Latest Updates
-
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్‌ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.?
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో గుండెపోటు లేదా హార్ట్ ఎటాక్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ భయపెడుతున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య. చాలా మంది ఏమనుకుంటారంటే.. గుండెపోటు అనేది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా దాడి చేస్తుందని. ఇటీవల కాలంలో అప్పటివరకు మంచిగా ఉండి సడెన్ గా కుప్పకూలి చనిపోయిన ఘటనలు అనేకం చూశాం.

కానీ వైద్య నిపుణులు చెబుతున్న వాస్తవం మరొకటి ఉంది. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. దానికి ఏదైనా ముప్పు వాటిల్లే ముందు కచ్చితంగా మనకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది.హార్ట్ ఎటాక్స్ సడెన్ గా రావు.. అవి వచ్చే కనీసం 10 రోజుల ముందు నుంచే మన బాడీ కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుందని డాక్టర్ మనోజ్ణ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు.
దురదృష్టవశాత్తూ వాటిని మనం సాధారణమైన అసిడిటీ, గ్యాస్ లేదా పని ఒత్తిడి వల్ల వచ్చిన సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటాం. ప్రాణాలను కాపాడుకోవాలంటే ఈ కింది ముందస్తు లక్షణాలను కచ్చితంగా గుర్తించాలి.
ఛాతీలో అసౌకర్యం లేదా భరించలేని నొప్పి
ఇది గుండెపోటుకు అత్యంత ప్రధానమైన లక్షణం. ఛాతీ మధ్యలో ఏదో పెద్ద బరువు పెట్టినట్లుగా, ఎవరైనా గట్టిగా పట్టి నొక్కుతున్నట్లుగా (టైట్ గా) లేదా డిస్కంఫర్ట్ ఫీలింగ్ కలుగుతుంది.
ఇతర భాగాలకు పాకే నొప్పి
ఛాతీలో మొదలైన నొప్పి కేవలం అక్కడే ఆగిపోదు. అది మెల్లగా ఎడమ భుజం వైపు, వీపు భాగం, లేదా కొన్నిసార్లు మెడ, దవడ కింది వైపునకు లాగినట్లుగా రేడియేట్ అవుతున్నట్లు అనిపిస్తుంది.
తీవ్రమైన అలసట, ఊపిరి ఆడకపోవడం
ఏ చిన్న పని చేసినా, రెండు మెట్లు ఎక్కినా విపరీతంగా అలిసిపోతుంటారు. గుండెకు రక్తప్రసరణ సరిగ్గా జరగనప్పుడు ఊపిరితిత్తులకు కూడా ఆక్సిజన్ అందక ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా మారుతుంది.
చల్లటి చెమటలు పట్టడం
బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నా లేదా ఏసీ గదిలో కూర్చున్నా కూడా.. కారణం లేకుండానే విపరీతంగా చెమటలు పడుతుంటాయి. చేతులు, కాళ్లు ఒక్కసారిగా చల్లబడిపోవడం ముందస్తు ప్రమాదానికి సూచిక.
తలతిరగడం, స్పృహ తప్పుతున్న భావన
మెదడుకు వెళ్లే రక్త సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్ల తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ముఖం విసిరేసినట్లుగా విపరీతమైన నీరసం ఆవహిస్తుంది.
గుండె దడ, ఆందోళన
మీ గుండె చప్పుడు మీకే చాలా గట్టిగా వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. గుండె అతి వేగంగా కొట్టుకోవడం, తెలియని భయం, ఆందోళన వంటి లక్షణాలు తీవ్రంగా కనిపిస్తాయి.
తక్షణమే ఏం చేయాలి?
పైన చెప్పిన లక్షణాల్లో మీకు ఏవైనా కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకండి. ఇది కేవలం గ్యాస్ నొప్పేమో, తగ్గిపోతుందిలే అని సొంత వైద్యాలు చేసుకుంటూ కూర్చోవద్దు. ఏమాత్రం అనుమానం వచ్చినా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని హాస్పిటల్ వెళ్లాలి. బేసిక్ చెకప్స్ అయిన ఈసీజీ (ECG), రక్తపోటు (బీపీ), బ్లడ్ షుగర్ తదితర పరీక్షలు చేయించుకుని డాక్టర్ ను లేదా కార్డియాలజిస్ట్‌ను కలవాలి. హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టగలిగితే, సరైన చికిత్స ద్వారా విలువైన ప్రాణాలను నూటికి నూరు శాతం సులువుగా కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications