Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
చికెన్ తింటే....గుండె పనితీరు ఎక్స్ లెంట్!

న్యూయార్క్ యూనివర్శిటీ లాంగోన్ మెడికల్ సెంటర్ లోని పరిశోధకులు కోడిమాంసం అంటే చికెన్ పై నిరంతర పరిశోధనలు చేశారు. చివరకు గుండె వ్యాధులైన కరోనరీ హార్ట్ డిసీజ్ నుండి రక్షణ పొందాలంటే కోడి మాంసం లోని పోషకాలు అద్భుతంగా పని చేస్తాయని కనిపెట్టారు. ఈ పరిశోధనా అంశాన్ని యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రచురించింది. కోడి మాంసంలో ఎంతో ప్యూర్ విటమిన్లు వున్నాయని, అంతేకాదు టర్కీ కోడిలోకూడా అమోఘమైన పోషాలున్నాయని వీటిలోని పోషకాలు చేప, షెల్ ఫిష్ వంటి వాటికంటే కూడా బలవర్ధకమైనవని తేల్చారు.
అధిక కొల్లెస్టరాల్ స్ధాయి వున్న యువతులు కోడి మాంసాన్ని నిరంతరంగా తింటూ వుంటే వారి రక్తంలోని కొల్లెస్టరాల్ స్ధాయి ఆశించిన దానికంటే కూడా బాగా తగ్గిందట. అయితే, తక్కువ కొల్లెస్టరాల్ వున్న వారికి మాత్రం వీటి ప్రభావం లేదన్నారు. అయితే, ఈ కోడి మాంసం ప్రభావం యువకులకంటే కూడా యువతులపై అధికంగా వుందని న్యూయార్క్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ డ్రగ్స్ నుండి రీసెర్చర్ యూ కెన్ తెలిపారు.
కరోనరీ గుండె జబ్బును కరోనరీ ఆర్టరీ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడి గుండెకు పోయే రక్తాన్ని నిలుపుతుంది. ఈ వ్యాధి సరైన ఆహారాలు తినకపోతే మరింత వేగంగా విస్తరిస్తుంది. రీసెర్చర్లు తమ పరిశోధనను షుమారు 14,000 మంది మహిళలపై చేశారు. వీరి వయసులు 34 నుండి 65 సంవత్సరాలవరకు వున్నాయి. పరిశోధనలు సుమారుగా 1985 నుండి 1991 వరకు న్యూయార్క్ సిటీ లోని బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్ లో సాగాయి.
ఈ రీసెర్చిలో పరిశోధకులు కొల్లెస్టరాలు అధికంగా వున్న యువతులకు మాత్రమే కోడి ఉత్పత్తులను ఇచ్చారు. వారిలో షుమారు 60 శాతం వరకు ప్రయోజనాలను పొందినట్లు తెలిపారు. వివిధ రకాలుగా చేస్తున్న తమ పరిశోధనలు నిర్ధారించబడితే అధిక కొలెస్టరాల్ వున్న వ్యక్తులు ఇకపై కోడి మాంసాన్ని నిరాటంకంగా తినేయవచ్చని పరిశోధకుడు యూ కెన్ వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
