మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్‌ ఆయిల్‌.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.!

నేటి కాలం పొల్యూషన్‌ నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు చాలా కేరింగ్‌ తీసుకుంటారు. అందుకే తరచుగా బ్యూటీపార్లర్‌కి వెళ్లడం, లేదంటే ఇంట్లోనే స్కిన్‌ కేర్‌ కోసం చాలా ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే బయట కెమికల్స్‌ ఉన్న ప్రొడక్ట్స్‌తో కంటే హోం మేడ్‌ చిట్కాలు చర్మ సంరక్షణకి మేలు చేస్తాయి. ఈ క్రమంలో ముఖం మెరిసేందుకు న్యాచురల్ ఆయిల్‌ తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Home made face oil with cold pressed sesame oil and saffron for glowing skin

దుమ్ము, ధూళి కాలుష్యం, సూర్యుని వేడి కారణంగా చర్మం కందిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ముఖం రంగు మారడం, రంధ్రాల్లో దుుమ్ము చేరి మొటిమలు రావడం, పొడిబారడం, లేదంటూ మరీ ఎక్కువగా జిడ్డు కావడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా చాలా రకాల సమస్యలతో ముఖం నిగారింపును కోల్పోయి కళా విహీనంగా మారుతుంది. అయితే ముఖం నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా ఆకర్షణీయంగా, మెరిసేలా ఉండటం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసంలో తొణికిసలాడుతుంది.

ఇక, వర్షాకాలంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ముఖంపై దుమ్ము చేరడంతో పాటు తేమ కారణంగా కాంతివిహీనంగా మారి చిరాకును, ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక సూర్యుని నుంచి యూవీ కిరణాల కారణంగా త్వరగా టాన్‌ అవుతుంది. ఇందుకు ఫేస్‌ ఆయిల్‌తో పరిష్కారం ఉంది. అయితే చాలా మంది ముఖానికి ఆయిల్‌ రాస్తే మంచిది కాదు అని భావిస్తుంటారు. కానీ మార్కెట్‌లో దొరికే చాలా బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఆయిల్‌తోనే తయారవుతాయని బ్యూటీషియన్‌ నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ముఖానికి ఆయిల్‌ రాయడం ద్వారా చర్మ పోషణ మెరుగవుతుందని సూచిస్తున్నారు. ఈ క్రమంలో చాలా తక్కువ ధరలో ఇంట్లోనే సహజంగా ఫేస్‌ ఆయిల్‌ ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూద్దాం.

Home made face oil with cold pressed sesame oil and saffron for glowing skin

ఇంట్లోనే న్యాచురల్‌ ఫేస్‌ ఆయిల్‌

ముందుగా ఓ గిన్నెలో నీళ్లు పోసుకుని వేడి చేయాలి. ఆ నీళ్ల గిన్నెపైన మరో గిన్నె పెట్టి ఒక కప్పు కోల్ట్‌ ప్రెస్‌డ్‌ నువ్వుల నూనె పోసుకోవాలి. కొంచెం వేడయ్యాక కొద్దిగా కుంకుమపువ్వుని వేసి ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి. మంచి సువాసన వస్తూ మరిగిన తర్వాత ఇప్పుడు ఆ నూనెను చిన్న బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో ఒక విటమిన్‌ క్యాప్సూల్‌ను పిండుకోవాలి. తర్వాత మొత్తం కలిసేలా ఓసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే ఇంట్లోనే న్యాచురల్‌ ఫేస్‌ ఆయిల్‌ రెడీ..

ఈ ఫేస్‌ ఆయిల్‌ను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా వేడి చేయాలి. కొన్ని చుక్కలను తీసుకుని చేతితో సున్నితంగా ముఖమంతా మర్దన చేసుకోవాలి. కళ్ల కింద వలయాల్లో, నుదురు ఇలా అన్ని భాగాల్లోనూ ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా డార్క్‌ సర్కిల్స్‌ కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. కళ్లకి అలసట తగ్గుతుంది. కొన్ని రోజుల్లోనే మీ ముఖం ప్రకాశవంతంగా మారి ఆ ఫలితాన్ని ఆస్వాదిస్తారు. మిగతా నూనెలతో పోలిస్తే ముఖ సౌందర్యానికి నువ్వుల నూనె చాలా మేలు చేస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, June 22, 2026, 18:27 [IST]
Desktop Bottom Promotion