Latest Updates
-
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.!
వర్షాకాలం వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ దానితో పాటు అనేక వ్యాధులను కూడా శరీరం మీదకు తీసుకువస్తుంది. దీంతో అనారోగ్యానికి గురి కాక తప్పదు. రోగనిరోధక శక్తి తగ్గి సీజనల్ వ్యాధుల బారిన పడవచ్చు. ఈ క్రమంలో వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీ రోజు వారీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను ప్రధానంగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ప్రకృతి సిద్ధంగా లభించే కొన్ని పదార్థాలు మన జీవక్రియకు సంజీవనిలా పనిచేస్తాయి. అందుకే నేటి ఆధునిక యుగంలో మళ్లీ వాటి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ప్రకృతి అందించే ఈ ఆయుర్వేద చిట్కాలను వర్షాకాలంలో పాటించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తుంది. అవేంటంటే..
ఉసిరి
విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లలో ఉసిరి ముందుంటుంది. వర్షాకాలంలో రోజుకు ఒక్కటైనా ఉసిరి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో బాక్టీరియాతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి జీర్ణవ్యవస్థ సవ్యంగా పనిచేసేందుకు దోహదపడుతుంది.
తులసి
ఆరోగ్యానికి వరం, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి ఆకులు సీజనల్ వ్యాధులకి శాశ్వత పరిష్కారం. వర్షాకాలంలో కొత్త నీటి ద్వారా వచ్చే గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఆయాసం, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు రోజూ పరగడుపున తులసి ఆకులు తినడం ద్వారా కొన్ని రోజుల్లోనే ఫలితం ఉంటుంది. చిన్న పిల్లలకు వీటిని రసంలా పిండి తాగిస్తే సహజంగానే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
పసుపు
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు వేడి పాలల్లో పసుపు వేసుకుని తాగడం ద్వారా ఈ సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు, తలనొప్పిని నివారిస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పోరాడి వ్యాధులతో పోరాడేలా చేస్తుంది.

మునగాకులో ఉండే దివ్య ఔషధ గుణాలు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎంతో మేలు చేస్తాయి. ఇనుము, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి లాంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉండటం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మునగాకుతో రసం చేసుకుని వారానికోసారి అన్నంతో తినడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఇక, బీట్‌రూట్‌లోని సహజ సమ్మేళనాలు శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపిచేస్తాయి. ఇందులోనూ ఫైబర్ పుష్కలంగా ఉండటంలో జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. రక్తహీనత సమస్యను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి అనారోగ్యం నుంచి పోరాడేలా చేస్తుంది.
వర్షాకాలంలో ఔషధ గుణాలు ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో వారు రోగాల బారిన పడే అవకాశం ఎక్కువ. రోగ నిరోధక శక్తి తగ్గితే వర్షపు నీటిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా చర్మంపై దద్దుర్లు ఏర్పడే ప్రమాదం ఉంది. బాక్టీరియా, ఫంగస్ వేగంగా అభివృద్ధి చెంది వైరల్ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది.
అందుకే వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజూ రెండు పూటలా స్నానం చేయించి శుభ్రమైన టవల్‌తో తుడవాలి. చర్మం పొడిబారకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్ వాడటం మంచిది. రసాయన సబ్బులు కాకుండా వేప ఆకులను రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటితో స్నానం చేయించాలి. దీంతో శరీరంపై దద్దుర్లు తగ్గుతాయి. శుభ్రమైన, ఆరిన బట్టలను మాత్రమే పిల్లలకు వేయాలి. రోడ్ల పైన బురద కారణంగా బయట ఎక్కువగా ఆడుకోనివ్వకుండా చూసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
