Latest Updates
-
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.!
ఫిల్టర్స్, మేకప్‌తో పనే లేదు.. నేచురల్ గ్లోయింగ్ స్కిన్ కోసం యోగా సూత్రాలు.!
మార్కెట్‌లో ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. చర్మ సంరక్షణ కోసం, ముఖ సౌందర్యం కోసం రకరకాల ఉత్పత్తులు వాడటం చూస్తుంటాం. అయితే ఆ ఫలితం చర్మంపై వాటి ప్రభావం ఉన్నంత వరకు మాత్రమే కనిపిస్తుంది. కానీ సహజంగా ముఖ నిగారింపు అనేది అతివలకి మరింత ఆత్మవిశ్వాసాన్ని, అందాన్ని ఇస్తుంది. ఈ క్రమంలో ముఖ సౌందర్యాన్ని, యవ్వనాన్ని పెంచుకోవడం కోసం 'ఫేస్ యోగా' ఎంతో ఉపయోగపడుతుంది.

ఫేస్ యోగా ద్వారా ముఖ కండరాలకు రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని బిగుతుగా మార్చి దుమ్ము, ధూళి నుంచి సంరక్షిస్తుంది. ముఖానికి సహజమైన కాంతిని అందిస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకునే లోషన్, సీరమ్‌తో ఫేస్ యోగా చేయడం ద్వారా సత్ఫలితాలు కనిపిస్తాయి.
బుగ్గలను ఉబ్బించడం
సాధారణంగా కొందరు అమ్మాయిలకు బుగ్గలు వదులుగా ఉంటాయి. దీంతో ముఖం లావుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖం ఆకర్షణ కోల్పోతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు నోటి ద్వారా గాలిని పీల్చుకుని రెండు బుగ్గలను వీలైనంతగా బెలూన్‌లా ఉబ్బించాలి. ఇప్పుడు రెండు చేతుల వేళ్లతో బుగ్గలపై సున్నితంగా 30 సెకన్ల పాటు తట్టడం ద్వారా బుగ్గలు బిగుతుగా మారతాయి. దీంతో ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.
చేప ముఖం
చేప ముఖం ఫేస్ యోగాలో భాగంగా మీ రెండు చెంపలను, పెదాలను లోపలికి లాగాలి. ఇప్పుడు చేప ఆకారంలో ముఖం మారుతుంది. ఈ భంగిమను 10 సెకన్ల పాటు ఉంచుతూ ఊపిరిని బిగబట్టాలి. తర్వాత వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా దవడలు ఆకర్షణీయంగా మారతాయి.
కనుబొమ్మల వ్యాయామం
ఐ బ్రోస్ ఫేస్ యోగాలో భాగంగా మీ కళ్లను వీలైనంత పెద్దవిగా తెరవాలి. ఇప్పుడు కనుబొమ్మలను పైకి లేపి ఉంచాలి. ఇలా వరుసగా 10 సార్లు చేయాలి. దీని ద్వారా కంటి చుట్టుపక్కల ఉన్న సన్నని గీతలు, ముడతలు తగ్గిపోయి కళ్లకు అలసట తగ్గుతుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. సరైన నిద్ర ద్వారా ముఖంపై వాపు తగ్గి ప్రకాశవంతంగా మారుతుంది.
కనుబొమ్మలపై సున్నితంగా మసాజ్ చేయడం, కళ్ల కింద ముక్కుకి రెండు వైపులా కంటి చివరల వరకూ సున్నితంగా రుద్దడం, రెండు చేతుల వేళ్లతో ముఖంపై బుగ్గలు, నుదురు, కళ్ల కింది భాగంలో, బుగ్గల కింద చిన్నగా తడుతూ చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. రెండు దవడల వైపు వేళ్లతో మసాజ్ చేసినా వాటి ఆకృతి ఆకర్షణీయంగా ఉంటుంది.
కపాలభాతి ప్రాణాయామం
ఫేస్ యోగాలోనే కాకుండా యోగాసనాల్లో శ్వాస క్రియలకు చాలా ప్రాధాన్యత ఉంది. సరైన విధానంలో శ్వాస తీసుకోవడం ద్వారా శరీరంలోని కాలుష్యాలు బయటకు వెళ్లిపోతాయి. కపాలభాతి ప్రాణాయామం ద్వారా రక్తం శుద్ధి అవుతుంది. ఫలితంగా ముఖ చర్మానికి రక్త ప్రసరణ మెరుగై మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఫేస్ యోగా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చేతులు శుభ్రంగా కడుక్కుని తడి ఆరేవరకు తుడుచుకోవాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించి యోగా చేయడం ద్వారా చర్మం పొడిబారకుండా ఉంటుంది. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు క్రమం తప్పకుండా చేయడం సత్ఫలితాలను ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రక్రియ చేసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications