Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
గుండెపోటు తర్వాత....పుంజుకోవాలంటే...!

గుండె చివరి శ్వాస వరకు నిరంతరం శ్రమించే కండరం. దీనికి ఇతర కండరాల వలె ఆక్సిజన్ అధికంగా వుండే రక్తం కావాలి. ఏ కారణంచేత రక్త సరఫరా ఆగినా గుండెపోటు వస్తుంది. కారణాలు అనారోగ్య ఆహారం మొదలు అధిక స్మోకింగ్ లేదా లిక్కర్ కూడా కావచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చినా, జీవన విధానం సరిచేసుకుంటే ఆనందంగా మరోమారు గడపవచ్చంటున్నారు గుండెనిపుణులు. జీవన విధానంలో వ్యాయామం, తాజా సహజ ఆహారాలు చేర్చి ఆరోగ్య నియమాలు పాటిస్తే రెండవసారి గుండెపోటు కూడా రాదని తెలియజేస్తున్నారు.
ఆహారంలో మార్పులు - చెడు కొల్లెస్టరాల్ లేని ఆహారం తినాలి. కొవ్వు తక్కువ, కార్బోహైడ్రేట్లు తక్కువ గల ఆహారాలు తినాలి.
వ్యాయామం - గుండెపోటు నుండి కోలుకోటానికి కనీసం అయిదు లేదా ఆరు వారాలు పడుతుంది. పోటు తర్వాత మీ కదలికలు మెల్లగా పెంచాలి. నడక, గార్డెనింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, సైకిలింగ్ వంటివి శ్వాస వ్యవస్ధను మెరుగుపరుస్తాయి. గుండెకు చేరే రక్తంలో ఆక్సిజన్ అధికమవుతుంది. ప్రతిరోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి.
ఒత్తిడి - ఒత్తిడి అధికమవటం, కోపం అధికం కావటం రెండవ హార్ట్ ఎటాక్ తెప్పిస్తాయి.
డైరీ వ్రాయండి - ఒత్తిడి కలిగించే సంఘటనలు వ్రాయండి. అవి మరల రిపీట్ కాకుండా చూసుకోండి. ట్రాఫిక్ జామ్ వంటివి కోపాన్ని కలిగిస్తే, ఆ సమయంలో చక్కటి మ్యూజిక్ విని రిలీఫ్ పొందండి. పాజిటివ్ గా వ్యవహరించండి. రిలాక్స్ అవండి, యోగా లేదా మసాజ్ ధిరపీ వంటివి ఆచరించండి. ప్రతిరోజూ హాయిగా అవసరమైన ఎనిమిదిగంటల నిద్ర తప్పనిసరిగా పొందాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications