Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
మహిళలు బాదాం తినాల్సిందే.. గర్భంలో శిశువు ఎదుగుదలకు చాలా అవసరం..!
ఆరోగ్యం విషయంలో మహిళలు ఎక్కువ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కొత్తరకాలు క్యాన్సర్ వ్యాధులు ఎక్కువగా మహిళలకు సంబంధించినవే వస్తున్నాయ్. క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకొని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. బాదాం, ఆంగ్లంలో ఆల్మోండ్స్ అంటాము. వీటి వల్ల చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంన్న విషయం తెలిసిందే. అయితే ఈ బాదాం వల్ల ఏవైనా ప్రతికూల పరిస్థితి ఎదురౌతుంది. డయాబెటీస్ ఉన్నవారు బాదాం తినవచ్చు, దీంట్లో కొలెస్ట్రాల్ స్థాయి ఎంత వుంటుంది అనే విషయాలను మనము తెలుసుకుందాం.
మహిళలను బాదాం నుంచి పోషకాలు మెండుగా అందుతాయ్. వారి రోజు వారి ఆహారంలో బాదాంను తప్పకుండా భాగం చేకుకోవాలి. దీంతో వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉంటాయ్.
ఆరోగ్యకరమైన గుండె
బాదాం వల్ల మహిళల గుండె పనీతీరు మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయ్. మంచి కొలిస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయ్. గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయ్. ప్రతీ రోజు ఐదు లేకపోతే ఆరు బాదాంలను తినే ప్రయత్నం చేస్తే గుండె గురించి చింతించాల్సిన అవసరం లేదు.
చర్మ ఆరోగ్యం
బాదాం తినడం వల్ల చర్మానికి అందాల్సిన పోషకాలు అందుతాయ్. చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు కూడా వత్తుగా అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యాల బారిన పడకుండా చేస్తుంది. బాదాంలో ప్రొటీన్లతో పాటు వైటమిన్ బి2, జింక్, ఐరన్ ఉంటాయ్.

యముకలు బలంగా
ఇంటి పనుల్లో బిజీగా ఉండే మహిళలు తమ యముకల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. యముకలు బలహీనంగా వుంటే ఆస్టియోపొరోసిస్ వ్యాధికి గురికావలసి వస్తుంది. రోజూ బాదాం తినడం వల్ల ఈ ఆస్టియోపొరోసిస్ నుంచి తప్పించుకోవచ్చు. బాదాంలో వుండే క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ యముకలను బలంగా చేస్తాయ్.
ఒత్తిడిని తగ్గిస్తుంది
మానసిక ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. బాదాంలో వుండే వైటమిన్ ఈ డ్యామేజ్ అయిన కణాలను బాగు చేస్తాయ్. రక్తంలోని చెక్కర స్థాయిలను కూడా అదుపు చేసే శక్తి బాదాంలో వుంది.
బరువు తగ్గడంలో సహాయం
బాదాంలో తక్కువ క్యాలరీలతో ఎక్కువ ప్రొటీన్లు వుంటాయ్. దీంతో శరీరానికి కావలసి పోషకాలు మెండుగా అందించి మరోవైపు బరువు పెరగకుండా చేస్తాయ్. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో భోజనంలో బాదాంను భాగంగా చేసుకుంటే వారు భోజనం తక్కువగా చేసినా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయ్. ఇక వారు పోషకాల గురించి చింతించాల్సిన అవసరం వుండదు.

కళ్లకు మంచిది
బాదాంలో ఎక్కువగా ఉండే వైటమిన్ ఈ కళ్లకు చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. కంటిపైనున్న పొరలు (లెన్స్) బాగా పనిచేయడంలో వైటమిన్ ఈ కీలకంగా వ్యవహరిస్తుంది. కాబట్టి బాదాం తింటే కళ్లు ఆరోగ్యంగా వుంటాయ్.
మెదడు చురుకుగా
మెదడు చురుకుగా పనిచేయాలంటే ఎలక్ట్రోలైట్లు చాలా అవసరం. బాదాంలో ఉండే పొటాషియం శరీరంలోని ఎలక్ట్రోలైట్లను పెంచి వాటికి ఊతం కల్పిస్తాయ్. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి కూడా దూరమౌతుంది.
గర్భిణీల ఆరోగ్యం
గర్భంలో ఉండే శిశువు ఆరోగ్యంగా పెరగడానికి ఫోలిక్ యాసిడ్ అవసరం పడుతుంది. బాదాంలో ఈ ఫోలిక్ యాసిడ్ మెండుగా వుంటుంది. గర్భిణిలు రోజూ బాదాం తినడం వల్ల అటు తల్లికి, ఇటు బిడ్డకు చాలా ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











