Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Donkey Milk Benefits: గాడిద పాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, తెలిస్తే వదిలిపెట్టరు
గాడిద పాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. అందుకే వీటికి విపరీతమైన ధర ఉంటుందని చెబుతుంటారు. గాడిద పాలల్లో ఉండే ఔషధ గుణాలు తల్లి పాలలో ఉండే ఔషధ గుణాలకు చాలా దగ్గరగా ఉంటాయట. అలాగే ఒక్కో గాడిద రోజుకు ఒకటీ రెండు లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇవ్వదని చెబుతారు. ఈ కారణాల వల్లే గాడిద పాలకు విపరీతమైన డిమాండ్, ధర ఉంటుంది అంటారు.
అసలు గాడిద పాలతో ఓనగూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి, అందులో నిజంగానే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లి పాలతో పోలి ఉండే గాడిద పాలు:
గాడిద పాలను ఫార్మాస్యూటికల్స్, సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పురాతన కాలంలో రుమాటిజం, దగ్గు, గాయాలకు చికిత్సగా వాడేవారు. గాడిద పాలలో యాంటీమైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆఫ్రికాతో పాటు భారత్ లో గాడిద పాలను దగ్గుకు, ఇతర వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు.
ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు, ఒంటెలు వంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే.. గాడిద పాలు తల్లి పాలను పోలి ఉంటాయి. అందుకే 19వ శతాబ్దంలో అనాథ శిశువులకు తల్లి పాలకు బదులు గాడిద పాలు ఇచ్చేవారని హెల్త్‌లైన్.కామ్‌లో ప్రచురించబడిన కథనం పేర్కొంది.
శక్తిని ఇస్తాయి:
గాడిద పాలలో లాక్టోస్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ శక్తి వనరు. వేసవిలో గాడిద పాలు తాగితే తక్షణ శక్తి వస్తుంది. ఇది అథ్లెట్లకు లేదా శారీరక శ్రమలో నిమగ్నమయ్యే వారికి కూడా మంచి డ్రింక్ అవుతుంది.
పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు:
గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ A, B1, B2, B6, C, D, E సమృద్ధిగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు తాగితే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
గాడిద పాలు సులభంగా జీర్ణమవుతాయి. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు గట్ మైక్రోబయోమ్ ను నిర్వహించడానికి సహాయపడతాయి. ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మంచి ఎంపిక అవుతుంది.
స్కిన్ ఇరిటేషన్‌ను తగ్గిస్తుంది:
గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మపు చికాకును తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించే విటమిన్-ఇ గాడిద పాలలో సమృద్ధిగా ఉంటుంది. గాడిద పాలు తగ్గడం వల్ల చర్మ ముడతలు తగ్గుతాయి.
గాడిద పాల వినియోగం అనగానే, మనకు గుర్తొచ్చే చరిత్ర, ఈజిఫ్ట్ మహారాణి క్లియోపాత్రా. ఆవిడ ప్రతి రోజూ గాడిద పాలతోనే స్నానం చేసేదని చెబుతారు. క్రమంగా ప్రపంచ సుందరిగా కీర్తించబడిందని నమ్మకం. ఇటువంటి కారణాలచేతనే గాడిద పాలతో సబ్బులు అనగానే, సౌందర్యారాధకుల కళ్ళు దీనిమీద పడ్డాయని చెప్పవచ్చు. పైగా శాస్త్రీయంగా గాడిద పాలలో చర్మ సౌందర్యానికి ఉపయోగపడగల నిక్షేపాలు కూడా ఉన్నాయని నిరూపించబడింది. క్రమంగా ఈ సబ్బులు సూపర్ హిట్ అయ్యాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
