Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఈ పండు ఒక సూపర్ ఫుడ్, ఇది తింటే వయసు పెరగదు, రోగాలు కూడా రావు.. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి!
బ్లూ బెర్రీస్ చాలా ఆరోగ్యకరమైన ఆహరం. దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తుంటారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజానాలు కలుగుతాయి. ఈ బెర్రీస్ రక్తపోటును తగ్గించడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం, శక్తిని పెంచడం వంటి ప్రయోజనాలను అందజేస్తుంది. బ్లూబెర్రీలో 13% ఫైబర్, 14% విటమిన్ C, 24% విటమిన్ K ఉంటుంది. వాటిలో 85% నీటి భాగం ఉంటుంది. ఒక కప్పు బ్లూబెర్రీలో 84 కేలరీలు, 21.5 గ్రాములు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ బ్లూబెర్రీల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చర్మ సౌందర్యానికి:
బ్లూబెర్రీలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చర్మంలో అకాల వృద్ధాప్యాన్ని తగ్గించే విధంగా పని చేస్తాయి. బ్లూబెర్రీలలో ఉండే విటమిన్ A, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మం పాడవకుండా, ఎక్కువ కాలం యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి. కొలాజన్ ఉత్పత్తి పెరిగే దిశగా కూడా ఇవి పనిచేస్తాయి.

జ్ఞాపకశక్తి మెరుగుపరచడం:
ప్రతిరోజూ బ్లూబెర్రీ పౌడర్ తీసుకోవడం వృద్ధుల్లో మెదడు ఆరోగ్యం బలపడేలా మేలు చేస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల మెదడు వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది. బ్లూబెర్రీలు ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షణ ఇవ్వడమే కాక, వృద్ధాప్యపు సూచనలను తగ్గిస్తాయి.
మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం:
బ్లూబెర్రీలలోని ఆంథోసైయనిన్‌లు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మృదువుగా ఉంచుతాయి. ఈ పదార్థాలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపు తగ్గించడంలో సహాయపడతాయి, ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
బ్లూబెర్రీలు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని తమ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. సమాచారం ప్రకారం, బ్లూబెర్రీలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. అవి మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
