Latest Updates
-
పెళ్లి తర్వాత జంటలకి ఎదురయ్యే సవాళ్లు.. ఎదుర్కొంటే ఆదర్శ దాంపత్యమే.! -
నిజమైన ప్రేమనా ? లేక ఎమోషనల్ అటాచ్మెంటా? ఈ ఒక్క ప్రశ్నతో తేలిపోతుంది! -
కేలరీలు తక్కువ, పోషకాలు పుష్కలం.. సలాడ్లో తప్పనిసరిగా ఉండే బ్రోకలీతో హెల్తీ వెరైటీలు.! -
ఒక్క ముక్కతో ఆగరు,అద్భుతం అంటే ఇదేనేమో..పచ్చిమిర్చి కోడివేపుడు చేసుకోండిలా -
హై బీపీ కంటే లో బీపీనే డేంజర్? ఇంట్లోనే రక్తపోటును నార్మల్ చేసే 5 హోమ్ రెమెడీస్! -
ఆఫీసు కుర్చీలతో ఆరోగ్య సమస్యలు.. గుండెతో పాటు వీటికి ఎనలేని రిస్క్.! -
ఇంట్లో కూరగాయలు లేవా? 2 ఉల్లిపాయలతో సూపర్ టేస్టీ పరాఠాలు..బ్రేక్ ఫాస్ట్, లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్ -
గల్లీలో పుట్టి.. నేడు రూ.75 వేల కోట్ల సామ్రాజ్యంగా..ఇది చిన్న యవ్వారం కాదుగా! -
పప్పు అంటే ముఖం తిప్పుకునే వారు కూడా.. లొట్టలేసుకుని తినే షాహీ మొఘలాయ్ పెసరపప్పు -
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి!
ఫ్యాటీ లివర్ ను ఇట్టే కరిగించే 3 అద్భుతమైన డ్రింక్స్.. హార్వర్డ్ డాక్టర్ సలహా!
చేసే పనితో సంబంధం లేకుండా అందరి లైఫ్ లు బిజీ అయిపోయాయి. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో కొత్త కొత్త రోగాలు చుట్టుముడుతున్నాయి. అందులో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఫ్యాటీ లివర్. ఒకప్పుడు ఇది కేవలం మందు తాగేవాళ్లకి మాత్రమే వస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. లివర్ లో మోతాదుకు మించి కొవ్వు పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే, కాలేయం వాపుకు గురై తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

కారణాలు ఏమిటి?
మందు తాగనివాళ్లలో మద్యం తాగని వారికి ఫ్యాటీ లివర్ రాడానికి ప్రధాన కారణం..జీవనశైలే. ఊబకాయం, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ఫ్యాటీ లివర్ కు అతిపెద్ద ముప్పు. అలాగే వ్యాయామం లేని నిశ్చల జీవనశైలి, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ ముప్పును రెట్టింపు చేస్తాయి.
నిపుణులు ఏమంటున్నారు?
కరెక్ట్ టైంలో ఈ సమస్యను గుర్తించి, మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే ఫ్యాటీ లివర్ ను ఈజీగా జయించవచ్చు. ఎయిమ్స్, హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్ వంటి ప్రఖ్యాత మెడికల్ యూనివర్శిటీల్లో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి..ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించే 3 డ్రింక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.
బీట్ రూట్ జ్యూస్
లివర్ ని శుభ్రపరిచే అద్భుతమైన గుణాలు బీట్ రూట్ లో ఉన్నాయి. ఇందులో నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో వాపును, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బీట్ రూట్ జ్యూస్ లో ఉండే బీటాలైన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాలను రక్షించి, కొవ్వు చేరకుండా చేస్తాయి. బాడీని డిటాక్స్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇందులో సహజంగానే చక్కెర ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ ను మితంగా తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు.
గ్రీన్ టీ
లివర్ హెల్త్ కి గ్రీన్ టీ దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా EGCG అనే కాటెచిన్స్ లివర్ లో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది లివర్ ఎంజైమ్ ల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ నియంత్రణలో ఉంటుంది.
కాఫీ
చాలామందికి పొద్దున్నే లేవగానే కప్పు కాఫీ గొంతులో పడితే కానీ రోజు స్టార్ట్ అవ్వదు. అయితే ఈ అలవాటు కాలేయ వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్ వంటి తీవ్రమైన లివర్ సమస్యలను అడ్డుకోవడంలో కాఫీ సహాయపడుతుందని డాక్టర్ సేథి వివరించారు. అయితే కాఫీలో తెల్ల చక్కెర వాడకూడదు. దానికి బదులుగా స్వచ్ఛమైన తేనె లేదా స్టీవియా వంటి నేచురల్ స్వీటెనర్లను ఉపయోగించడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications