Latest Updates
-
చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఆగస్టు 25 నుంచి ఈ 3 రాశులకు కుప్పలుతెప్పలుగా ధనాగమం! -
సండే స్పెషల్: నోరూరించే ఎగ్ ఘీ రోస్ట్ మసాలా..నాలుకకి పండగే పండగ..వేళ్లు నాక్కుంటూ తినేస్తారు! -
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే..
చర్మ నిగారింపు కోసం.. వీటిని ముఖానికి పూయడమే కాదు, తిన్నా ప్రయోజనమే.!
ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం కేవలం ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడితే సరిపోదు. అందుకు అనుగుణంగా సముతుల్య ఆహారం, సరైన జీవనశైలి చాలా అవసరం. మన శరీరం అంతర్గతంగా సంరక్షణగా ఉంటేనే బాహ్యంగా సురక్షితంగా ఉంటుంది. సహజమైన నిగారింపుతో స్కిన్ మెరిసిపోతుంది. ఈ క్రమంలో మన ప్రకృతి అందించే కొన్ని పదార్థాలను ముఖానికి పూసుకోవడమే కాదు.. తిన్నా ఎంతో ప్రయోజనం ఉంటుంది. మరి ఆ సహజ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం..

చర్మ సంరక్షణ కోసం మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులతో పోలిస్తే ప్రకృతి సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజూ ఆహరంలో భాగం చేసుకోవచ్చు. దీని ద్వారా శరీరానికి అంతర్గతంగా అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ అందుతాయి. ఇక చర్మానికి అప్లై చేస్తే సహజంగా తేమ అందడంతో పాటు మురికిని తొలగించి నిగారింపును సొంతం చేస్తుంది. అయితే మీ చర్మ రకం, సున్నితత్వం, అలెర్జీలతో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం లేదా చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించాలి.
తేనె
ప్రకృతి అందిస్తున్న ఆయుర్వేద గుణాలు మెండుగా ఉన్న సహజసిద్ధమైన తీపి పదార్థం తేనె. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ పరగడుపున తేనెను తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. ఇక ముఖానికి అప్లై చేసుకునే ముందు ఫేస్‌ను శుభ్రంగా కడుక్కుని పలుచుని పొరగా రాయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగినట్లయితే చర్మం సహజ తేమను కోల్పోకుండా ఉంటుంది. మృదువుగా ఉండేలా చేస్తుంది.
పెరుగు
పెరుగులో ప్రొటీన్, కాల్షియం, ప్రొబయాటిక్స్ పుష్కలంగా ఉన్న కారణంగా జీర్ణక్రియకు దోహదపడుతుంది. ఇక, ముఖానికి ఫ్యాట్‌లెస్ పెరుగును సున్నితంగా అప్లై చేసి పది నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా చర్మాన్ని చలువగా చేస్తుంది. వేడి చేయకుండా కాపాడుతుంది. మృదువుగా ఉంచుతుంది.
ఓట్స్
ఓట్స్‌లో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. దీనిని మీ సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. దీనిని ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఓట్స్‌ను పెరుగు లేదా నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖంపై అప్లై చేసి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మాన్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది.

కలబంద
కలబందను అందరూ తినలేరు. వీటిని తినాలనుకునేవారు ఆహార ప్రమాణాలకు అనుగుణంగా, సురక్షితంగా తయారు చేసిన కలబంద ఉత్పత్తులను మాత్రమే వాడాలి. వీటిని తినడం కంటే ముఖానికి రాసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం కలబంద జెల్‌ను ముఖానికి పలుచని పొరలా రాయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి చల్లదనాన్ని, తాజాదనాన్ని ఇస్తుంది. తేమగా ఉంచుతుంది. గర్భిణీలు, వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మందులు వాడుతున్న వారు కలబందను వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
కొబ్బరి నూనె
పచ్చి కొబ్బరిని తరచుగా తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక, కొబ్బరినూనెను పొడి చర్మం ఉన్న వారు తరచుగా ముఖానికి అప్లై చేసుకోవచ్చు. లేదా రాత్రిపూట ముఖానికి మర్దనా చేసుకోవడం, లేదా మాయిశ్చరైజర్‌లా వాడవచ్చు. దీని ద్వారా ముఖానికి తేమను అందించి సురక్షితంగా ఉంచుతుంది. అయితే జిడ్డు చర్మం, మొటిమలు ఉన్నవారు కొబ్బరి నూనెను వినియోగించేముందు డెర్మటాలజిస్టు సలహా తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.
కీరదోస
కీరదోసలో ఫైబర్, నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. దీనిని మీ సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరం తేమగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక ముఖానికి అప్లై చేయాలనుకున్నప్పుడు పలుచని ముక్కలుగా కోసి కళ్లపై, ముఖంపై ఉంచుకోవాలి. కీరదోసను పేస్ట్‌లా చేసుకుని ముఖంపై అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా చర్మానికి చల్లదనం అందించడంతో పాటు తాజాగా ఉంచుతుంది.

అవకాడో
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మెండుగా ఉంటాయి. వీటిని సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవాలి. అవకాడోను ఫేస్‌ప్యాక్‌లా ఉపయోగించవచ్చు. పండిన అవకాడోను మెత్తగా చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా పొడి చర్మం మృదువుగా మారుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఈ ఫేస్ ప్యాక్‌లు అప్లై చేసేవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం తప్పనిసరి. మంట, దురదగా అనిపించినా, ఎర్రగా మారినా నిపుణుల సలహా తీసుకోవాలి. తాజా పదార్థాలను మాత్రమే వాడాలి. ఫేస్‌ప్యాక్‌ను 15 నిమిషాలకు మించి ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications