Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ.. కేవలం 2 పదార్థాలతో నోట్లో వెన్నలా కరిగిపోయేలా! -
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.? -
గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుండే ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత లెవల్ ఉండాలి? ఎలా పెంచుకోవాలి? -
బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌తో నో యూజ్.. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి! -
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్‌కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.! -
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.! -
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.! -
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.!
ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.. వర్షాకాలంలో దోమల నివారణకి ఆయుర్వేద చిట్కాలు.!
వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద విపరీతంగా ఉంటుంది. దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, విరేచనాలు, వాంతులు వంటి వ్యాధులు ప్రబలుతాయి. చిన్నారులకు, వృద్ధులకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఇంటితో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. దీనికి కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు ఉత్తమంగా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం..

వేసవి తాపం నుంచి వర్షాకాలం ఉపశమనం కలిగించినా సీజనల్ వ్యాధులు ఆందోళన కలిగిస్తాయి. ఈ కాలంలో ఇంటి చుట్టూ గుంతల్లో నీరు, పూలకుండీల్లో, పాత బకెట్లలో నీరు నిలిచి ఉంటుంది. డ్రైనేజీలు పొంగిపొర్లుతాయి. ఈ కారణంగా దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఇక ఇంట్లో తేమ వాతావరణం ఉంటే ఇంట్లోకి వ్యాపించి పలు వ్యాధులకు కారణమవుతుంది. ఈ క్రమంలో ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా చాలా తక్కువ ఖర్చుతో దోమల బారినుంచి బయటపడవచ్చు.
నీటి నిల్వ
రోజుల తరబడి నీటి నిల్వ ఎక్కడ ఉన్నా దోమలు సంతానోత్పత్తికి కేంద్రంగా మార్చుకుంటాయి. ముఖ్యంగా ఎయిర్ కూలర్లు, పూలకుండీలు, ట్రేలు, బకెట్లు, టైర్లలో నీరు నిలిచి ఉన్నట్లయితే దోమలు పుట్టుకొస్తాయి. ఇంటి పైకప్పుల మీద కూడా నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెందుతాయి. అందువల్ల ఆ ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు.

వేప, కర్పూరం
దోమలను సమూలంగా తరిమికొట్టడంలో వేప ఆకులు, కర్పూరం సమర్థవంతంగా పనిచేస్తాయి. వాటి నుంచి ఘాటు వాసనకి దోమలు పారిపోతాయి. సాయంత్రం సమయంలో కర్పూరం వెలిగించి దాని సువాసనను గది మొత్తం వ్యాపించేలా చేయాలి. ఇది దోమలను దరిచేరకుండా చూస్తుంది. డిఫ్యూజర్‌లో కొన్ని చుక్కల వేప నూనెను వేయడం ద్వారా వేప చేదు ఘాటుకి దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇది ప్రకృతి వైద్యంలా పనిచేసి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది.
వెల్లుల్లి స్ప్రే
దోమల నివారణకు వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. వీటి నుంచే వచ్చే ఘాటు వాసనకు దోమలు దరిచేరవు. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీళ్లు చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో నింపాలి. సాయంత్రం సమయంలో కిటికీలు, డోర్లు, బాల్కనీల మూలల్లో చల్లాలి. దీని ద్వారా ఆ ఘాటు వాసనకి దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
తులసి, నిమ్మగడ్డి
నీటి నిల్వ ఉన్న కారణంగా దుర్వాసనకి దోమలు వ్యాప్తి చెందుతాయి. ఇందుకు తులసి, నిమ్మ గడ్డి వంటి మొక్కలు పరిష్కారం చూపిస్తాయి. ఈ మొక్కల నుంచి సహజ సువాసన కారణంగా దోమలు దూరంగా పారిపోతాయి. కిటికీలు, బాల్కనీలు, ఇంటి గేట్, మెయిన్ డోర్ దగ్గర ఈ మొక్కలను ఉంచడం ద్వారా దోమలు ఇంట్లోకి చేరవు. ఇవి పరిసరాలను తాజాగా ఉంచడమే కాకుండా ఇంటి అందాన్ని మరింత పెంచుతాయి.
దోమ తెరలు
వర్షాకాలంలో ఇంటి డోర్లు, కిటికీలకు దోమలు దూరకుండా తెరలు అమర్చుకోవాలి. దీని ద్వారా బయటి నుంచి కీటకాలు ఇంట్లోకి రాకుండా నివారిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు మంచంపైన దోమ తెరలు అమర్చుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ఇది కీలకమని గుర్తించాలి. ఇలాంటి సహజ చిట్కాలు పాటించడం వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications