Latest Updates
-
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'!
ఫౌండేషన్ తర్వాత ముఖం ఎందుకు నల్లగా మారుతుంది.. తెలిసీతెలియక చేసే పొరపాట్లు ఇవే.!
మేకప్ వేసుకున్న తర్వాత మునుపటి కంటే మీ ముఖం మరింత కాంతివంతంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎలాంటి మచ్చలూ లేకుండా ఉంటుంది. కానీ కాసేపటి తర్వాత అదే ఫౌండేషన్ నల్లగా లేదంటే బూడిద రంగులో మారి అసౌకర్యం కలిగిస్తుంది. ఫౌండేషన్ నాణ్యత కారణంగా ఈ సమస్య వస్తుందని అనుకుంటారు. కానీ అది తప్పని.. మేకప్ విషయంలో చేసే పొరపాట్ల కారణంగా ఈ పరిస్థితి వస్తుందని బ్యూటీషియన్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కొన్ని సూచనల ద్వారా ఈ సమస్యను తొలగించుకోవచ్చని చెబుతున్నారు.

ఫౌండేషన్ షేడ్ ఎంపిక
మేకప్ తర్వాత మీ ముఖం నల్లగా, బూడిద రంగులోకి మారడం కారణం ఫౌండేషన్‌లో తప్పుడు షేడ్‌ను ఎంచుకోవడమే అని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. షేడ్ ఎంపిక చేసుకునేటప్పుడు సరైనది ఎంచుకోవాలని సూచిస్తున్నారు. మీ చర్మం రంగు కంటే లేతగా లేదా ముదురుగా ఉండే షేడ్‌ను ఎంచుకోవడం ద్వారా క్రమంగా అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
ఫౌండేషన్ షేడ్ కొనుగోలు చేసేటప్పుడు ముందుగా ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి. మెడ, దవడ భాగాల్లో షేడ్ టెస్ట్ చేసుకోవాలి. మీ స్కిన్ అండర్‌టోన్ ప్రకారం ఫౌండేషన్‌ను కొనుగోలు చేయాలి. షాపులో లైటింగ్ వద్ద కాకుండా.. సహజ కాంతిలో ఫౌండేషన్ షేడ్‌ను తనిఖీ చేయడం ద్వారా సరైనది ఎంచుకోగలరు.

స్కిన్ ప్రిపరేషన్, ప్రైమర్
మేకప్ ఫౌండేషన్ కొనుగోలు చేసేముందు సరైన ప్రైమర్ ఉపయోగించాలి. చర్మానికి తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవు. లేదంటే స్కిన్‌తో ఫౌండేషన్ ఆక్సీకరణ చెంది నల్లగా కనిపిస్తుంది.
మేకప్‌కి ముందు
మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని సబ్బు లేదా ఫేస్‌వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మీ స్కిన్ టైప్ ఆధారంగా మ్యాట్ లేదా హైడ్రేటింగ్ ప్రైమర్‌ను అప్లై చేసుకోవాలి. మీ స్కిన్ అండర్‌టోన్ ఆధారంగా ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. దీని ద్వారా యూవీ కిరణాల ఎఫెక్ట్ ముఖంపై పడకుండా కాపాడుతుంది. కొన్ని నిమిషాల తర్వాత ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి.
ముఖానికి మేకప్ సమయంలో ఫౌండేషన్‌ను పరిమితికి మించి పూయకూడదు. లేదంటే ఫినిషింగ్ సరిగా రాదు. అంతేకాకుండా అక్కడకక్కడా మచ్చలుగా కూడా కనిపిస్తుంటుంది. ముందుగా పలుచని పొరతో ప్రారంభించి తర్వాత అవసరమైతే డోస్ పెంచాలి. మేకప్ వేసేటప్పుడు నూనె ఆధారిత, నీటి ఆధారిత ఉత్పత్తులను కలిపి పూయకూడదు. శుభ్రమైన స్పాంజ్ లేదా బ్రష్‌ను మాత్రమే ఉపయోగించాలి. దీని ద్వారా గాలిలో దుమ్ము, బ్యాక్టీరియా ముఖంపై చేరకుండా ఉంటుంది.
ఇవి గుర్తుంచుకోండి..
ఫౌండేషన్ వేసుకున్న తర్వాత దానిని సరిగ్గా సెట్ చేసుకోవాలి. లేదంటే ముఖంలోని అధిక నూనె ఫౌండేషన్‌తో కలిసిపోతుంది. ఫలితంగా మేకప్ మరింత ముదురుగా కనిపించి సహజ లుక్‌ను పోగొడుతుంది. మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉండటానికి సెట్టింగ్ స్ప్రేను వాడటం ఉత్తమం. జిడ్డు చర్మం ఉన్నవారు బ్లాటింగ్ పేపర్‌ను ఉపయోగించాలి. నాణ్యమైన ఫౌండేషన్ ఉత్పత్తులను మాత్రమే వాడండి. అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి. సరైన షేడ్, మేకప్ పద్ధతి ద్వారా మాత్రమే ఎక్కువసేపు తాజాగా, సహజంగా ఉండే లుక్ సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
