Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.!
ప్రస్తుత కాలంలో యువతను తుంటికి సంబంధించిన సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే ఈ సమస్య ఉండగా వారికి తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు 30 నుంచి 40 ఏళ్ల వయసు మధ్యవారిలోనే ఈ సమస్యకు సంబంధించిన కేసులు నమోదవతున్నాయి. అసలు ఎందుకు ఈ సమస్య తీవ్రమవుతుంది.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

కొవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను తీవ్రంగా వణికించింది. కరోనా బారి నుంచి బయటపడేందుకు దాదాపు 15 రోజులపైనే వెంటిలేటర్, ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందేవారు. ఆ సమయంలో తీసుకున్న స్టెరాయిడ్స్ వ్యాధి నుంచి బయటపడేసినా.. వాటి దుష్ప్రభావాలు ఇప్పుడు బయటపడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా యువతలో తుంటి శస్త్రచికిత్సలు 40 శాతం పెరిగాయని వెల్లడించారు. హిప్ ఆర్థరైటిస్, అవస్కులర్ నెక్రోసిస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధులుగా పరిగణించిన తుంటి సమస్యలు ఇప్పుడు యువతకి రావడం బాధాకరమని అంటున్నారు.
కారణాలేంటి..
తుంటి నొప్పి సమస్యలకు పలు కారణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తుంటి ఎముకలో రక్త ప్రసరణ సరిగా జరగనట్లయితే కణజాలం నశించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనినే అవస్కులర్ నెక్రోసిస్ అని పిలుస్తారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అని వెల్లడించారు. కొవిడ్ కాలం తర్వాత తుంటి కీళ్ల సమస్యలు విపరీతంగా పెరిగి.. దేశవ్యాప్తంగా టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీలకు డిమాండ్ పెరిగిందని వివరించారు.
నిర్ధారణలో జాప్యం
చాలా మంది తుంటి నొప్పి సమస్యను త్వరగా గుర్తించకపోవడం ఈ సమస్య తీవ్రతకు కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి నిర్ధారణలో జాప్యం కారణంగా తుంటి కీలు పూర్తిగా దెబ్బ తిని కదలలేని పరిస్థితికి తీసుకువస్తుంది. తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి పూర్తి హిప్ సర్జరీ అవసరమని చెబుతున్నారు.
కొవిడ్ మహమ్మారి సమయంలో కొంతమంది రోగులు స్టెరాయిడ్లను అధికంగా లేదా దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల ఆస్టియోనెక్రోసిస్ తీవ్రత పెరిగి తుంటి కీలులో మార్పులకు దారితీసిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా తుంటి నొప్పి, తొడ ఎముక పై భాగం దెబ్బతినడం, తీవ్రమైన ఆర్థరైటిస్‌తో యువత బాధపడుతున్నారని వెల్లడించారు. వీలైనంత త్వరగా సర్జరీ నిర్వహిస్తేనే ఈ సమస్యకు పరిష్కారమని తెలిపారు. ముందుగా వ్యాధిని నిర్ధారించినట్లయితే ఆరంభంలోని కోలుకోవచ్చని స్పష్టం చేశారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
