అబ్బో శృతిహాసన్ మూమూల్ది కాదు..అమ్మాయిలు కోరుకునే రహస్యం బయటపెట్టిందిగా!

విశ్వనటుడుగా పేరుపొందిన కమల హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ తన గ్లామర్,నటన,డ్యాన్స్, సింగింగ్ స్కిల్స్ తో సీనీ ప్రపంచంలో దూసుకెళ్తుంది. టాలీవుడ్ లో కూడా అనేక సూపర్ హిట్ లను అందుకున్న ఈ అమ్మడుకి అభిమానులు కూడా ఎక్కువమందే ఉన్నారు. శృతిహాసన్ జుట్టుకి చాలామంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. నల్లని, ఒత్తైన కురులతో నిగనిగలాడుతూ, ఆరోగ్యంగా కనిపించే శృతి హాసన్ జుట్టు వెనకున్న రహస్యం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతుంటారు. జుట్టు కోసం శృతిహాసన్ ఏం షాంపూ వాడుతుంటది,శృతిహాసన్ జుట్టు విషయం ఏం జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకునేందుకు చాలా ఆసక్తి కనబరుస్తుంటారు చాలామంది అమ్మాయిలు. ఈ క్రమంలో ది రణ్‌వీర్ షో పాడ్‌ కాస్ట్‌ లో పాల్గొన్న శ్రుతిహాసన్ తన హెయిర్ కేర్ వెనకున్న అసలు రహస్యం చెప్పేసింది. ఆమె చెప్పిన సింపుల్ చిట్కా విని అందరూ ఆశ్చర్యపోయారు.

శృతిహాసన్ చెప్పిందిదే

కేవలం నువ్వుల నూనె
మీ జుట్టు ఇంత ఆరోగ్యంగా, అందంగా ఎలా ఉంటుంది? అని హోస్ట్ రణ్‌వీర్ అల్లాబాడియా అడిగిన ప్రశ్నకు శ్రుతి ఏమాత్రం ఆలోచించకుండా, అదంతా నువ్వుల నూనె వల్లే. అంతే అని సింపుల్ గా శృతిహాసన్ బదులిచ్చారు. ఆమె దీని గురించి వివరిస్తూ..ఇది నా సహజమైన జుట్టు రంగు. నేను కేవలం నువ్వుల నూనె మాత్రమే వాడతాను. అప్పుడప్పుడు నా మూడ్‌ ని బట్టి కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలుపుతాను. కానీ నువ్వుల నూనె నా జుట్టుకు చేసిన మేలు అంతా ఇంతా కాదు అద్భుతాలు చేసిందని చెప్పింది.

Forget Fancy Products Shruti Haasan Swears By This Humble Oil for Her Hair

ముఖ్యమైనది ఇదే
శ్రుతిహాసన్ తన జుట్టు కోసం పెద్ద కష్టమైన,కఠినమైన పద్ధతులేమీ పాటించట్లేదు. కేవలం శ్రద్ధ, క్రమం తప్పకపోవడమే ముఖ్యమని ఆమె చెబుతున్నారు. ప్రతిసారీ తలస్నానం చేసే ముందు తాను తప్పకుండా ఆయిల్ పెట్టుకుంటాననని.. రోజూ తలస్నానం చేయనని.. అలా చేయకూడదు కూడా అని ఆమె చెప్పారు. ఒకవేళ షూటింగ్ ఉందంటే ముందు రోజు రాత్రే తలకు ఆయిల్ పట్టించి రాత్రంతా అలాగే ఉంచుకుని ఉదయాన్నే కడిగేస్తానని తన సింపుల్ రొటీన్‌ ను ఈ బ్యూటీ పంచుకున్నారు.

ఇది కేవలం ఒక బ్యూటీ రొటీన్ మాత్రమే కాదు మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక సెల్ఫ్ కేర్ ప్రక్రియ అని శ్రుతిహాసన్ నవ్వుతూ చెప్పారు. ఈ నూనె నన్ను కాపాడుతుంది.. నిజం చెప్పాలంటే నూనెలే సర్వస్వం. అవే అన్నీ చూసుకుంటాయి అని ఆమె అన్నారు. ఖరీదైన బ్యూటీ ట్రీట్‌ మెంట్లు, ప్రొడక్టుల వాడకం విపరీతంగా పెరగుతున్న ఈ రోజుల్లో అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ చిట్కాను శ్రుతి పంచుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.

శ్రుతి హాసన్ రాబోయే చిత్రాలు
శృతిహాసన్ ప్రస్తుతం కోలీవుడ్ ఫేమస్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమాలో, హెచ్. వినోద్ దర్శకత్వంలో జన నాయగన్, మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగులో రాబోతున్న సలార్ పార్ట్ 2లో కూడా ప్రభాస్ సరసన నటిస్తోంది శృతిహాసన్.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, July 14, 2025, 11:52 [IST]
Desktop Bottom Promotion