Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
నాన్ వెజ్ పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికి అంత మంచిదా.. ఇందులో నిజమెంత?
చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. తినే కంచంలో మాంసం కనిపించకోపోతే తినకుండానే లేచే వాళ్లు కూడా చాలా మందే ఉంటారు. కానీ నాన్ వెజ్ తినే వాళ్లకంటే కూడా పూర్తి శాఖాహారులే ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది అంటుంటారు. స్వచ్ఛమైన శాఖాహారులు అంటే మాంసాహారాన్ని ముట్టుకోని వారు. వీళ్లు గుడ్లు కూడా తినరు. పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటికి కూడా చాలా దూరంగా ఉంటారు. వీరంతా శాఖాహారుల కిందకే వస్తారు. అయితే శాఖాహారుల్లోనూ చాలా రకాలు ఉంటాయి.

స్వచ్ఛమైన శాఖాహారులు అంటే ఎవరు?
లాక్టో ఓవో శాఖాహారులు.. మాంసం, చికెన్, చేపలు వంటివి తినరు, కానీ గుడ్లు, పాల ఉత్పత్తులను తింటారు. లాక్టో శాఖాహారులు.. మాంసం, గుడ్లుు, చేపలు, చికెన్ వంటివి తినరు. కానీ పాల ఉత్పత్తులను తీసుకుంటారు. ఇక ఓవో శాఖాహారులు.. మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు తినరు. కానీ గుడ్లు మాత్రం తింటారు. వీరితో పాటుగానే మరికొంత మంది కూడా ఉంటారు. వారు మాంసాహారంలోని గ్రేవీని తింటారు కానీ ముక్కలను మాత్రం తినరు. కానీ తమను తాము శాఖాహారులుగా చెప్పుకుంటారు. నిజానికి వీరంతా స్వచ్ఛమైన శాఖాహారులు కారు. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు ఇలా అన్నింటికి దూరంగా ఉన్నవారే స్వచ్ఛమైన శాఖాహారులు.
అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది..
స్వచ్ఛమైన శాఖాహారం చాలా మంచిది. ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది. స్వచ్ఛమైన శాఖాహారంలో కొవ్వు నిండిన ఆహార పదార్థాలు ఏమీ ఉండవు. కాబట్టి గుండె వంటి ప్రధాన అవయవాలు వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. దీనివల్ల జీవన కాలం పెరిగే అవకాశం ఉంది. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాఖాహారులు తక్కువ సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్, విటామిన్ సి, విటామిన్ ఈ, డైటరీ ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఫైటో కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకుంటారు.
సరైన ఆహారం ఎంచుకోకపోతే.. పోషకాహార లోపం వచ్చే అవకాశం
దీని వల్ల బరువు కూడా పెరగరు. అయితే శాఖాహారులు చాలా జాగ్రత్తగా ఆహారాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో తవరగా పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంటుంది. శాఖాహారం తీసుకునే వ్యక్తుల్లో విటామిన్ బి, విటామిన్ డి, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, క్యాల్షియం, ఐరన్, జింక్, వంటివి లోపించే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ లోపాలు తీర్చడానికి సప్లిమెంట్లను వాడాలి. లేదా అవి అధికంగా ఉండే ఆహారాలను ఏవో తెలుసుకొని తింటూ ఉండాలి. అయితే కొన్ని మాంసాహార్లోనే ఈ పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి సప్లిమెంట్లను వాడుకోవడం ఉత్తమ పద్ధతి.
శాఖాహారంలో అన్ని రకాల పదార్థాలు తీసుకుంటే మంచిదే. కానీ తీసుకోకపోతే సమస్యలు వస్తాయి. కాబట్టి మాంసాహారం తిన్నా తప్పులేదు. వాటి వల్ల అన్ని రకాల పోషకాలు, మినరల్స్, విటామిన్లు శరీరంలోకి వెళ్తాయి. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే కుళ్లిన మాంసానికి బదులుగా ఫ్రెష్ మాంసం తినడం వల్ల మరింత మంచిది. సో జాగ్రత్తగా ఉండండి. శాఖాహారమైనా, మాంసాహారమైనా మంచివి వెతుక్కొని ఆరోగ్యంగా ఉండండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications