Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
Tomato: ఎర్ర టమాటో-పచ్చ టమాటో..ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా!
ఏ సీజన్ లో అయినా మార్కెట్ లో మనకు లభించే కూరగాయ టమాటో మాత్రమే అని చెప్పవచ్చు. ధర తక్కువగా ఉండి,ఆరోగ్యానికి అనేకరకాలుగా మేలు టమాటోని భారతీయులు ఎక్కువగా తమ ఆహారంలో తీసుకుంటుంటారు. టమాటో చేసిన కూరలు,పచ్చళ్ల టేస్ట్ నోట్లో కొన్ని రోజులపాటు అలాగే ఉండిపోతుంది. సాధారణంగా మన ఇళ్లల్లో టమాటో అంటే ఎరుపు రంగులో ఉండేదే మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే మనం మార్కెట్ కి వెళ్లినప్పుడు అక్కడ ఆకుపచ్చ రంగు టమాటో కూడా కనబడుతుంది.
చాలామంది ఎరుపు రంగు టమాటో ఆరోగ్యానికి మంచిదా? ఆకుపచ్చ రంగు టమాటో ఆరోగ్యానికి మంచిదా? తరచుగా చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే ఏ టమాటో మన ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

ఏ టమాటో ఆరోగ్యానికి మంచింది
వాస్తవానికి ఎరుపు, పచ్చ రంగు టమాటోలు రెండూ ఆరోగ్యానికి ప్రయోజకరమైనవే. అయితే కొంచెం పోషక విలువలు విభిన్నంగా ఉంటాయి. నాణ్యత, ఆరోగ్య ప్రయోజనాలలో కొంత వైవిధ్యం ఉంది. ఆకుపచ్చ,ఎరుపు టమోటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉందని పోషకాహార నిపుణులు చెప్తారు. అయితే పచ్చి టమోటోలో అంటే ఆకుపచ్చ టమాటోలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శరీరంలో విటమిన్ సి లోపిస్తే మీరు ఆకుపచ్చ టమోటాలు తినడం మంచిదని చెప్తుంటారు. ఆకుపచ్చ టమోటాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇందులో ఐరన్,పొటాషియం, ఫాస్పరస్ ఉన్నాయి..ఇవి బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.
-ఎరుపు టొమాటోల్లో లైకోపీన్ ఉంటుంది..అందుకే ఇది ఎరుపు రంగును టమాటోకి ఇస్తుంది. లైకోపీన్ అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఆకుపచ్చ టొమాటోలలో ఉండవు.
-పండని ఆకుపచ్చ, పండిన ఎరుపు టమోటాలు రెండూ వాటి లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో మంచి పోషణ పొందడానికి మీరు మీ ఆహారంలో ఈ రెండు రకాల టమోటోలను తీసుకోవడం మంచిది.
చర్మానికి బెస్ట్
సాధారణంగా మనం డైలీ తీసుకునే ఫుడ్ లో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో సోడియం లెవల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. టమాటోలో ఈ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మనం రోజువారీ ఆహారంలో టమాటో చేర్చుకుంటే అది మన శరీరంలో సోడియం మొత్తాన్ని తగ్గించి రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలోని వ్యాధి క్రిములతో పోరాడటమే కాకుండా మన చర్మానికి కూడా మెరుపునిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
