Latest Updates
-
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ..
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం!
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం(అక్టోబర్ 8,2026) మరణించిన విషయం తెలిసిందే. గోవాలోని తన ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనని హాస్పిటల్ కు తీసుకెళ్లగా..డాక్టర్లు దాదాపు 45 నిమిషాలు సీపీఆర్ చేసి బతికించడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన కార్డియాక్ అరెస్ట్ గురవ్వడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ సంఘటన తర్వాత చాలామందికి ఒక పెద్ద సందేహం తలెత్తింది. గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ రెండు ఒకటేనా? అని. సాధారణ పరిభాషలో చాలామంది ఈ రెండింటినీ ఒకేలా చూస్తారు. ఈ రెండూ గుండెకు సంబంధించిన ప్రాణాంతక సమస్యలే అయినప్పటికీ, వాటి మధ్య ప్రాణాలను నిలిపేంత పెద్ద వ్యత్యాసం ఉంది. గుండెపోటు వస్తే రోగిని కాపాడుకోవడానికి డాక్టర్లకు కనీసం కొంత సమయం దొరుకుతుంది. కానీ కార్డియాక్ అరెస్ట్ లో ఆ సమయం కూడా లభించదు. నానా పటేకర్ విషయంలో జరిగింది కూడా ఇదే.

కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? ముప్పు ఎందుకు ఎక్కువ?
దీనిని అర్థమయ్యేలా చెప్పాలంటే.. గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోవడం. గుండెలోని విద్యుత్ వ్యవస్థలో లోపం తలెత్తినప్పుడు ఇలా జరుగుతుంది. దీనివల్ల గుండె రక్తాన్ని పంప్ చేయడం పూర్తిగా ఆపేస్తుంది. తద్వారా శరీరమంతటికీ, ముఖ్యంగా మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల రోగికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురై, క్షణాల్లోనే స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లిపోతాడు.
ఈ స్థితిలో గుండె పూర్తిగా కొట్టుకోవడం ఆగిపోతుంది కాబట్టి సమయం గడిచేకొద్దీ ప్రాణాలు దక్కే అవకాశాలు శూన్యం అవుతాయి. పదేపదే గుండెపోటులు రావడం, హృదయ స్పందనలో క్రమరాహిత్యం (Irregular heartbeat), కొన్ని రకాల మందుల అధిక మోతాదు వాడకం, అలాగే జన్యుపరమైన కారణాల వల్ల కార్డియాక్ అరెస్ట్ వస్తుంది.

హార్ట్ ఎటాక్(గుండెపోటు) అంటే ఏమిటి?
కార్డియాక్ అరెస్ట్ లాగా ఇందులో గుండె పూర్తిగా ఆగిపోదు. గుండెపోటు అనేది రక్త ప్రసరణకు సంబంధించిన సమస్య. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి బ్లాక్స్ ఏర్పడతాయి. దీనివల్ల గుండెకు రక్త ప్రవాహం ఆగిపోయి, కండరాల సంకోచ వ్యాకోచాలలో సమస్య ఏర్పడుతుంది. రక్త సరఫరా లేక గుండె కండరాలు దెబ్బతింటాయి. తద్వారా గుండె కొట్టుకోవడం అస్తవ్యస్తంగా మారుతుంది.
ఇలాంటప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడం, ఆయాసం, విపరీతమైన చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల రోగి స్పృహ కోల్పోవచ్చు. అయితే ఇక్కడ గుండె పూర్తిగా పనికిరాకుండా పోదు, దాని పనితీరు మాత్రమే మందగిస్తుంది. కాబట్టి రోగిని వెంటనే హాస్పిటల్ కి చేరిస్తే ప్రాణాలతో కాపాడటం సాధ్యమవుతుంది.
శరీరం ఇచ్చే హెచ్చరికలు
గుండెపోటు అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు. ఇది జరగడానికి దాదాపు నెల రోజుల ముందు నుంచే మన శరీరం కొన్ని హెచ్చరికలు పంపుతుంది. ఛాతీపై ఎవరో గట్టిగా నొక్కుతున్నట్లు నొప్పి రావడం, ఎడమ చేయి లేదా దవడ లాగడం, ఎటువంటి కారణం లేకుండానే విపరీతమైన అలసట, అకస్మాత్తుగా వాంతులు కావడం వంటివి గుండెపోటుకు ముందస్తు సంకేతాలు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
