తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం!

రోజూ ఉదయాన్నే గుప్పెడు నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికీ తెలిసిందే. మెదడు చురుకుదనం నుంచి శారీరక దృఢత్వం వరకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మనం స్వీట్లలోనూ, రకరకాల వంటకాల్లోనూ విరివిగా వాడుతుంటాం. అయితే మనం రెగ్యులర్ గా వాడే బాదం పప్పులే కాకుండా, తీర ప్రాంతాలకు ఆనుకుని ఉండే ఎత్తైన ప్రదేశాల్లో పెరిగే అడవి బాదం ఒకటుందని మీకు తెలుసా?

అడవి బాదం ఎలా ఉంటుందంటే..
దీని ఆకారం మనం రోజూ చూసే బాదం కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. కొద్దిగా చదునుగా, అండాకారంలో ఉండి, ఎర్రటి లేదా ఊదా రంగు అంచులతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రతి కాయలో ఒకే ఒక గింజ ఉంటుంది. కాలానుగుణంగా ఈ చెట్టుకు అందమైన పూలు, పండ్లు వస్తుంటాయి.

From Headaches to Fever Amazing Health Benefits of Wild Almonds You Must Know

ఆయుర్వేదంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత

ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఆచార్య బాలకృష్ణ గారి ప్రకారం.. అడవి బాదం చెట్టు ఒక అద్భుతమైన ఔషధ గని. ఆయుర్వేద వైద్యంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. రుచికి కాస్త పులుపు, తీపి, వగరు కలగలిపి ఉండే ఈ కాయలు.. శరీరానికి చలువ చేయడమే కాకుండా, పిత్త దోషాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది ఒక వరం లాంటిది. ఈ చెట్టు ఆకులు, బెరడు, పచ్చి కాయలు.. ఇలా ప్రతి భాగం ఆరోగ్యానికి మేలు చేసేదే.

అడవి బాదంతో అద్భుతమైన లాభాలు

తలనొప్పికి చెక్

అడవి బాదం ఆకుల రసాన్ని తీసి, ఒకట్రెండు చుక్కలు ముక్కులో వేసుకోవడం లేదా కొద్దిగా తాగడం వల్ల తలనొప్పి ఇట్టే మాయమవుతుంది. అలాగే ఈ గింజలను ఆవనూనెతో కలిపి మెత్తగా నూరి తలకు పట్టిస్తే, తీవ్రమైన తలనొప్పి నుంచి కూడా తక్షణ ఉపశమనం దొరుకుతుంది.

ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!

విరేచనాలు, కడుపునొప్పి నివారణ

ఈ చెట్టు ఆకులు, బెరడులో టానిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి విరేచనాలను అరికట్టడంలో సహాయపడతాయి. కేవలం కడుపునొప్పితో బాధపడుతుంటే.. ఆకుల రసానికి కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలిపి 5 మిల్లీలీటర్ల మోతాదులో తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.

కీళ్ల నొప్పుల నుంచి విముక్తి

నొప్పులతో బాధపడేవారు అడవి బాదం ఆకులను మెత్తటి పేస్ట్ లా నూరి, కీళ్లపై లేపనంగా రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రాస్తుంటే కీళ్ల నొప్పుల బాధ తప్పుతుంది.

జ్వరానికి నేచురల్ మందు

జ్వరం వచ్చినప్పుడు ఇంట్లోనే నేచురల్ ట్రీట్మెంట్ కావాలనుకుంటే, అడవి బాదం కాండం బెరడుతో కషాయం కాచుకుని తాగవచ్చు. ఇది జ్వరం తీవ్రతను తగ్గించి, శరీరాన్ని త్వరగా కోలుకునేలా చేస్తుంది.

ఎలా వాడాలి? ఎవరిని సంప్రదించాలి?

ఆయుర్వేదం ప్రకారం అడవి బాదం చెట్టు బెరడు, ఆకులు, గింజలు, పండ్లు.. ఇలా ప్రతీది ఔషధమే. అయితే దీన్ని ఏదైనా అనారోగ్య సమస్యకు ఔషధంగా వాడే ముందు కచ్చితంగా అనుభవజ్ఞుడైన ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం బెటర్.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, September 16, 2026, 16:48 [IST]
Desktop Bottom Promotion