Latest Updates
-
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం!
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.!
భారత్‌లో ప్రతి యేటా ఫ్యాటీ లివర్ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. వయోజనుల్లో 39 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పటివరకూ సుమారు 12 కోట్ల మంది భారతీయులకు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందని అంచనా. ఈ క్రమంలో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి యేటా జూన్ రెండో గురువారం గ్లోబల్ ఫ్యాటీ లివర్ డేగా నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ 11న రావడంతో ఈ వ్యాధి నివారణపై ప్రజలకు కీలక విషయాలు వెల్లడిస్తున్నారు.

శరీరంలో జీవక్రియకు ప్రధాన కారణమైన లివర్ పనితీరు రోజురోజుకీ క్షీణించిపోతోందని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ వ్యాధి ప్రధానంగా ఆహారపు అలవాట్లతో ముడిపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి, కండరాలను పెంచుకునేందుకు ఎక్కువగా అధిక ప్రొటీన్ ఉన్న ఆహారంపై ప్రజలు ఆసక్తి చూపడంతో ఇది కాలేయ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. న్యూట్రియంట్స్ అయినా ప్రొటీన్ అయినా సమతుల్యత అవసరమని.. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉన్నవారు తాము రోజూ ఎంత ప్రొటీన్ తీసుకుంటున్నారో తప్పనిసరిగా సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.
ఫ్యాటీ లివర్ అంటే ఏంటి..
లివర్ సెల్స్‌లో అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోయిన సందర్భాల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి సంభవిస్తుందని హెపటాలజిస్ట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఫలితంగా కాలేయ పనితీరుపై ప్రభావం పడుతుంది. అయితే ఈ వ్యాధిలో రెండు రకాలు ఆల్కహాలిక్, నాన్- ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు ఉంటాయి. ఇది ఆందోళన చెందాల్సిన విషయంగా పేర్కొంటున్నారు. ఊబకాయం, డయాబెటిస్, జీవనశైలిలో మార్పులు, సమతుల్య ఆహారం లోపించడం ఇందుకు కారణాలు.
వయోజనులతో పాటు పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ వ్యాధి కేసులు పెరగడం బాధాకరం. ఎందుకంటే ఇటీవలి కాలంలో చిన్నారులు ఎక్కువగా ప్రాసెస్ చేసి ఆహారాలు తినడం, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, చిన్న వయసులోనే ఊబకాయం కారణంగా ఈ భయంకర వ్యాధి తలెత్తుతోంది. అంతేకాకుండా బరువు తగ్గాలనే తాపత్రయంలో సరైన డైట్ పాటించకుండా ఇష్టారీతిన ఆహార నియమాలను మార్చుకోవడం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.
సరైన డైట్ లోపిస్తోంది
ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ప్రొటీన్ ఆహారంపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఏదైనా సమతుల్య పద్ధతిలోనే తీసుకోవాలి. కానీ డైటీషియన్, వైద్యుల సలహా లేకుండానే తక్కువ కార్బొహైడ్రేట్లు ఉండేలా చూసుకుంటూ అధికంగా ప్రొటీన్ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ఫలితంగా కాలేయ ప్రమాదాలకు దారితీస్తోంది. బరువు తగ్గడంలో భాగంగా అధిక ప్రొటీన్ ఉండే చికెన్, గుడ్లు ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కూడా ఇందుకు కారణంగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే శరీర పరిస్థితి, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంత ప్రొటీన్ అవసరమో అంతే తీసుకోవాలని సూచిస్తున్నారు.

