Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
మగాళ్లను వేధించే ఆ సమస్యకు ఇదే బెస్ట్ ఆయిల్!
భారతీయ వంటగదుల్లో ఏది ఉన్నా లేకున్నా వెల్లుల్లి తప్పకుండా ఉంటుంది. ఇది పేదవాడి అమృతంగా చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇది కేవలం వంటల రుచిని పెంచడానికి మాత్రమే పరిమితం కాదు..దీని ప్రయోజనాలకు అంతకుమించి అన్నట్లుగా ఉంటుంది. దీని అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే దీన్ని ఎవ్వరూ మూలన పెట్టరు..తెచ్చి బీరువాలో పెట్టుకుంటారు. అంత అమూల్యమైనది ఇది.
ఘాటైన వాసన, కారంగా ఉండే వెల్లుల్లి రెబ్బలలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నప్పటికీ ముఖ్యంగా వెల్లుల్లితో తయారుచేసిన ఆయిల్ శతాబ్దాలుగా ఎన్నో రకాల నొప్పులకు సహజసిద్ధమైన నివారిణిగా ఉపయోగపడుతోంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందుల కోసం పరుగులు తీయకుండా ఈ సహజసిద్ధమైన హోమ్ రెమెడీని ప్రయత్నించి దాని ప్రయోజనాలను పొందవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ వెల్లుల్లి నూనె ప్రయోజనాలు, దానిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

వెల్లుల్లి ఆయిల్ తయారీ విధానం
-స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అర కప్పు ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె వేసి వేడి చేసి ఇందులో 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేయాలి .
-వెల్లుల్లి రంగు బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించి స్టవ్ ఆపేయండి. వెల్లుల్లి మాడిపోకుండా చూసుకోవాలి.
-నూనె పూర్తిగా చల్లారిన తర్వాత దానిని వడగట్టి ఒక గాజు సీసాలో పోసి స్టోర్ చేసుకోండి.
వెల్లుల్లి ఆయిల్ తో ప్రయోజనాలు
కీళ్ల నొప్పులకు దివ్యౌషధం
వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు వేధించడం సహజం. ముఖ్యంగా చాలా మంది పురుషులు వయస్సు పెరిగే కొద్దీ మోకాళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతుండటం మన ఇళ్లల్లో చూస్తుంటాం. కొందరు ఆడవాళ్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మెడ, వీపు, మోకాళ్లు, చేతులు ఇలా శరీరంలోని ఏ భాగంలో నొప్పి ఉన్నా గోరువెచ్చని వెల్లుల్లి నూనెతో మృదువుగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.
శరీరానికి వెచ్చదనం
వెల్లుల్లికి సహజంగానే శరీరాన్ని వెచ్చబరిచే గుణం ఉంటుంది. జలుబుకు ఇప్పటిదాకా ఏ మెడిసిన్ ని కనిపెట్టలేకపోయారు అయితే వెల్లుల్లి ఆయిల్ దీనికి ఓ సంజీవనిలా పనిచేస్తుందని చెప్పవచ్చు. వాతావరణం మారినప్పుడు లేదా చలికాలంలో జలుబు చేసినట్లు అనిపిస్తే ఈ నూనెను ఛాతీపై, పాదాలపై రాసి మర్దన చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం అంది జలుబు ప్రభావం నుండి బయటపడవచ్చు.
చుండ్రు సమస్యకు శాశ్వత పరిష్కారం
జుట్టులో చుండ్రు సమస్య చాలా మందికి తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. చుండ్రు కారణంగా నలుగురిలోకి వెళ్లి నిలబడాలంటేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. చుండ్రు సమస్యకు వెల్లుల్లి నూనె ఒక చక్కటి పరిష్కారం. ఈ నూనెను తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును కలిగించే ఫంగస్ ను నాశనం చేసి, కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఎలా ఉపయోగించాలి?
నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి రోజుకు రెండు లేదా మూడు సార్లు తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. క్రమం తప్పకుండా వాడటం వల్ల నొప్పుల నుండి అద్భుతమైన ఉపశమనం పొందవచ్చు
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications