Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.!
కొందరికి శరీరంలో తరచుగా వాపు ఏర్పడుతుంటుంది. దీన్ని కేవలం సాధారణ సమస్యగానే పరిగణిస్తుంటారు. అయితే దీన్ని తేలికగా తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కూడా కావచ్చని చెబుతున్నారు. శరీరంలో వాపునకు దారి తీసే ఆరోగ్య సమస్యలేంటి ఇక్కడ తెలుసుకుందాం..

శరీరంలో చేతులు, పాదాలు, చీలమండలు, ముఖం, వేళ్లు వంటి పలు భాగాల్లో వాపు రావడాన్ని చాలా మంది సాధారణ సమస్యగా భావిస్తుంటారు. గాయమైనప్పుడు, వాతావరణ మార్పులు, ఎక్కువ సేపు నిలబడటం, కూర్చోవడం వల్ల ఇది సంభవించే అవకాశం ఉంది. ఇది సాధారణ సమస్య. అయితే ఇది ఎక్కువ కాలం పాటు కొనసాగినా, మీకు ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు వాపు సమస్య ఉన్నా దనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అంతర్గతంగా ఏర్పడిన కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని అంటున్నారు.
పదేపదే శరీరంలో వాపు ఏర్పడితే దానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకుని సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యతో పాటు ఆయాసం, ఛాతీ నొప్పి, ఒక్కసారిగా బరువు పెరగడం, నొప్పి తీవ్రంగా ఉండటం వంటి లక్షణాలు మీరు అనుభవిస్తున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి కారణాలు తెలుసుకోవాలి.
గుండెకి ప్రమాదం
మన శరీరంలో గుండె శరీరమంతా రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేసినప్పుడు మాత్రమే జీవక్రియ మెరుగుపడుతుంది. ఇతర శరీర భాగాలు సక్రమంగా పనిచేస్తాయి. అయితే ఈ పంపింగ్ సరిగా జరగనప్పుడు కాళ్లు, చీలమండలు, పాదాల్లో ద్రవం పేరుకుపోయి వాపు ఏర్పడుతుంది. మరికొందరిలో ఆయాసం, అలసట, బరువు పెరగడం అనుభవిస్తారు. ఈ సమయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మూత్రపిండాల వ్యాధి
మనం తీసుకున్న ఆహారం, నీటిలో వ్యర్థాలను, అధిక ఉప్పు, అదనపు నీటి ద్వారా మూత్రపిండాలు తొలగిస్తాయి. మూత్రపిండాలు నిత్యం సమర్థవంతంగా పనిచేయాలి. లేదంటే శరీరంలో ద్రవాలు పేరుకుపోయి వాదాలు, చీలమండలు, చేతులు, ముఖం వాపునకు గురవుతాయి. దీర్ఘకాలికంగా మీరు ఈ సమస్యతో ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
కాలేయంపై ప్రభావం
శరీరంలో లివర్.. ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. అయితే లివర్ సిర్రోసిస్ సమస్య ఏర్పడినప్పుడు క్రమంగా ఆ అవయవం దెబ్బతింటుంది. దీంతో కాళ్లు, పొత్తికడుపులో వాపు ఏర్పడి కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది.
డీవీటీ
డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్.. ఇది శరీరంలో లోతైన సిరలు, కాలులో రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. దీని వల్ల ఆ భాగాల్లో అకస్మాత్తుగా వాపు ఏర్పడటం, నొప్పి, ఎర్రగా మారడం, వెచ్చదనం వంటివి ఏర్పడతాయి. దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించాలి.
సిరల బలహీనత
కాళ్లలోని సిరలు గుండెకి రక్తాన్ని తిరిగి సరిగా పంపింగ్ చేయలేనప్పుడు పాదాలు, చీలమండల్లో వాపు ఏర్పడుతుంది. బరువుగా అనిపిస్తుంటుంది. చర్మంలో మార్పులు ఏర్పడతాయి. నొప్పి అనుభవిస్తారు. దీంతో ఎక్కువసేపు కూడా నిలబడలేరు. ఈ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. సకాలంలో కారణాలను గుర్తించడం ద్వారా ట్రీట్‌మెంట్ సులభమవుతుంది.
సరైన జీవనశైలి
శరీరంలో వాపును నివారించడానికి కొన్ని ఆరోగ్య అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. ఎక్కువ సేపు నిలబడటం, కూర్చోవడం వంటివి చేయకుండా మధ్యమధ్యలో చిన్నపాటి నడకలు అలవాటు చేసుకోవాలి. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. పుష్కలంగా నీరు తాగడం, రెగ్యులర్‌గా వ్యాయామం, బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా వాపు నుంచి కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