మెటబాలిజంపై ఒత్తిడి
కాలేయం ఆరోగ్యకరంగా ఉంటే ప్రొటీన్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటుందని హెపటాలజిస్ట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అయితే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ప్రొటీన్ తీసుకుంటే లివర్‌లో నైట్రోజన్ వ్యర్థాలు పేరుకుపోయి మెటబాలిజంపై ఒత్తిడి కలుగుతుంది. అప్పటికే లివర్ పనితీరు బలహీనమైతే జీవక్రియపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. కాగా, ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారు, డయాబెటిస్, ఒబెసిటీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు, వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఎక్కువ మొత్తంలో విటమిన్ సప్లిమెంట్స్, మందులు వాడుతున్న వారి ఆరోగ్యంపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
అయితే సరైన పద్ధతిలో సమతుల్య ప్రొటీన్ తీసుకుంటే ఈ సమస్య రాదని.. అధిక మొత్తంలో ప్రొటీన్, ఫైబర్ ఉన్న పదార్థాలు తక్కువ తీసుకోవడం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే స్ట్రీట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ప్రమాదం పెరుగుతుంది. అధిక ప్రొటీన్ తీసుకుంటే దానిని కాలేయం జీర్ణం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది.
లివర్ ఎఫెక్ట్ హెచ్చరిక సంకేతాలు
మీరు డైట్‌లో భాగంగా అధికంగా ప్రొటీన్ తీసుకుంటే కాలేయం ప్రభావితం అయితే అది శరీర జీవక్రియ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అందుకనుగుణంగా కొన్ని హెచ్చరిక సంకేతాలనూ పంపిస్తుంది. ఎప్పుడూ అలసటగా ఫీల్ అవ్వడం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, కొంచెం ఆహారం తిన్నా కడుపు ఉబ్బరంగా అనిపించడం, వికారంగా అనిపించడం లేదా జీర్ణక్రియ సమస్యలు, మూత్రం రంగు మారడం, కామెర్ల వ్యాధి వంటి వాటిని హెచ్చరికగా భావించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎంత ప్రొటీన్ తీసుకోవాలి..
హెపటాలజిస్టుల సలహా ప్రకారం.. శరీరానికి అవసరమైన మొత్తంలోనే ప్రొటీన్ తీసుకోవాలి. మీ శరీర బరువును బట్టి ప్రొటీన్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ప్రతి కిలోగ్రాము బాడీ వెయిట్‌కి సుమారు 0.8 నుంచి 1 గ్రాముల ప్రొటీన్ సరిపోతుంది. అయితే ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు వైద్యుల సలహా ప్రకారం ప్రొటీన్ మోతాదును 1.2 నుంచి 1.6 గ్రాములకు పెంచుకోవచ్చు. అంటే మీ బరువు సుమారుగా 50 కిలోలు ఉన్నట్లయితే మీకు 50 గ్రాముల ప్రొటీన్ అవసరం.
ఇదిలా ఉండగా.. అధిక ప్రొటీన్ కారణంగా మీ కాలేయం పనితీరు దెబ్బతిని, కొవ్వు చేరినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడేందుకు అతిగా సప్లిమెంట్స్ తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటి ప్రభావం జీవక్రియపై వేర్వేరుగా ఉండవచ్చని అంటున్నారు.
ఈ ఫుడ్స్‌తో ఫ్యాటీ లివర్ ముప్పు..
ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచే ఆహారపు పొరపాట్లు ఏంటనేవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అధిక ప్రొటీన్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు పేగులపై ఒత్తిడి పెంచి జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తాయి. కాలేయ పనితీరును నెమ్మదిస్తుంది. అతిగా ప్రాసెస్ చేసిన ప్రోటీన్ ఫుడ్ పేగు పొరను పాడుచేస్తాయి. ఫలితంగా దీర్ఘకాలికంగా జీర్ణక్రియపై ప్రభావం చూపి వాంతులు, విరేచనాలకు దారితీస్తాయి. చివరికి కాలేయంపై ఒత్తిడి పెంచుతుంది.
కార్బొహైడ్రేట్లు తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతారు అనే ఉద్దేశంతో కొందరు వాటిని తీసుకోవడమే మానేస్తారు. ఇది చాలా తప్పు. పిండి పదార్థాలను పూర్తిగా తగ్గించి ఎక్కువగా ప్రొటీన్‌పైనే ఆధారపడకూడదు. దీని వల్ల కాలేయం ఇబ్బంది పడుతుంది. చక్కెరతో చేసిన పానీయాలను కొందరు ప్రొటీన్‌తో కలిపి తీసుకుంటారు. ఇది ప్రమాదం. ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఆహారాన్ని పూర్తిగా విచ్ఛిన్నం అవుతుంది. ఫలితంగా వాటిలోని ఎంజైమ్‌లను కాలేయం స్వీకరించలేదు. ముఖ్యంగా రాత్రి పూట ఎక్కువ మొత్తంలో భోజనం చేయకూడదు. మితంగా తినాలి. లేదంటే కాలేయంపై నిశ్శబ్దంగా ఒత్తిడి పెరుగుతుంది.

హెల్తీ లివర్ కోసం చిట్కాలు
పరిమిత మొత్తంలో ప్రోటీన్‌ను ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకోవడం ద్వారా లివర్ పనితీరు మెరుగుపడుతుంది. మీ రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను సరైన మొత్తంలో చేర్చుకోవాలి. పప్పుళ్లు, చిక్కుడు గింజలు, విత్తనాలలో ప్రొటీన్ సమతుల్యంగా ఉంటుంది. వీటిని రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. అంతేకాకుండా శరీరానికి తగినంత నీటిని అందించాలి. ఇందుకోసం రోజూ కనీసం 3 లీటర్ల నీటిని తాగినట్లయితే కాలేయం మెరుగ్గా పనిచేస్తుంది.
ముగింపు
ఏ ఆహార పదార్థాలైనా భోజనంలో మితంగానే తీసుకోవాలి. పరిమితిని మించి తీసుకుంటే అది శరీరంలోని ప్రతి భాగం పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా శరీరంలో మిగతా భాగాల పనితీరు ప్రధానంగా కాలేయం ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే లివర్‌ను సంరక్షించుకోవాలి. ఒక్క ప్రొటీన్ విషయంలోనే కాకుండా మిగతా పోషకాల విషయంలోనూ సమతుల్యత పాటిస్తూ ఉండాలి. ప్రధానంగా ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications