటి వల్ల ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చర్మం నల్లగా, రఫ్ గా తయారవుతుంది. అంతేకాకుండా దురద, మంట, స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి దీనికి దూరంగా ఉండటమే మేలు.
వాక్సింగ్ (Waxing - అసలు వద్దు)
ఈ పద్ధతిని ఆ ప్రాంతంలో అసలు వాడొద్దు అని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర స్కిన్ అత్యంత సెన్సిటివ్ గా ఉంటుంది. వాక్సింగ్ అనేది చాలా కఠినమైన ప్రొసీజర్. దీనివల్ల చర్మం కాలిపోవడం, గాయాలు అవ్వడం, విపరీతమైన నొప్పి రావడం జరుగుతాయి. కాబట్టి ఈ సాహసం చేయకండి.
ట్రిమ్మింగ్ (Trimming - 100 రెట్లు ఉత్తమం)
మిగతా అన్ని పద్ధతులతో పోల్చితే ట్రిమ్మింగ్ అనేది వంద రెట్లు బెస్ట్, సేఫ్ పద్ధతి. ఇందులో ఎలాంటి కెమికల్స్ వాడకం ఉండదు. కట్స్, బర్న్స్ వంటి గాయాలు అసలే అవ్వవు. ఎవరికి వారు సొంతంగా చాలా సురక్షితంగా, సులువుగా దీని ద్వారా హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. ఎలాంటి స్కిన్ డ్యామేజ్ ఉండదు.
లేజర్ పద్ధతి (Laser Hair Removal - ఖరీదైనది)
జుట్టును దీర్ఘకాలికంగా లేదా శాశ్వతంగా తొలగించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువే. అయితే ఇది చాలా ఖరీదైన ప్రక్రియ. ప్రతి ఒక్కరూ ఈ ట్రీట్‌మెంట్ కు అయ్యే ఖర్చును భరించలేరు.
రేజర్లు (Razors - వాడేటప్పుడు జాగ్రత్త)
మీరు రేజర్ వాడాలనుకుంటే సరైన విధానం తెలిసి ఉండాలి. ముఖ్యంగా లేడీస్ వాడే రేజర్లకు బ్లేడ్ పైన ఒక సబ్బు (Soapy) లేయర్ ఉంటుంది. ఈ లేయర్ ఉన్నంతవరకు ఎలాంటి సమస్యా రాదు, స్మూత్ గా హెయిర్ రిమూవ్ అవుతుంది. కానీ చాలామంది ఆ లేయర్ అరిగిపోయిన తర్వాత కూడా పాత రేజర్ ను పదే పదే వాడుతుంటారు. దీనివల్లే చర్మం తెగిపోయి కట్స్ అవుతాయి. ఆ లేయర్ అయిపోగానే కొత్త రేజర్ వాడటం తప్పనిసరి.
హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి?
హెయిర్ రిమూవ్ చేసిన వెంటనే టైట్‌గా ఉండే బట్టలు, లోదుస్తులు ధరించకూడదు. గాలి తగిలేలా కాటన్ బట్టలు వేసుకోవాలి.
ఆ ప్రాంతంలో వెంటనే ఎలాంటి డియోడ్రెంట్లు లేదా పర్ఫ్యూమ్స్ స్ప్రే చేయకూడదు. దీనివల్ల విపరీతమైన మంట, ఇరిటేషన్ వస్తుంది.
చర్మం ఎర్రబడటం లేదా ఇరిటేషన్ అనిపిస్తే, వెంటనే కొద్దిగా అలోవెరా జెల్ రాస్తే చాలా త్వరగా చల్లదనం, ఉపశమనం లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications