Latest Updates
-
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది!
ఈ ఆకులు తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్..గుండె జబ్బులకి చెక్,చర్మంపై ముడతలు మాయం
ముల్లంగి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ముల్లంగి మాత్రమే దాని ఆకులు మరిన్ని ప్రయోజనాలకు మన శరీరానికి అందిస్తుందని మీకు తెలుసా? శీతాకాలంలో ముల్లంగి ఆకులను తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. విటమిన్లు ఎ, సి, కె, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి.
బరువు తగ్గడం నుంచి రక్తహీనత సమస్యల వరకు చర్మ పునరుజ్జీవనానికి కూడా ముల్లంగి ఆకులు సహాయపడతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

జలుబు,ఫ్లూకి చెక్
ముల్లంగి ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి. అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి, కాలానుగుణ జలుబు,ఫ్లూ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
కిడ్నీలో రాళ్లు
ముల్లంగి ఆకులు సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తాయి. మూత్రపిండాల నుండి అదనపు నీరు, టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి సహాయపడతాయి. ముల్లంగి ఆకులతో చేసే జ్యూస్ తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్ ఏర్పడకుండా నివారిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో నీటి వినియోగం తక్కువగా ఉన్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
బరువు తగ్గడం
ముల్లంగి ఆకులు జీవక్రియ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా 100 గ్రాముల ముల్లంగి ఆకులో 13 కేలరీలు ఉంటాయి. చక్కెర స్థాయి 1.2 గ్రాములు, ఫైబర్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు ముల్లంగి ఆకుకూరలను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
రక్తహీనత
ముల్లంగి ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తహీనతతో బాధపడేవారికి ముల్లంగి ఆకులు మేలు చేస్తాయి.
వ్యాధి నివారణ
ముల్లంగి ఆకులో మల్లంగి కంటే ఎక్కువ విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. శరీరానికి సాధారణ వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది.
చర్మ ఆరోగ్యం
ముల్లంగి ఆకుల్లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది వయస్సుతో పాటు చర్మం కుంగిపోయే ధోరణిని తగ్గిస్తుంది. ముల్లంగి ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ముడతలు తగ్గి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ముల్లంగి
ముల్లంగి ఆకులలో కాల్షియం, పొటాషియం, విటమిన్ K ఉన్నాయి, ఇవి ఎముక సాంద్రతను నిర్వహించడానికి, బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక వ్యాధులను నివారించడానికి అవసరమైనవి. వీటిని వింటర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎముకల బలహీనత తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం
ముల్లంగి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి దూరంగా ఉంచుతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగితే, గుండె జబ్బులతో సహా వివిధ వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. అంతే కాకుండా మల్లంగి ఆకుల్లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ముల్లంగి ఆకుల్లో ఉండే విటమిన్ సి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్త ప్రసరణకు వివిధ అడ్డంకులను తొలగిస్తుంది. గుండె సమస్యలను కూడా దూరం చేస్తుంది.
కంటి చూపు
ముల్లంగి ఆకులలో విటమిన్ ఏ మొత్తం శరీరానికి రోజువారీ అవసరంలో 52 శాతం ఉంటుంది. విటమిన్ ఏ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు కంటి చూపును కాపాడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications