Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాల్సింటే..
శరీర ఆరోగ్య విషయంలో కాలేయానికి ప్రధాన్యతను చాలా తక్కువగా ఇస్తారు. శరీరంలో కాలేయం దాదాపు 500లకు పైగా పనులు చేస్తుంది. అలాంటి కాలేయం పై చాలా మంది శ్రద్ధ వహించరు. గుండెకు ఎక్కువ ప్రధాన్యత ఉన్నప్పటికీ కాలేయం ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. దానికోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

ఆహారం శరీరం లోపలికి వెళ్లి అది ప్రొటీన్లుగా కొలస్ట్రాల్‌గా, వైటమిన్లుగా, ఇంకా చాలా పోషకాలుగా మారాలన్నా అందులో ముఖ్య పాత్ర పోషించేది కాలేయమే.
కాఫీ
ఆరోగ్యవంతమైన లివర్ కోసం కాఫీ తాగాలి. లివర్‌ను కాఫీ చాలా రోగాల బారి నుంచి కాపాడుతోందని పరిశోధనల్లో తేలిసింది. 2016లో జరిగిన పరిశోధనల ప్రకారం.. సిర్రోసిస్ వ్యాధికి గురికాకుండా కాఫీ కాపాడుతోందని నివేదికలో తేల్చారు. మెడికల్ పరిభాషలో లివర్ శాశ్వతంగా దెబ్బతింటే దానిని సిర్రోసిస్ వ్యాధిగా గుర్తిస్తారు. లివర్ క్యాన్సర్‌ను కూడా తగ్గించే శక్తి కాఫీలో ఉందని కూడా ఈ పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు మూడు కాఫీలు తాగేవారి కాలేయం చాలా ఆరోగ్యవంతంగా ఉందని లెక్కలు చూపెడుతున్నాయ్.
టీ
టీ కూడా కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధనలు చెబుతున్నాయ్. లివర్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నవారికి గ్రీన్‌టీ ఇవ్వడం ద్వారా ఆ రోగులకు చాలా ప్రయోజనాలు కలిగాయ్. హానికర టాక్సిన్స్‌ను కూడా నిర్మూలించడంలో చాలా దోహదపడింది.
ద్రాక్ష పళ్లు
ద్రాక్ష పళ్లు కూడా కాలేయానికి చాలా ఆరోగ్యకరమని పరిశోధనలు చెబుతున్నాయ్. 2023లో జరిగిన పరిశోధనల్లో ఈ ద్రాక్షలు శరీరంలో లివర్ చెడిపోవడానికి కారణమయ్యే హెపాటిక్ ఫిబ్రోసిస్ పెరుదలను తగ్గిస్తుందని కనుగ్గొన్నారు.
బీట్‌రూట్ జ్యూస్
బీట్‌రూట్ జ్యూస్ తాగమని వైద్యులు కాలేయవ్యాధితో బాధపడే వారికి సూచిస్తున్నారు. ఇందులో బెటాలైన్స్ అని పిలవబడే నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయ్. ఈ బీట్‌రూట్ జ్యూస్‌ను జంతువులకు తాగించి పరిశోధనలు జరిపారు. అప్పుడు జంతువుల కాలేయంపై ఉన్న వాపును తగ్గించినట్లు తెలుసుకున్నారు.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌ను హెల్తీ ఫ్యాట్ కింద పరిగణిస్తారు. లివర్ లో కొవ్వు పెరగకుండా ఉంచుతుంది. వంటల్లో సాధారణ నూనె బదులు ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే కాలేయానికి ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు.
లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే..
బరువు ఎక్కువ పెరిగితే లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. కాబట్టి బరువును పెంచవద్దు, లేదంటే వెంటనే తగ్గించుకోవడానికి కృషి చేయాలి.
ప్రతీ రోజూ వ్యాయామం చేస్తే లివర్‌పైనున్న కొవ్వును తగ్గిస్తుంది. మద్యం ఎక్కువ తాగడాన్ని కూడా తగ్గించాలి. ప్రతీ రోజూ వ్యాయామని లివర్ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. చేతులు తరచుగా కడుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
