Latest Updates
-
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా!
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.!
నోటి ఆరోగ్యానికి దంతాలు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. దంతాల విషయంలో ఏవైనా తేడాలు గమనించినా, అసౌకర్యం నెలకొన్నా ఇది నోటి ఆరోగ్యం సరిగా లేదనడానికి సంకేతంగా పరిగణించాలి. ముఖ్యంగా మీ పళ్ల నుంచి రక్తం కారుతున్నట్లయితే దానిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని డెంటిస్ట్ నిపుణులు సూచిస్తున్నారు. దీని వెనుక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చని చెబుతున్నారు.

దంతాలు లేదా పళ్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడానికి ఒక సాధారణ సమస్యగా చాలా మంది పరిగణిస్తారు. గట్టిగా బ్రష్ చేయడం వల్ల ఇలా అవుతుందని అనుకుంటారు. అయితే దీని వెనుక చాలా కారణాలు ఉంటాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. పళ్లపై పాచి, బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల జింజివైటిస్ సంభవిస్తుంది. ఇది దంతాల నుంచి రక్తస్రావానికి దారితీస్తుంది.
దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం పళ్ల నుంచి రక్త స్రావానికి ప్రధాన కారణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. పళ్లను సరిగా శుభ్రం చేసుకోకపోతే చిగుళ్లు బలహీనపడతాయి. ఫలితంగా బ్రష్ చేసుకునేటప్పుడు, గట్టి ఆహార పదార్థాలు తినేటప్పుడు రక్తస్రావం అవుతుంది. చిగుళ్లు సున్నితంగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే మృదువైన టూత్ బ్రష్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు.
దంతాల ఆరోగ్యానికి, గట్టిగా, దృఢంగా ఉండటానికి విటమిన్ సి చాలా అవసరం. అయితే విటమిన్ సి లోపం వల్ల పళ్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవతుంది. విటమిన్ కె లోపించినా ఈ పరిస్థితికి దారి తీయవచ్చు. ఈ రెండు పోషకాలను ఆహారంలో సరిగా ఉండేలా చూసుకోవడం ద్వారా చిగుళ్లు, రక్తనాళాలను కాపాడుకోవచ్చు.
కొంతమంది బ్రష్ చేసే విధానం చాలా తప్పుగా ఉంటుంది. గట్టిగా పళ్లు తోమడం లేదా, హార్డ్ టూత్ బ్రష్‌లను ఉపయోగించడం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. ఇంకా ఎంత వేగంగా, బలంగా బ్రష్ చేస్తే దంతాలు అంత బాగా శుభ్రపడతాయని కూడా కొందరిలో అపోహ ఉంది. ఇది చాలా పెద్ద పొరపాటు. దీని వల్ల పళ్లు బలహీనంగా మారతాయి. నెమ్మదిగా బ్రష్ చేస్తూ, ఎక్కువ బలం పెట్టకుండా దంతాలను శుభ్రం చేసుకోవాలి.

డయాబెటిస్ సమస్య ఉన్నవారు, రక్తాన్ని పెంచే మందులు వాడేవారు, ప్లేట్‌లెట్ సంఖ్య తక్కువ ఉన్నవారిలోనూ ఈ సమస్య ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యలు ఉన్నవారు పళ్ల చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నట్లయితే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి. మీ చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతున్నా, నోటి నుంచి దుర్వాసన వస్తున్నా, చిగుళ్ల వాపు ఉన్నా మీరు వెంటనే అందుకు సంబంధించి చికిత్స తీసుకోవాలి. సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా చిగుళ్ల వ్యాధి నుంచి, దంతాలు ఊడిపోవడం సమస్యను నివారించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
