Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
స్త్రీలు వే ప్రొటీన్ తినొద్దు, వే ప్రొటీన్ కిడ్నీలను దెబ్బతీస్తుంది.. ఇవన్నీ నిజాలా? అపోహలా?
ప్రోటీన్ షేక్ తీసుకుంటే కండలు తిరిగిన దేహం సొంతం అవుతుందని, కొవ్వు కరిగి మంచి షేప్ వస్తుందని ఎంతో మంది నమ్ముతుంటారు. వే ప్రొటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అంది, కేలరీలు తక్కువ తీసుకుంటామని అంటారు.
ప్రొటీన్లు కండరాలను రిపేర్ చేసి, వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయని అంటారు. వే ప్రొటీన్ సప్లిమెంట్లు ప్రొటీన్ షెక్స్, బార్‌ల రూపంలో లభిస్తాయి. అయితే కొందరు ఈ ప్రొటీన్ ను స్త్రీలు తీసుకోవద్దని, వే ప్రొటీన్ ఓ స్టెరాయిడ్ అని, ప్రొటీన్ కిడ్నీలను దెబ్బతీస్తుందని చెబుతుంటారు. అందులో ఎంత నిజం ఉంది, అవన్నీ అపోహలా.. నిజాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వే ప్రొటీన్ అంటే ఏంటి?
వే ప్రొటీన్ అనేది పాల నుంచి తీసిని ప్రొటీన్. జున్ను తయారీ నుంచి మిగిలిపోయిన ద్రవం. ఇది మూడు రూపాల్లో లభిస్తుంది. వే ప్రొటీన్ కాన్సన్‌ట్రేట్, వే ప్రొటీన్ ఐసోలేట్, వే ప్రొటీన్ హైడ్రోలైసేట్. వే ప్రొటీన్ కాన్సన్‌ట్రేట్ ను సాధారణంగా ఎక్కువగా మంది తీసుకుంటారు. ఇందులో 70 - 80 శాతం ప్రొటీన్ ఉంటుంది. వే ప్రొటీన్ ఐసోలేట్ అనేది స్వచ్ఛమైనది. ఇందులో 90 శాతం కంటే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. వే ప్రొటీన్ హైడ్రోలైసేట్ అనేది అత్యంత ప్రాసెస్ చేసిన రూపం. ఇది తీసుకుంటే పోషకాలు త్వరగా శోషించబడతాయి.
30 గ్రాములవే ప్రొటీన్‌లో ఉండే పోషకాలు:
- 120 కేలరీలు
- 24 గ్రాముల ప్రొటీన్
- 2 గ్రాముల ఫ్యాట్
- 3 గ్రాముల కార్బోహైడ్రేట్లు
- 1 గ్రాము చక్కెర
- విటమిన్లు, మినరల్స్, కాల్షియం, ఐరన్, విటమిన్ బి12 లాంటివి కూడా ఉంటాయి.
వే ప్రొటీన్ స్త్రీలు తీసుకోవద్దు!
మహిళలు కూడా వే ప్రొటీన్ ను తీసుకోవచ్చు. వారి ఆహారంలో ప్రొటీన్ తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు. అలాగే వే ప్రొటీన్ తీసుకుంటే స్త్రీలు పురుషుల్లాగా ఏం కనిపించరు. వే ప్రొటీన్ ను స్త్రీలు తీసుకోవద్దని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే స్త్రీలు కండలు పెంచితే పురుషుల్లా కనిపిస్తారని అపోహ. ఇది వారికి అవసరమైన పోషకాలు అందించడంలో సహాయపడుతుంది. ఫిట్‌నెస్ లక్ష్యాలను అందుకోవడంలో సహాయపడుతుంది. లీన్ కండర ద్రవ్యరాశిని నిర్మించడంలో, కండరాలని రిపేర్ చేయడంలో దోహదపడుతుంది.
వర్కవుట్ తర్వాత మాత్రమే వే ప్రొటీన్ తీసుకోవాలి!
వర్కవుట్ తర్వాత మాత్రమే వే ప్రొటీన్ తీసుకోవాలన్నది చాలా మందికి ఉన్న అపోహ. వ్యాయామం తర్వాత ప్రొటీన్ తీసుకోవడం వల్ల కండరాలు రిపేర్ అవుతాయని, పెరుగుదలను మెరుగుపరుస్తాయన్నది నిజం. అయితే వే ప్రొటీన్ ను రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అల్పాహారం సమయంలో తీసుకుంటే రోజుకు కావాల్సిన ప్రోటీన్ తీసుకోవడం పెంచడానికి సహాయపడుతుంది.
వే ప్రొటీన్ కేవలం అథ్లెట్లు, బాడీబిల్డర్లకు మాత్రమే!
అథ్లెట్లు, బాడీ బిల్డర్లు ఎక్కువాగ వే ప్రొటీన్ తీసుకుంటారు. అయితే ఆహారంలో ప్రొటీన్ తీసుకోవడాన్ని పెంచాలనుకునే ప్రతి ఒక్కరూ వే ప్రొటీన్ తీసుకోవచ్చు. వే ప్రొటీన్ కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి సహాయపడుతుంది. వే ప్రొటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలను అందించడం ద్వారా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వే ప్రొటీన్ ఒక స్టెరాయిడ్!
వే ప్రొటీన్ కూడా ప్రొటీనే. స్టెరాయిడ్ కాదు. ఇందులో ఎలాంటి హార్మోన్లు ఉండవు. ఇందులో కేవలం ప్రొటీన్లు మాత్రమే ఉంటాయి.
వే ప్రొటీన్ కిడ్నీలను దెబ్బతీస్తుంది!
పరిమితంగా వే ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మితంగా తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రావు. అయితే పరిమితి దాటితే ఆరోగ్య సమస్యలు తలెత్తుయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
