Latest Updates
-
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం!
సన్నగా ఉండే వారిలోనూ ఫ్యాటీ లివర్.. ఒంట్లో కొవ్వు లేకపోయినా ఈ రిస్క్ తప్పదు.!
ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం. అయితే లావుగా ఉన్నవారిలోనే ఫ్యాటీ లివర్ వస్తుందని అనుకుంటాం. కానీ సన్నగా ఉండే వారిలో కూడా ఈ సమస్య వస్తుంది. శరీరంలో కొవ్వు లేకపోయినా లివర్‌లో అదనంగా కొవ్వు పేరుకుపోయి సమస్యకి దారితీస్తుంది. చెడు ఆహారపు అలవాట్లు, అధికంగా చక్కెర తీసుకోవడం, శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. మరి సన్నగా ఉండే వ్యక్తుల్లో ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది.. అందుకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం..

అధిక బరువు, ఊబకాయమే ఫ్యాటీ లివర్‌కి కారణమంటే అది పూర్తి వాస్తవం కాదు. సాధారణ బరువు ఉండి, సన్నగా ఉండే వారిలో కాలేయంలో అదనంగా కొవ్వు పేరుకుపోతుంది. ఈ లీన్ ఫ్యాటీ లివర్‌ను.. కేవలం బాడీ వెయిట్ ఆధారంగా అంచనా వేయలేం.
లీన్ ఫ్యాటీ లివర్ ప్రమాదం..
చక్కెర, కూల్‌డ్రింక్స్, ప్యాక్‌డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, శారీరకంగా తక్కువ యాక్టివ్‌గా ఉండే వారిలో లీన్ ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్, హై కొలెస్ట్రాల్, పొట్ట చుట్టూ కొవ్వు ఉండటం, మద్యం సేవించడం ఇలాంటి అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ ప్రమాదం పెరుగుతుంది. జన్యుపరమైన కారణాలు కూడా దీనికి దారితీయవచ్చు.
లీన్ ఫ్యాటీ లివర్ సంకేతాలు..
లీన్ ఫ్యాటీ లివర్ సమస్య వచ్చినప్పుడు ప్రారంభ దశల్లో తరచుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. అలసట, పొత్తికడుపు కుడి పైభాగంలో కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. సాధారణ పరీక్షలు లేదా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఈ సమస్యను తెలుసుకోవచ్చు. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే లివర్ వాపు లేదా వ్యాధి రావచ్చు.

సన్నగా, సరైన బరువుతో ఉన్నంత మాత్రాన ఆరోగ్యకరంగా ఉన్నాయని అనుకోవద్దు. సమతుల్య ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ కనీసం 30నిమిషాల పాటు శారీరక శ్రమ చేయడం, ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో కాసేపు అటూఇటూ నడవడం వంటి అలవాట్ల ద్వారా ఫ్యాటీ లివర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. కూల్‌డ్రింక్స్, ఫాస్ట్‌ఫుడ్, డీప్ ఫ్రై ఆహారాలను పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే మానేయడం మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ సమస్యను ముందుగా గుర్తించడం, జీవనశైలిలో మార్పుల ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను నివారించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
